అమరావతికి టెక్ దిగ్గజం
అమరావతికి టెక్ దిగ్గజం
Published Thu, Feb 23 2017 12:57 PM | Last Updated on Fri, May 25 2018 7:10 PM
అమరావతి : దేశంలోనే నాలుగో అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్కు వచ్చేస్తోంది. తన అతిపెద్ద డెవలప్మెంట్ సెంటర్లలో ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలని ప్లాన్స్ వేస్తోంది. దీని కింద మొత్తం రూ.1000 కోట్ల పెట్టుబడులను హెచ్సీఎల్ టెక్ పెట్టనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఈ విషయంపై ఓ అగ్రిమెంట్ కుదుర్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటి అమరావతిలో దీన్ని నిర్మించనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఈ చర్చలు తుది దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఓ ఐటీ దిగ్గజం పెట్టబోతున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇదే.అయితే ఈ వార్తలపై హెచ్సీఎల్ టెక్నాలజీస్ స్పందించడం లేదు. ఈ డెవలప్ మెంట్ సెంటర్ కోసం అమరావతి పరిసర ప్రాంతాల్లో 30 ఎకరాలకు పైగా భూములు కావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement