ఈ హీరోయిన్‌ ధరించిన డ్రెస్‌ ధర 9500! జైరా బ్రాండ్‌.. సామాన్యులకు కూడా! | Fashion: Varsha Bollamma In Lavender Churidar Check Price Details | Sakshi
Sakshi News home page

Varsha Bollamma: ఈ హీరోయిన్‌ ధరించిన డ్రెస్‌ ధర 9500! జైరా బ్రాండ్‌ ప్రత్యేకత అదే! సామాన్యులకు కూడా

Dec 5 2022 4:17 PM | Updated on Dec 5 2022 4:42 PM

Fashion: Varsha Bollamma In Lavender Churidar Check Price Details - Sakshi

‘మిడిల్‌ క్లాస్‌ మెలోడిస్‌’తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తార.. వర్ష బొల్లమ్మ. సాదాసీదా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ.. తన సహజమైన నటనతో మురిపించిన ఆమె ఫ్యాషన్‌ అభిరుచిని తెలిపే బ్రాండ్స్‌ ఏంటో చూద్దాం...

జైరా
‘ఎవరి అందం వారిదే. ఆ అందాన్ని రెట్టింపు చేయడమే నా బ్రాండ్‌ లక్ష్యం’ అంటోంది కేరళకు చెందిన జైరా. ఫ్యాషన్‌ పై ఉన్న ప్యాషన్‌తో చదువు పూర్తయిన వెంటనే తన పేరు మీదే ఓ బోటిక్‌ ప్రారంభించింది.  అందమైన డిజైన్స్‌తో అనతికాలంలోనే  ఫ్యాషన్‌ ప్రపంచంలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఆమె డిజైన్స్‌కు సెలబ్రిటీలు కూడా వీరాభిమానులయ్యారు. అయినా సామాన్యులూ కొనగొలిగే స్థాయిలోనే   జైరా బ్రాండ్‌ ధరలు ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం..

అడోర్‌.. 
ఇదొక ఆన్‌లైన్‌ స్టోర్‌. ఢిల్లీకి చెందిన ప్రియాంక, సుధీర్‌ కుమార్‌ అనే ఇద్దరు స్నేహితులు స్థాపించిన ఈ బ్రాండ్‌.. అతి తక్కువ సమయంలోనే కస్టమర్‌–సెంట్రిక్‌ కంపెనీగా నిలిచింది. తక్కువ ధరలకే చక్కటి డిజైన్లలో సహజమైన రాతి ఆభరణాలను అందిస్తున్నారు. అదే వీరి బ్రాండ్‌ వాల్యూ. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేసే వీలుంది.

లైట్‌ అప్‌ సోల్‌..
సంప్రదాయ అల్లికలు, కుందన్‌  వర్క్స్‌తో ఫుట్‌వేర్‌ అందించడం ‘లైట్‌ అప్‌ సోల్‌’ స్పెషాలిటీ. అంతేకాకుండా అందమైన హ్యాండ్‌ మేడ్‌ బ్యాగులు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇవన్నీ  సరసమైన ధరల్లోనే దొరుకుతాయి. కానీ ఆన్‌లైన్‌ స్టోర్‌లో మాత్రమే!

బ్రాండ్‌ వాల్యూ
డ్రెస్‌ బ్రాండ్‌: జైరా
ధర: రూ. 9,500

జ్యూయెలరీ
బ్రాండ్‌: అడోర్‌
ధర: రూ. 395

ఫుట్‌వేర్‌
బ్రాండ్‌: లైట్‌ అప్‌ సోల్‌
ధర: రూ. 999

-దీపిక కొం‍డి

చదవండి: పర్పుల్‌ కలర్‌ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న ‘వింక్‌ బ్యూటీ’! డ్రెస్‌ ధర ఎంతంటే!
Floral Designer Wear: ఈవెనింగ్‌ పార్టీల్లో ఫ్లోరల్‌ డిజైనర్‌ వేర్‌తో మెరిసిపోండిలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement