వారే ఇక మా ఉద్యోగులంటున్న హెచ్సీఎల్
వారే ఇక మా ఉద్యోగులంటున్న హెచ్సీఎల్
Published Tue, Jan 24 2017 7:25 PM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM
న్యూఢిల్లీ : ట్రంప్ భయానికి ఐటీ దిగ్గజాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి దిగొస్తున్నాయి. క్వార్టర్ ఫలితాల్లో అదరగొట్టిన దేశీయ ఐటీ దిగ్గజం హెచ్సీఎల్, హెచ్-1బీ వీసాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించేస్తుందట. అమెరికాలో క్యాంపస్, ఎంట్రీ లెవల్లో ఉద్యోగాలు చేపడుతూ అక్కడి స్థానికులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని పేర్కొంది. వచ్చే త్రైమాసికాల్లో ఎక్కువ ఉద్యోగులను స్థానికులనే తీసుకోనున్నట్టు పేర్కొంది. ఇప్పటికే ఈ కంపెనీ అక్కడి స్థానికులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పీఠమెక్కిన దగ్గర్నుంచి దేశీయ ఐటీ కంపెనీల్లో తీవ్ర భయాందోళనలు పట్టుకున్నాయి. హెచ్-1బీ, ఎల్1 వీసాలపై మార్పులపై ట్రంప్ ఎక్కువగా దృష్టిపెట్టారు.ఇది భారత ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఈ కంపెనీల 60 శాతం రెవెన్యూలు అమెరికా నుంచే వస్తున్నాయి.
కంపెనీ గ్రోత్కు మద్దతుగా అమెరికాలో ఎంట్రీ లెవల్, క్యాంపస్లలో ఉద్యోగ నియామకాలు చేపడతామని హెచ్సీఎల్ తెలిపింది. వచ్చే క్వార్టర్లలో ఆ ఫలితాలను చూస్తారని హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈవో సి. విజయకుమార్ పేర్కొన్నారు. గత 3-4 ఏళ్లలో కంపెనీ సగటున 1000 కంటే తక్కువగానే వీసాలను అప్లయ్ చేసిందని చెప్పారు. ఈ సంఖ్యను మరింత తగ్గిస్తామని తెలిపారు. అయితే కంపెనీలో స్థానికులు ఎంతమంది ఉన్నారన్నది విజయకుమార్ తెలుపలేదు. 55 శాతానికి పైగా అమెరికాలో నియామకాలు చేపడతామని మాత్రం పేర్కొన్నారు.
Advertisement
Advertisement