Local Hiring
-
అందరూ భయపడుతుంటే.. ఇన్ఫోసిస్ మాత్రం ఓకే..
ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు కంపెనీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని గురించి అన్ని కంపెనీలు భయోందోళన చెందుతుంటే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాత్రం తమకు ఓకే అంటోంది.ప్రైవేట్ సంస్థల్లో స్థానిక నియామకాలకు రాష్ట్ర ప్రతిపాదిత రిజర్వేషన్లకు ప్రతిస్పందనగా కర్ణాటక ఏ కొత్త నిబంధనలు, మార్గదర్శకాలను ప్రవేశపెట్టినా తమ కంపెనీ పాటిస్తుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తామని పరేఖ్ స్పష్టం చేశారు. ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు వచ్చినా మద్దతిస్తాం.పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థలలో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించే కర్ణాటక రాష్ట్ర ఉపాధి బిల్లు, 2024 ను ఆ రాష్ట్ర మంత్రివర్గం ఈ వారం ప్రారంభంలో ఆమోదించింది. ఏ పరిశ్రమ, కర్మాగారం లేదా ఇతర సంస్థలు అయినా మేనేజ్ మెంట్ కేటగిరీల్లో 50 శాతం, నాన్ మేనేజ్ మెంట్ కేటగిరీల్లో 70 శాతం స్థానిక అభ్యర్థులను నియమించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది.ఈ బిల్లు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే వ్యాపార ప్రముఖులు, టెక్నాలజీ రంగ ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దీన్ని నిలిపివేశారు. ఈ ఆంక్షల వల్ల స్థానిక నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కొరత ఏర్పడితే కంపెనీలు తరలిపోతాయని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) హెచ్చరించింది.ఫోన్ పే సీఈఓ సమీర్ నిగమ్ ఈ ప్రతిపాదనను సోషల్ మీడియాలో ‘షేమ్’ అంటూ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిపాదిత కోటాను 'ఫాసిస్టు', 'స్వల్పదృష్టి'గా అభివర్ణిస్తూ పరిశ్రమ పెద్దలు కూడా ఈ కోటాపై తీవ్రంగా స్పందించారు. ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టీవీ మోహన్ దాస్ పాయ్ ఈ బిల్లును తిరోగమనంగా అభివర్ణించారు. బయోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా, అసోచామ్ కర్ణాటక కో-చైర్మన్ ఆర్కే మిశ్రా వ్యతిరేక స్వరం వినిపించారు. -
ఫార్మాసిటీలో స్థానికులకే ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా రూపుదిద్దుకుంటున్న ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’లో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐటీ, పరి శ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూమిని ఇస్తున్న వారిలో కనీసం కుటుంబంలో ఒకరికైనా ఉద్యోగం ఇచ్చే దిశగా కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. ఫార్మాసిటీ ఏర్పాటు వల్ల ప్రభావితమవుతున్న కుటుంబాల జాబితా తయారు చేయాలన్నారు. కుటుంబ సభ్యులు, వారి విద్యా, సాంకేతిక అర్హతలను మ్యాపింగ్ చేయాలని చెప్పారు. ఫార్మాసిటీలో మౌలిక వసతుల ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. (బస్సుకు రూట్ క్లియర్..!) అవసరాల మేరకు శిక్షణ ప్రభావిత కుటుంబాల్లో ఆర్హులైన వారికి ఫార్మా రంగానికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ‘తెలం గాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్’(టాస్క్), ఇతర శిక్షణ సంస్థల సహకారం తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. స్థానికులకు నైపుణ్య శిక్షణ కోసం ఫార్మాసిటీ పరిసర మండలాల్లో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఫార్మా సిటీలో పెట్టుబడు లతో ముందుకు వచ్చే కంపెనీలతో కలిసి ఈ శిక్షణ కేంద్రాల ద్వారా అర్హులైన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్కరాజ్ కణ్ణన్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. -
వారే ఇక మా ఉద్యోగులంటున్న హెచ్‌సీఎల్
న్యూఢిల్లీ : ట్రంప్ భయానికి ఐటీ దిగ్గజాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి దిగొస్తున్నాయి. క్వార్టర్ ఫలితాల్లో అదరగొట్టిన దేశీయ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్, హెచ్-1బీ వీసాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించేస్తుందట. అమెరికాలో క్యాంపస్, ఎంట్రీ లెవల్లో ఉద్యోగాలు చేపడుతూ అక్కడి స్థానికులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని పేర్కొంది. వచ్చే త్రైమాసికాల్లో ఎక్కువ ఉద్యోగులను స్థానికులనే తీసుకోనున్నట్టు పేర్కొంది. ఇప్పటికే ఈ కంపెనీ అక్కడి స్థానికులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పీఠమెక్కిన దగ్గర్నుంచి దేశీయ ఐటీ కంపెనీల్లో తీవ్ర భయాందోళనలు పట్టుకున్నాయి. హెచ్-1బీ, ఎల్1 వీసాలపై మార్పులపై ట్రంప్ ఎక్కువగా దృష్టిపెట్టారు.ఇది భారత ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఈ కంపెనీల 60 శాతం రెవెన్యూలు అమెరికా నుంచే వస్తున్నాయి. కంపెనీ గ్రోత్‌కు మద్దతుగా అమెరికాలో ఎంట్రీ లెవల్, క్యాంపస్‌లలో ఉద్యోగ నియామకాలు చేపడతామని హెచ్‌సీఎల్ తెలిపింది. వచ్చే క్వార్టర్లలో ఆ ఫలితాలను చూస్తారని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈవో సి. విజయకుమార్ పేర్కొన్నారు. గత 3-4 ఏళ్లలో కంపెనీ సగటున 1000 కంటే తక్కువగానే వీసాలను అప్లయ్ చేసిందని చెప్పారు. ఈ సంఖ్యను మరింత తగ్గిస్తామని తెలిపారు. అయితే కంపెనీలో స్థానికులు ఎంతమంది ఉన్నారన్నది విజయకుమార్ తెలుపలేదు. 55 శాతానికి పైగా అమెరికాలో నియామకాలు చేపడతామని మాత్రం పేర్కొన్నారు.