మోడర్న్‌ డ్రెసెస్‌ కంటే.. చీరకట్టు అంటేనే ఇష్టం: హీరోయిన్‌ | Actress Lavanya Tripathi In Masaba Gupta Green Saree Details | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: మోడర్న్‌ డ్రెసెస్‌ కంటే.. చీరకట్టు అంటేనే ఇష్టం: హీరోయిన్‌

Published Sun, May 14 2023 4:49 PM | Last Updated on Sun, May 14 2023 5:04 PM

Actress Lavanya Tripathi In Masaba Gupta Green Saree Details - Sakshi

‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా’  అనే క్రేజీ డైలాగ్‌తో అంతే క్రేజ్‌ సంపాదించుకున్న  ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి. అంతటి అందానికి మ్యాచ్‌ అయ్యే స్టయిల్‌ను క్రియేట్‌ చేస్తున్న ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఇవే..  

ఆర్ట్‌ బై సియా.. 
ఇదొక ఆన్‌లైన్‌ జ్యూలరీ స్టోర్‌. ప్రముఖ డిజైనర్స్‌ అందించే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తతరం డిజైనర్స్‌కి ప్రాముఖ్యతనివ్వడంతో, డిజైన్స్‌ అన్నింటిలోనూ న్యూ స్టయిల్‌ ప్రతిబింబిస్తోంది. అదే దీనికి యాడెడ్‌ వాల్యూ.

పేరుకు దేశీ బ్రాండ్‌ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. మొదట ఆన్‌లైన్‌లోనే  కొనే వీలుండేది. ఈ మధ్యనే హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో స్టోర్‌ ఓపెన్‌ చేశారు. 

మసాబా గుప్తా
ఇప్పుడున్న టాప్‌ మోస్ట్‌ డిజైనర్స్‌లో మసాబా గుప్తానే ఫస్ట్‌. 2009లో ‘హౌస్‌ ఆఫ్‌ మసాబా’ పేరుతో బ్రాండ్‌ను ప్రారంభించింది. నాణ్యత, సృజన బ్రాండ్‌ వాల్యూగా సాగిపోతున్న ఆమె డిజైన్స్‌ అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. ప్రపంచ వ్యాప్త సెలబ్రిటీస్‌ ఆమె బ్రాండ్‌కు అభిమానులుగా మారారు.

మసాబా ఎవరి కూతురో తెలుసు కదా.. ప్రముఖ నటి నీనా గుప్తా, క్రికెట్‌ లెజెండ్‌ వివ్‌ రిచర్డ్స్‌ల తనయ. పేరెంట్స్‌ పేరు ప్రఖ్యాతులను తన కెరీర్‌కి పునాదిగా మలచుకోకుండా కేవలం తన క్రియెటివిటీనే పెట్టుబడిగా పెట్టి కీర్తినార్జించిన ఇండిపెండెంట్‌ డిజైనర్‌.. అంట్రపెన్యూర్‌ ఆమె!

బ్రాండ్‌ వాల్యూ 
చీర బ్రాండ్‌: మసాబా గుప్తా
ధర: రూ. 18,000

జ్యూలరీ బ్రాండ్‌: ఆర్ట్‌ బై సియా 
ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

మోడర్న్‌ డ్రెసెస్‌ కంటే, ట్రెడిషనల్‌ వేర్‌ అంటేనే ఎక్కువ ఇష్టం. అందులోనూ చీరకట్టు అంటే మరీనూ! – లావణ్య త్రిపాఠి 
-దీపిక కొండి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement