కరోనా వ్యాప్తి తీవ్రతరమైంది సమయంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాయి. అయితే కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా కొంతమంది ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ససేమిరా అంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని హెచ్‌సీఎల్‌టెక్ కొత్త పాలసీని అందుబాటులో తీసుకురానుంది.
ఆఫీసులకు వచ్చినవారికి మాత్రమే లీవ్స్ అందింస్తామని, ఆఫీసులకు రాకుండా లీవ్ తీసుకుంటే శాలరీలో కోతలు ఉంటాయని హెచ్‌సీఎల్‌టెక్ వెల్లడించింది. మహమ్మారి తర్వాత ఉద్యోగులను తిరిగి క్యాంపస్‌కు తీసుకురావడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగులు వారానికి మూడు రోజులు, నెలలో కనీసం 12 రోజులు ఆఫీసులో ఉండాలి. హైబ్రిడ్ వర్క్ మోడల్‌కి మారిన ఐదు నెలల తర్వాత హెచ్‌సీఎల్‌టెక్ ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసుకు తిరిగి రావాలని కోరింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఉద్యోగులకు ఈ మెయిల్స్ ద్వారా వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment