ఒంటి మీదే క్షణాల్లో ఆల్టరేషన్‌.. రణ్‌వీర్‌ డ్రెసెస్‌కి కూడా! ఈ చీర ధర తెలిస్తే.. | Deepika Padukone In Sabyasachi Black Saree Cost Leaves In Shock | Sakshi
Sakshi News home page

Deepika Padukone: ఒంటి మీదే క్షణాల్లో ఆల్టరేషన్‌.. రణ్‌వీర్‌ డ్రెసెస్‌కి కూడా! ఈ చీర ధర తెలిస్తే..

Published Wed, Mar 15 2023 7:18 PM | Last Updated on Wed, Mar 15 2023 7:38 PM

Deepika Padukone In Sabyasachi Black Saree Cost Leaves In Shock - Sakshi

దీపికా పదుకోణ్‌  పరిచయం అక్కర్లేని పేరు. ది గోల్డెన్‌ రేషియో ఆఫ్‌ బ్యూటీ (ఫై)లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు. ఆ అందానికి చక్కటి అవుట్‌ ఫిట్స్‌ని డిజైన్‌ చేస్తున్న  ఫ్యాషన్‌ బ్రాండ్స్‌లో ఇది కూడా.. 

సబ్యసాచి...
పేరుకే ఇండియన్‌ బ్రాండ్‌ కానీ, ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌కున్నంత పేరు.. డిమాండ్‌ సబ్యసాచి సొంతం. దాదాపు బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌ పెళ్లిళ్లు అన్నీ సబ్యసాచి కలెక్షన్స్‌తోనే జరుగుతాయి. వాటిల్లో  విరాట్‌ కొహ్లీ, అనుష్క శర్మల పెళ్లి బట్టలు ఫేమస్‌. కనీసం ఒక్కసారైనా సబ్యసాచి డిజైన్‌ వేర్‌ ధరించాలని.. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఏంతోమంది ఆశపడుతుంటారు.

ఆ బ్రాండ్‌కున్న వాల్యూ అలాంటిది. ఈ మధ్యనే మధ్యతరగతి మహిళల కోసం రూ. పదివేల చీరను డిజైన్‌ చేశారు. ఇదే ఈ బ్రాండ్‌ చీపెస్ట్‌ చీర. సుమారు లక్ష చీరలను సిద్ధం చేస్తే, రెండు రోజుల్లోనే మొత్తం కొనుగోలు చేశారు. పదివేల చీరైనా, పదినిమిషాల్లో అమ్ముడైపోతుంది. ఇదంతా సబ్యసాచి ముఖర్జీ డిజైన్‌ మహత్యం.

బెంగాలీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సబ్యసాచి.. తన కెరీర్‌ ఆరంభించిన అనతి కాలంలోనే ఫేమస్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఎదిగారు. 1999లో తన పేరునే ఓ బ్రాండ్‌ హౌస్‌గా మార్చి, మరింత పాపులర్‌ అయ్యారు. అందమైన ఆభరణాలు కూడా ‘సబ్యసాచి’ స్టోర్స్‌లో లభిస్తాయి. ఇండియాలోని ప్రముఖ నగరాలతోపాటు అమెరికా, లండన్‌లోనూ ఈ బ్రాండ్‌కి స్టోర్స్‌ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. 

బ్రాండ్‌ వాల్యూ 
చీర బ్రాండ్‌: సబ్యసాచి.. 
ధర: రూ. 1,95,000

బెల్టు ధర: రూ. 29,900
కమ్మలు ధర:  ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 

నా బ్యాగులో సూది, దారం తప్పనిసరిగా ఉంటాయి. ఎప్పుడైనా వేసుకున్న డ్రెస్‌ కంఫర్ట్‌గా లేకపోతే ఒంటి మీదే క్షణాల్లో ఆల్టరేషన్‌ చేసేసుకుంటా. రణ్‌వీర్‌ డ్రెసెస్‌కూ ఆల్టరేషన్‌ చేస్తా.. – దీపిక పదుకోణ్‌.  
-దీపిక కొండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement