
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న రెండు ఫెసిలిటీలకు రూ.750 కోట్లు వెచ్చిస్తున్నట్టు వెల్లడించింది. తద్వారా వచ్చే 10 ఏళ్లలో 7,500 ఉద్యోగావకాశాలు ఉంటాయని పేర్కొంది. రెండు దశల్లో విస్తరణ ఉంటుందని కంపెనీ వివరించింది. గన్నవరం సమీపంలో కేసరపల్లి వద్ద రూ.400 కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు నేడు (సోమవారం) భూమి పూజ జరుగనుంది.
ఏడేళ్లలో పూర్తి కానున్న తొలి దశ ప్రాజెక్టులో 4,000పైగా ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఉపాధి లభించనుంది. రెండో దశలో అమరావతిలో రూ.350 కోట్ల పెట్టుబడితో 20 ఎకరాల్లో క్యాంపస్ రానుంది. అయిదేళ్లలో ఇక్కడ 3,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని హెచ్‌సీఎల్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment