న్యూఢిల్లీ: దేశీయంగా అత్యంత విలువైన 75 బ్రాండ్స్ విలువ ఈ ఏడాది 379 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. 2022తో పోలిస్తే 4 శాతం క్షీణించింది. ఇటీవలి కాలంలో వ్యాపారాలు, వినియోగదారులకు సరఫరా వ్యవస్థ సంబంధ సమస్యలు, పెరిగిన వడ్డీ రేట్లు తదితర సవాళ్లు ఎదురవడం ఇందుకు కారణం.
మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ సంస్థ కాంటార్ రూపొందించిన బ్రాండ్ రిపోర్టులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం అంతర్జాతీయంగా చూస్తే 100 అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్స్ విలువ 20 శాతం మేర పడిపోయింది. టాప్ 10 విలువైన భారతీయ బ్రాండ్స్‌లో 43 (సుమారు రూ.3.57 లక్షల కోట్లు)బిలియన్ డాలర్లతో సుమారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫీ, ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, జియో మొదలైనవి తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సమీక్షాకాలంలో పలు రంగాలు వృద్ధి నమోదు చేయగా, ఆటోమోటివ్, టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ వంటివి స్థిరంగా ఉన్నాయని కాంటార్ ఎండీ సౌమ్య మొహంతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment