హెచ్-1బీ వీసాలతో ఏ దేశానికి లాభం?
హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్.. గత కొంతకాలంగా ఇటు భారత్‌కు, అటు అమెరికాకు వివాస్పదమైంది. ఈ వర్క్‌వీసాలపై వస్తూ తమ ఉద్యోగాలను భారతీయులు కొల్లగడుతున్నారని అమెరికా వాదిస్తుండగా.. భారత్ ఈ విమర్శలను కొట్టిపారేస్తోంది. అసలు ఈ వీసా ప్రొగ్రామ్ వల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరికి ఉండదు? అనుకుంటే. ఇరు దేశాలు ఈ వీసా ప్రొగ్రామ్ వల్ల లబ్ది పొందుతున్నారని తాజా నివేదికల్లో వెల్లడైంది. ది యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ రీసెర్చర్లు చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయం తెలిసింది.
అటు అమెరికా, ఇటు భారత్ ఇరు దేశాలకు హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ ఆర్థిక ప్రయోజాలను అందిస్తుందని చెప్పింది. అమెరికా వీసా ప్రొగ్రామ్ వల్ల ఇరు దేశాల ఆదాయాలు 17.3 బిలియన్ డాలర్లు పెరిగాయని, అంతేకాక అమెరికా, భారత్‌ల ఐటీ ఉత్పత్తి 2010లో 0.45 శాతం పెరిగిందని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ గౌరవ్ ఖన్నా, మిచిగాన్ యూనివర్సిటీ నికోలాస్ మోరాలెస్ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ప్రొగ్రామ్ వల్ల 2010లో అమెరికా ఉద్యోగుల సంపద 431 మిలియన్లకు పెరిగినట్టు కూడా తెలిపారు. ఇమ్మిగ్రేషన్‌తోనే ప్రతి దేశంలోని యావరేజ్ వర్కర్ ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దబడ్డారని అధ్యయనం తెలిపింది.
అమెరికా స్థానిక వర్కర్లకు హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ ఎక్కువ లబ్ది చేకూరుస్తుందని ఖన్నా చెప్పారు. '' అమెరికా కలను సాధించే క్రమంలో ఐటీ బూమ్, ఇతర పర్యవసనాలు'' అనే టైటిల్‌తో ఈ అధ్యయన రిపోర్టును రూపొందించారు. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్‌పై లోతైన విశ్లేషణ, 2000 కాలం నుంచి అమెరికా, భారత ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం వంటి విషయాలపై అధ్యయనం చేశారు. ఈ ప్రొగ్రామ్ ద్వారా విదేశీయులకు అమెరికాలో ఉద్యోగం కల్పించడానికి కంపెనీలకు అనుమతి ఉంటుంది. దేశీయ ఐటీకి అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న అమెరికాలో భారత కంపెనీలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లు హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్‌ను వాడుతూ విదేశీయులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఈ ప్రొగ్రామ్ ద్వారా తక్కువ వేతనానికి భారతీయులను కంపెనీలు నియమించుకుంటూ...తమ ఉద్యోగాలకు గండికొడుతున్నాయని అమెరికా వాదిస్తోంది. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్‌పై అమెరికా కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తోంది.