Indian company
-
రూ.6200 కోట్ల కంపెనీ: ఇప్పుడు జీతాలివ్వలేక..
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉపయోగించే మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్. ఈ వాట్సప్‌ను బిజినెస్ అవకాశాల కోసం కూడా వినియోగిస్తారు. ఇలా వినియోగించించుకుని కోట్ల విలువైన సంస్థగా ఎదిగిన 'డుంజో' (Dunzo).. ఈ రోజు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థికి చేరిపోయింది.భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నిత్యావసరాలను అందించే 'డుంజో' గ్రోసరీ డెలివరీ యాప్ కాలంలోనే రూ. 6200 కోట్ల విలువైన కంపెనీగా అవతరించింది. ఇటీవల సుమారు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు ఆ సంస్థలో కేవలం 50 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నట్లు సమాచారం.డుంజో ఎలా ప్రారంభమైందంటే..కబీర్ బిస్వాస్, అంకుర్ అగర్వాల్, దల్వీర్ సూరి, ముకుంద్ ఝా కలిసి హోపర్ను కొనుగోలు చేసిన తర్వాత డుంజో ప్రారంభమైంది. కంప్యూటర్ ఇంజనీర్ అయిన కబీర్ ఎంబీఏ చదవాలని నిర్ణయించుకునే ముందు సిల్వస్సాలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పని చేయడం ద్వారా బిజినెస్ మీద ఆసక్తి పెంచుకున్నారు. ఆ తరువాత ఎయిర్‌టెల్‌లో చేరి సేల్స్, కస్టమర్ సర్వీస్ వంటివాటిపై ద్రుష్టి పెట్టారు.బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ప్రత్యర్థులు ఆవిర్భవించకముందే.. డుంజో ప్రజలకు నిత్యావసరాలను డెలివరీ చేసింది. దీనికోసం వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఇదే తరువాత ఇతర ప్రధాన నగరాలకు వ్యాపించింది. ఈ సంస్థలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఏకంగా రూ. 1600 కోట్లు పెట్టుబడులు పెట్టింది. దీంతో డుంజో విలువ రూ. 6200 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: పండగ సీజన్‌పై ఫోకస్.. లక్ష ఉద్యోగాలకు అవకాశండుంజో నష్టాలకు కారణంవేలకోట్ల కంపెనీగా అవతరించిన డుంజో కాలక్రమంలో ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఈ కంపెనీ క్రమంగా దివాలవైపు అడుగులు వేసింది. గత ఏడాది ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వడంలో చాలా ఆలస్యం చేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1800 కోట్ల రూపాయల నష్టాన్ని చూసింది. -
బొలీవియా కంపెనీతో చేతులు కలిపిన ఆల్ట్‌మిన్ - ఎందుకో తెలుసా?
దక్షిణ అమెరికాలో లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయడానికి యాక్టివ్ మెటీరియల్స్ కోసం పైలట్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి బొలీవియన్ స్టేట్ కంపెనీ 'యాసిమియంటోస్ డి లిటియో బొలీవియానోస్' (YLB)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్ బేస్డ్ బ్యాటరీ యాక్టివ్ మెటీరియల్స్ తయారీ కంపెనీ ఆల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. ముడి పదార్థాల సరఫరాలను అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా.. లిథియం అయాన్ బ్యాటరీల కోసం కాథోడ్ యాక్టివ్ మెటీరియల్స్ (CAMs) ఉత్పత్తి కోసం ఈ ఒప్పదం జరిగినట్లు తెలుస్తోంది. స్వదేశీ లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో పురోగతి కోసం ఏర్పడిన ఈ సహకారం మొదటిది. ఇది మొత్తం సరఫరా గొలుసును సానుకూలంగా ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ భాగస్వామ్యం లిథియం కోసం పరిశోధన, అభివృద్ధి, పైలటింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడం.. ద్వైపాక్షిక ముడి పదార్థాల సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. గత నెలలో YLB నుంచి కొంత మంది నిపుణుల బృందం హైదరాబాద్‌లోని ఆల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్ సందర్శించింది. ఆ తరువాత బొలీవియన్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ ఈ ఒప్పందాన్ని ఆమోదించుకోవడానికి, 'ఆల్ట్‌మిన్'ను బొలీవియాకు ఆహ్వానించింది. ఈ ఒప్పందం ఏర్పర్చుకున్న సందర్భంగా YLB ప్రెసిడెంట్ 'కార్లా కాల్డెరాన్' మాట్లాడుతూ.. ఈ సమావేశం లిథియం అయాన్ బ్యాటరీల క్రియాశీల పదార్థాల సాంకేతిక అభివృద్ధికి సహకారాన్ని అందిస్తుంది, పోటోసిలో పైలట్ ప్లాంట్‌ను అమలు చేయడం ద్వారా, పైలట్ ప్లాంట్ ఈ సంవత్సరం 3 గిగావాట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇదీ చదవండి: దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ ఆల్ట్‌మిన్ వ్యవస్థాపకుడు,ఎండీ 'మౌర్య సుంకవల్లి' మాట్లాడుతూ.. YLBతో చేతులు కలపడంతో ప్రపంచ బ్యాటరీ మార్కెట్లో కంపెనీ గొప్ప స్థానం పొందుతుందని భవిస్తున్నాము. 2030 నాటికి ఆల్ట్‌మిన్ 10 GWh LFPని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుందని వెల్లడిస్తూ.. ఖనిజ విభాగంలో రెండు దేశాల మధ్య ఏర్పడిన ఈ ఒప్పందం ఓ ముఖ్యమైన మైలురాయి అని తెలిపారు. -
అగ్రస్థానం..దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా టీసీఎస్..
న్యూఢిల్లీ: దేశీయంగా అత్యంత విలువైన 75 బ్రాండ్స్ విలువ ఈ ఏడాది 379 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. 2022తో పోలిస్తే 4 శాతం క్షీణించింది. ఇటీవలి కాలంలో వ్యాపారాలు, వినియోగదారులకు సరఫరా వ్యవస్థ సంబంధ సమస్యలు, పెరిగిన వడ్డీ రేట్లు తదితర సవాళ్లు ఎదురవడం ఇందుకు కారణం. మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ సంస్థ కాంటార్ రూపొందించిన బ్రాండ్ రిపోర్టులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం అంతర్జాతీయంగా చూస్తే 100 అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్స్ విలువ 20 శాతం మేర పడిపోయింది. టాప్ 10 విలువైన భారతీయ బ్రాండ్స్‌లో 43 (సుమారు రూ.3.57 లక్షల కోట్లు)బిలియన్ డాలర్లతో సుమారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫీ, ఎయిర్టెల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, జియో మొదలైనవి తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సమీక్షాకాలంలో పలు రంగాలు వృద్ధి నమోదు చేయగా, ఆటోమోటివ్, టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ వంటివి స్థిరంగా ఉన్నాయని కాంటార్ ఎండీ సౌమ్య మొహంతి తెలిపారు. -
భారత్ దగ్గు మందు సురక్షితం కాదు: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
జెనీవా: ఇరాక్‌లో విక్రయిస్తున్న భారత్ తయారీ దగ్గు మందు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జలుబు, దగ్గు నివారణ కోసం ‘కోల్డ్ అవుట్’ పేరుతో దగ్గు రూపొందించిన సిరప్ తయారీలో వాడే పదార్థాలు పరిమితికి మించి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. చెన్నైకు చెందిన ఫోర్ట్స్ ల్యాబోరేటరీస్ కంపెనీ తయారు చేసిన కోల్డ్ అవుట్ అనే దగ్గు మందును ఇరాక్‌కు చెందిన దాబిలైఫ్ ఫార్మాకు విక్రయించింది. ఈ మందులో డైథిలీన్ ఇథలీన్ మోతాదుకు మించి ఉన్నట్టుగా డబ్ల్యూహెచ్ఒ గుర్తించింది. కోల్డ్ అవుట్లో 0.25% డైఇథలీన్, 2.1% ఇథలీన్ గ్లైకాల్‌లు ఉన్నట్లు తెలిపింది. ఈ దీని వినియోగం సురక్షితం కాదని డబ్ల్యూహెచ్‌వో సూచించింది చిన్నారులు ఈ మందు తాగితే అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. తీవ్ర అస్వస్థతకు గురై మరణం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా ఇటీవల భారత్‌లో తయారైన సిరప్ గురించి డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేయడం ఇదే ప్రథమం. కాగా గతంలో భారత్‌లో తయారైన దగ్గు మందులను ఉపయోగించడం వల్ల ఉజ్బెకిస్థాన్‌లోని గాంబియాలో 89 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో సిరప్‌ను ఉజ్బెకిస్థాన్‌కు సరఫరా చేసిన మరియోన్ బయోటెక్ అనుమతులను భారత్ ప్రభుత్వం రద్దు చేసింది. అంతకముందు కామెరూన్లో చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు తయారు చేసిన రీమాన్ ల్యాబ్స్ కూడా సిరప్ తయారీలో నాణ్యత పాటించలేదని విచారణలో తేలింది. -
భారత కంపెనీల్లో తగ్గిన పీఈ పెట్టుబడులు
ముంబై: భారత కంపెనీల్లో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు (పీఈ, వీసీ) ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లో 23 శాతం మేర తగ్గి (క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు) 27.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. విలువ పరంగా చూస్తే గతేడాది ద్వితీయ ఆరు నెలల కాలంలోని పెట్టుబడులు 20.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే 33 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. గతేడాది తొలి ఆరు నెలల్లో పీఈ, వీసీ పెట్టుబడులు 35.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ వివరాలను పరిశ్రమ మండలి అయిన ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేటివ్ క్యాపిటల్ అసోసియేషన్ (ఏవీసీఏ), కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా విడుదల చేశాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో పీఈ, వీసీ పెట్టుబడుల లావాదేవీలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు సంఖ్యా పరంగా 44 శాతం తగ్గాయి. మొత్తం 427 లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తంమీద పీఈ, వీసీ పెట్టుబడుల ధోరణి సానుకూలంగానే ఉందని, ముఖ్యంగా స్టార్టప్‌ల్లోకి పెట్టుబడులు తగ్గినట్టు ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. పీఈ, వీసీ సంస్థలు ఈ ఏడాది ఆరు నెలల్లో 10.2 బిలియన్ డాలర్లను సమీకరించాయి. ఇది రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తుందని ఈ నివేదిక తెలిపింది. నెలవారీగా చూస్తే పీఈ, వీసీ పెట్టుబడుల విలువ జూన్‌లో 3.1 బిలియన్ డాలర్లుగా ఉందని, మే నెలతో పోలిస్తే 9 శాతం తక్కువని పేర్కొంది. -
లావాకి షాకిచ్చిన సెబీ.. ఐపీవోకు బ్రేక్
న్యూఢిల్లీ: మొబైల్ తయారీ దేశీ కంపెనీ లావా ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కంపెనీ దాఖలు చేసిన ప్రాథమిక దరఖాస్తును క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెనక్కి పంపించింది. కొన్ని అంశాలలో తాజా సమాచారాన్ని క్రోడికరించి తిరిగి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయవలసిందిగా ఆదేశించింది. వెరసి లావా లిస్టింగ్ ఆలస్యమయ్యే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. లావా, జోలో బ్రాండ్లతో మొబైల్ హ్యాండ్ సెట్లు, ట్యాబ్లెట్లు తదితర ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను లావా ఇంటర్నేషనల్ రూపొందిస్తోంది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా కంపెనీ 2021 సెప్టెంబర్‌లో సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 4.37 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను బ్రాండుకు ప్రాచుర్యం, ఇతర సంస్థల కొనుగోళ్లు, అనుబంధ సంస్థలలో పెట్టుబడులు తదితరాలకు వినియోగించనుంది. చదవండి: విమాన ప్రయాణం.. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయమంటారు, ఎందుకో తెలుసా? -
Forbes World Best Employers for 2022: దేశంలో అత్యుత్తమ సంస్థగా రిలయన్స్
న్యూఢిల్లీ: మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అగ్రగామిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఉద్యోగులకు అత్యుత్తమ యాజమాన్య సంస్థగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఫోర్బ్స్ సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమ యాజమాన్య సంస్థలకు 2022 సంవత్సరానికి ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఆల్ఫాబెట్ (గూగుల్), యాపిల్ వరుసగా ఉన్నాయి. అంతేకాదు 2 నుంచి 12వ స్థానం వరకు ర్యాంకులు అమెరికా కంపెనీలే సొంతం చేసుకున్నాయి. 13వ స్థానంలో జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ గ్రూపు ఉంది. అమెజాన్ 14, డెకథ్లాన్ 15వ ర్యాంకు సొంతం చేసుకున్నాయి. టాప్–100లో రిలయన్స్ ఒక్కటే ఫోర్బ్స్ తాజా జాబితాలో టాప్–100 ర్యాంకుల్లో నిలిచిన ఏకైక భారతీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ సంస్థల్లో 2,30,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలైన మెర్సెడెజ్ బెంజ్, కోకకోలా, హోండా, యమహా, సౌదీ అరామ్కో రిలయన్స్ వెనుకే ఉండడం గమనార్హం. ఈ జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు 137, బజాజ్ (173), ఆదిత్య బిర్లా గ్రూపు (240), హీరో మోటోకార్ప్ (333), ఎల్అండ్టీ (354), ఐసీఐసీఐ బ్యాంకు (365), హెచ్‌సీఎల్ టెక్ (455), ఎస్బీఐ (499), అదానీ ఎంటర్ప్రైజెస్ (547), ఇన్ఫోసిస్ (668) ర్యాంకులతో నిలిచాయి. అధిక వేతనాలు, మెరుగైన ప్రయోజనాలు, ఉన్నత అవకాశాలు, పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యానికి తోడు, ప్రయోజనం ఆధారిత పనికే తమ ప్రాధాన్యమని ఉద్యోగులు స్పష్టం చేసినట్టు ఫోర్బ్స్ తెలిపింది. 57 దేశాల పరిధిలో 1,50,000 మంది పార్ట్‌టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగులను సర్వే చేసి ఫోర్బ్స్ ఈ ర్యాంకులు కేటాయించింది. ఇందుకోసం మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా సాయం తీసుకుంది. జాబితాలో మొత్తం 800 కంపెనీలకు ర్యాంకులు లభించాయి. -
భారత కంపెనీపై అమెరికా ఆంక్షలు
ఢిల్లీ: భారత్‌కు చెందిన ఓ కంపెనీపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. ఆంక్షలను లెక్క చేయకుండా ఇరాన్ నుంచి పెట్రోలియం ప్రొడక్టులు కొనుగోలు చేయడమే అందుకు కారణం. అంతేకాదు.. సదరు కంపెనీ ఆ ఉత్పత్తులను చైనాకు రవాణా చేస్తున్నట్లు అగ్రరాజ్యం ఆరోపించింది. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఆఫీస్ అడ్రస్‌తో ఉన్న టిబాలాజీ పెట్రోకెమ్ కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ కంపెనీతో పాటు యూఏఈ, హాంగ్ కాంగ్‌కు చెందిన మొత్తం ఏడు కంపెనీలు సైతం అమెరికా ఆంక్షలను ఎదుర్కొనున్నాయి. ఈ మేరకు ఓఎఫ్ఏసీ(Office of Foreign Assets Control) ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌తో న్యూక్లియర్ డీల్ చెదిరిన తర్వాత 2018-19 నడుమ ట్రంప్ హయాంలోని ప్రభుత్వం ఏకపక్ష ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం 2019 నుంచి ఇరాన్‌తో ఆయిల్ ఉత్పత్తుల దిగుమతి ఒప్పందాల్ని నిలిపివేసింది. అయితే.. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం పెరిగింది. ఇక తాజా ఆంక్షల విధింపు పరిణామం.. విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే చోటు చేసుకోవడం గమనార్హం. టిబాలాజీ కంపెనీ మిలియన్ల డాలర్ల విలువైన పెట్రోకెమికల్ ఉత్పత్తులను ఇరాన్ కంపెనీ ట్రిలయన్స్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
ఈ కంపెనీలు 60 సెకన్లకు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా?
ఓ ఉద్యోగి నెల సంపాదన ఎంత ఉండొచ్చు. మహా అయితే నెలకు 20 నుంచి 30 వేలు ఉంటే..మరి మన దేశంలో దిగ్గజ కంపెనీలు నెలకు కాదు గంటకు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా? ఇటీవల ఆయా కంపెనీలు, ప్రముఖుల ఆదాయాలపై సర్వే నిర్వహించే ఫైన్ షాట్స్ సంస్థ..ఈ సారి మనదేశంలో పలు దిగ్గజ సంస్థలు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాయో తెలుసుకునేందుకు ఓ సర్వే నిర్వహించింది. స్టాక్ మార్కెట్లో కంపెనీల వ్యాల్యూ ఆధారంగా రిపోర్ట్‌ను విడుదల చేసింది. అందులో మనదేశానికి పలు కంపెనీలు నిమిషానికి సుమారు రూ.10లక్షలు అర్జించడం గమనార్హం. వాటిలో భారత్ పెట్రోలియం నిమిషానికి రూ.3.7లక్షల్ని సంపాదిస్తుంది. ఓఎన్జీసీ నిమిషానికి రూ.3.9లక్షల్ని అర్జిస్తుంది ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ నిమిషానికి రూ.3.9లక్షల్ని సంపాదిస్తుంది. హెచ్డీఎఫ్సీ నిమిషానికి రూ.3.56లక్షల్ని సంపాదిస్తుంది. ఇన్ఫోసిస్ నిమిషానికి రూ.3.68లక్షల్ని సంపాదిస్తుంది. ఇండియన్ ఆయిల్ కంపెనీ నిమిషానికి రూ.4.14లక్షలు సంపాదిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిమిషానికి రూ.4.24లక్షల్ని సంపాదిస్తుంది హెచ్డీఎఫ్సీ నిమిషానికి రూ.6.5లక్షల్ని సంపాదిస్తుంది టీసీఎస్ కంపెనీ నిమిషానికి రూ.6.17లక్షల్ని సంపాదిస్తుంది. రిలయన్స్ సంస్థ నిమిషానికి రూ.9.34లక్షల్ని సంపాదిస్తూ ప్రదమ స్థానంలో నిలిచింది. -
టీకా టెక్నాలజీ బదిలీకి సిద్ధం
సెయింట్ పీటర్స్బర్గ్ (రష్యా): రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ స్పుత్నిక్–వీ తయారీకి భారతీయ కంపెనీలు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాక్సిన్ టెక్నాలజీ బదిలీకి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. విదేశాల్లో కూడా టీకా ఉత్పత్తిని విస్తృతం చేస్తామన్నారు. వ్యాక్సిన్ టెక్నాలజీని పంచుకోవడానికి సిద్ధమైన ఏకైక దేశం రష్యాయేనని చెప్పారు. అమెరికా, భారత్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన అంతర్జాతీయ వార్తా సంస్థల సీనియర్ ఎడిటర్లతో పుతిన్ శనివారం ఆన్లైన్లో సంభాషించారు. పీటీఐ, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్ తదితర సంస్థల ఎడిటర్లతో మాట్లాడుతూ స్పుత్నిక్– వీ సమర్థతపై వస్తున్న ఆరోపణల్ని తోసిపుచ్చారు. 97.6 శాతం సామర్థ్యంతో తమ వ్యాక్సిన్ పని చేస్తోందని స్పష్టం చేశారు. యూరప్ దేశాల్లో వ్యాక్సిన్ కంపెనీల మధ్య పోటీ, వాణిజ్యపరమైన కారణాల వల్ల స్పుత్నిక్– వీ రిజిస్ట్రేషన్‌లో జాప్యం జరుగుతోందని అన్నారు. ఇప్పటికే 66 దేశాల్లో స్పుత్నిక్– వీని విక్రయిస్తున్నామని, తమ వ్యాక్సిన్ మంచి మార్కెట్ ఉందన్నారు. స్పుత్నిక్– వీ వ్యాక్సిన్ తయారీకి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి డీసీజీఐ ప్రాథమిక అనుమతులు ఇచ్చిన నేపథ్యంలోనే పుతిన్ టెక్నాలజీని పంచుకోవడానికి సిద్ధమని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఈ వ్యాక్సిన్ పంపిణీ బాధ్యతల్ని చేపట్టింది. మరోవైపు అమెరికా సహా కొన్ని దేశాలు కరోనా సంక్షోభానికి చైనాయే కారణమని నిందిస్తున్న అంశంపై అడిగిన ప్రశ్నకు పుతిన్ సమాధానమిస్తూ ఇప్పటికే ఈ విషయంపై చాలా ఎక్కువగా తాను మాట్లాడానని, కొత్తగా చెప్పడానికి ఏమీలేదన్నారు.సంక్షోభాన్ని ఎప్పుడూ రాజకీయం చేయకూడదని హితవు పలికారు. మోదీ, జిన్‌పింగ్ బాధ్యతాయుత నాయకులు భారత్, చైనా సరిహద్దు వివాదాల్ని ఆ రెండు దేశాలే పరిష్కరించుకోవాలని పుతిన్ వ్యాఖ్యానించారు. మూడోదేశం ఈ అంశంలో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎంతో బాధ్యత కలిగిన నాయకులని... సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునే సామర్థ్యం వారికుందని అభిప్రాయపడ్డారు. రష్యా, చైనాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం... భారత్, రష్యాల రక్షణ బంధంపై ప్రభావం చూపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు భారత్‌తో కూడా తమకు బలీయమైన బంధం ఉందని అన్నారు. రష్యా, భారత్ మధ్య బంధం నమ్మకం అనే పునాది మీద ఏర్పడిందని, దానికొచ్చే ఇబ్బందేమీ లేదని చెప్పారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌లు క్వాడ్ పేరుతో ఒక బృందంగా ఏర్పడడం, భారత్ అందులో భాగస్వామ్యం కావడంపై రష్యా విదేశాంగ మంత్రి బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై పుతిన్ మాట్లాడుతూ ఏ దేశంతో సన్నిహితంగా మెలగాలి, ఎంతవరకు సంబంధాల్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకునే హక్కు ప్రతీ సార్వభౌమ దేశానికి ఉంటుందని, దానిని ఎవరూ కాదనలేరని వ్యాఖ్యానించారు. -
100 బిలియన్ డాలర్ల క్లబ్లో రిలయన్స్ రీటైల్
సాక్షి, ముంబై: అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ కు చెందిన రిలయన్స్ రిటైల్ 100 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ మార్క్ సాధించిన 4వ భారతీయ కంపెనీగా అవతరించింది. కిరాణా నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ దేశవ్యాప్తంగా రిటైల్ చెయిన్ నిర్వహిస్తున్న కంపెనీ ఈ సరికొత్త మార్కును అందుకుంది. అయితే రిలయన్స్ రిటైల్ లిస్టెడ్ కాకపోయినా కూడా షేర్లు ఒక్కొక్కటి రూ .1,500, రూ .1,550 పరిధిలో ఉన్నాయి. ఒక్కో షేరుకు 1,500 రూపాయల చొప్పున సంస్థ విలువ 7.5 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. కంపెనీ గత ఏడాది వాటాలు విక్రయించడం ప్రారంభించిన నేపథ్యంలో కంపెనీ వాల్యూ ఏకంగా మూడు రెట్లు పెరిగింది. డిసెంబర్ 2019 లో రిలయన్స్ రిటైల్ షేర్లు రూ.900 వద్ద ఉన్నాయి. దీనికితోడు రిలయన్స్ రిటైల్ వాటాదారులకు రిలయన్స్ రిటైల్ నాలుగు షేర్లకు బదులుగా ఆర్ఐఎల్లో ఒక వాటాను ఇచ్చేలా స్కీమ్ ప్రకటించింది. ఈ పథకం తరువాత రిలయన్స్ రిటైల్ షేర్లు ఒక్కో షేరుకు 380 రూపాయలకు పడిపోయాయి. జనవరిలో రిలయన్స్ ఈ పథకాన్ని ఆఫ్షనల్ గా చేసింది. అప్పటి నుండి మంచి పనితీరును కనబరిచిన రిలయన్స్ రిటైల్ 2020 డిసెంబర్ 31 తో ముగిసిన మూడవ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 88.1 శాతం వృద్ధితో నమోదు చేసింది తద్వారా 1,830 కోట్ల రూపాయలను ఆర్జించింది. మరోవైపు త్వరలోనే ఐపిఓతో రానుందని భావిస్తున్న రిలయన్స్ రిటైల్ కొత్తగా 6500-7000 అవుట్లెట్లను తెరవాలని యోచిస్తోందట. -
జాబిల్లిపైకి మన ల్యాండర్!
అగ్రరాజ్యం అమెరికా జాబిల్లిపైకి ఓ వ్యోమనౌకను పంపుతోందట! ఇందులో మరో విశేషం ఉంది. అదేంటంటే చందమామపై దిగే మూన్‌ల్యాండర్‌ను ఓ భారతీయ కంపెనీ డిజైన్ చేస్తోంది. అది కూడా బెంగళూరుకు చెందిన టీమ్ ఇండస్ అనే సంస్థ. కొన్నేళ్ల కిందట గూగుల్ కంపెనీ లూనార్ ఎక్స్‌ప్రైజ్ పేరుతో ఓ పోటీ పెట్టింది. రోబోను సొంతంగా తయారుచేసుకుని అంతరిక్షంలోకి పంపితే 3 కోట్ల డాలర్ల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. కారణాలేవైనా ఈ పోటీ విజయవంతం కాలేదు. కాకపోతే ఇందులో పాల్గొన్న టీం ఇండస్ మాత్రం జాక్‌పాట్ కొట్టేసింది. 2021 నాటికి జాబిల్లిపైకి ల్యాండర్‌ను పంపాలని నాసా నిర్ణయించడం.. సమయం తక్కువగా ఉన్న కారణంగా కొన్ని పనులు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తామని ప్రకటించడంతో టీం ఇండస్కు ఈ అరుదైన అవకాశం లభించింది. దీంతోపాటు ఆస్ట్రోబయోటిక్, ఇంట్యూటివ్ మెషీన్స్, ఆర్బిట్ బియాండ్ అనే మూడు అమెరికన్ కంపెనీలు కూడా నాసా ప్రణాళికలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. ఇందులో ఆర్బిట్ బియాండ్ కంపెనీకి సంబంధించిన వ్యోమనౌకను టీం ఇండస్ తయారు చేసి ఇవ్వనుంది. ఈ వ్యోమనౌక జాబిల్లిపై ఉన్న ఓ భారీ లోయలోని మేర్ ఇబ్రియం అనే ప్రాంతంలో ల్యాండ్ కావాలి. నాసాకు మొత్తం 9 మూన్‌ల్యాండర్ల అవసరం ఉండగా.. వాటిని తయారు చేసేందుకు సరిపడా ఉద్యోగులు అమెరికన్ కంపెనీల్లో లేరని.. వేరే కంపెనీలతో వ్యోమనౌకను డిజైన్ చేయిస్తోందని ఇంట్యూటివ్ మెషీన్స్ సీఈవో స్టీవ్ ఆల్టిమస్ చెబుతున్నారు. -
రిలయన్స్ @రూ.8 లక్షల కోట్లు
ముంబై: ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అరుదైన రికార్డ్‌ను సాధించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను సాధించి భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీగా రికార్డ్ సృష్టించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన తొలి భారత కంపెనీగా కూడా నిలిచింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,274ను తాకిన ఈ షేర్ చివరకు 1.8% లాభంతో రూ.1,270 వద్ద ముగిసింది. ఈ షేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం ఒక్క రోజే రూ.15,527 కోట్లు పెరిగింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ రూ.8,04,691 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్ 37 శాతం వరకూ లాభపడింది. ఏజీఎమ్ నుంచి జోరు...: గతనెలలో జరిగిన ఏజీఎమ్‌లో ఈ కంపెనీ టెలికం విభాగం రిలయన్స్ జియో గిగా ఫైబర్(ఫైబర్–టు–ద హోమ్ సర్వీస్)ను ప్రకటించినప్పటి నుంచి ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. ఈ షేర్ గత నెల 12న 10, 000 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ కంపెనీగా అవతరించింది. 2007లో ఈ ఘనత సాధించిన ఈ కంపెనీ మళ్లీ అదే ట్యాగ్‌ను ఈ ఏడాది పొందింది. గత నెల 13న ఈ కంపెనీ మార్కెట్ క్యాప్‌రూ.7 లక్షల కోట్లను అధిగమించింది. నెలన్నర రోజుల్లోనే మరో లక్ష కోట్ల మార్కెట్ క్యాప్‌ను జత చేసుకొని 8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కంపెనీగా గురువారం అవతరించింది. -
కఠిన ‘హెచ్–1బీ’తో అమెరికాకూ నష్టమే!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల జారీ విధానంలో తీసుకొచ్చిన కఠిన నిబంధనలు భారత కంపెనీలపైనే కాకుండా అమెరికా ఐటీ పరిశ్రమపైనా పెను ప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు. కఠిన నిబంధనల ప్రభావం అమెరికా ఐటీ రంగం, ఆర్థిక వ్యవస్థపై ఇలా ఉంటుంది. హెచ్ –1బీ వీసాను అధికంగా వినియోగించుకుంటున్నది టెక్ కంపెనీలే. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్లకే గతేడాది ఎక్కువ వీసాలు దక్కాయి. కొత్త నిబంధనల వల్ల అవి విదేశీ నిపుణులను నియమించుకోవడం కష్టతరమవుతుంది. కనీసం బిలియన్ డాలర్ల పెట్టుబడితో విదేశీయులు స్థాపించే సంస్థలు సగటున 760 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వలసదారులకు అడ్డంకులు ఎదురైతే దేశ వాణిజ్య రంగానికి విఘాతమే. అమెరికాలో ఇంజినీరింగ్ చదివే వారిలో విదేశీయులే ఎక్కువ. 70 శాతానికి పైగా కంపెనీల్లో మేనేజ్మెంట్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ విభాగాల్లో వలసదారులదే ముఖ్య పాత్ర. 2017లో టాప్–7 భారత ఐటీ కంపెనీలకు వీసాలు తక్కువ వచ్చాయి. దీంతో అమెరికాలో నిపుణులకు కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. -
‘భారతీయ’ కంపెనీపై అమెరికాలో జరిమానా
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు భారత సంతతి వ్యక్తికి చెందిన ఓ కంపెనీపై అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ జరిమానా పడింది. హెచ్–1బీ వీసాపై 12 మంది విదేశీ ఉద్యోగులను నియమించుకున్న క్లౌడ్‌విక్ టెక్నాలజీస్ అనే కంపెనీ వారికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన దానికన్నా అతి తక్కువ వేతనాలను చెల్లించింది. ఈ కంపెనీ బాధిత ఉద్యోగుల్లో భారతీయులే అధికంగా ఉన్నారు. నెలకు 8,300 డాలర్ల వేతనం ఇస్తామని చెప్పి హెచ్–1బీ వీసాపై ఉద్యోగులను రప్పించుకున్న కంపెనీ.. కొందరికి మరీ తక్కువగా నెలకు 800 డాలర్ల వేతనాన్ని మాత్రమే ఇచ్చిందని అమెరికా కార్మిక శాఖ గుర్తించింది. దీంతో 1,73,044 డాలర్ల జరిమానాను కంపెనీపై విధించి ఆ మొత్తాన్ని ఇప్పటిదాకా తక్కువ వేతనాలు అందుకున్న ఉద్యోగులకు అందజేయాలని కార్మిక శాఖ ఆదేశించింది. -
భారీగా తగ్గిన భారత్ కంపెనీల విదేశీ రుణ సమీకరణ
ముంబై: భారత్ కంపెనీల విదేశీ రుణ సేకరణ ఈ ఏడాది జూలైలో గణనీయంగా 44 శాతం తగ్గింది. 2015 జూలైలో ఈ రుణ సమీకరణ పరిమాణం 2.14 బిలియన్ డాలర్లుకాగా, 2016 జూలైలో ఈ మొత్తం 1.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇందులో 183.7 మిలియన్లు అప్రూవల్ రూట్లో వచ్చాయి. 1.02 బిలియన్ డాలర్లు ఆటోమేటిక్ చానెల్లో వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అప్రూవల్ రూట్లో టికోనా డిజిటల్ నెట్స్వర్క్స్ 171 మిలియన్ డాలర్లు సమీకరించింది. విజయవాడ టోల్‌వే విషయంలో ఈ మొత్తం 11.07 మిలియన్ డాలర్లుగా ఉంది. ఆటోమేటిక్ రూట్లో రుణాలు తెచ్చుకున్న సంస్థల్లో హెచ్డీఎఫ్సీ (446 మిలియన్ డాలర్లు), గ్లెన్‌మార్క్ ఫార్మా (200 మిలియన్ డాలర్లు), అదానీ ట్రాన్స్మిషన్ (74 మిలియన్ డాలర్లు), బిర్లా కార్పొరేషన్ (40 మిలియన్ డాలర్లు), సీమన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (37 మిలియన్ డాలర్లు) ఉన్నాయి. -
భారత్.. అవకాశాల గని
వ్యాపారాలకు అత్యంత అనువైన దేశంగా తీర్చిదిద్దుతా ⇒ అందుకు వ్యక్తిగతంగా దృష్టిపెడతా ⇒ కొరియా ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్రమోదీ హామీ సియోల్: అపార అవకాశాల గనిగా భారత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్‌లో వ్యాపారాల నిర్వహణ సులభతరంగా ఉండే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దక్షిణ కొరియా ఇన్వెస్టర్లతో ఆయన చెప్పారు. వ్యాపారవర్గాలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై తాను వ్యక్తిగతంగా దృష్టి పెడతానని మోదీ హామీ ఇచ్చారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంగళవారం ఇండియా-సౌత్ కొరియా సీఈవోల ఫోరం తొలి సదస్సులో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు చెప్పారు. భారత్‌లో స్థిరమైన, పారదర్శకమైన పన్నుల విధానం ఉండేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించే క్రమంలో.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలించడం, పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు వేగవంతంగా ఇవ్వడం తదితర చర్యలు తీసుకుంటున్నట్లు మోదీ తెలిపారు. ‘భారత్‌లో పరిస్థితులు మారాయి. వచ్చి చూడండి’ అని ఆయన ఆహ్వానించారు. ఇన్ఫ్రా రంగం ముఖ్యంగా గృహ నిర్మాణాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయొచ్చని మోదీ చెప్పారు. అలాగే నీరు, రవాణా, రైల్వేలు, రేవులు, విద్యుదుత్పత్తి, ఐటీ తదితర రంగాలన్నింటిలోనూ పరస్పర సహకారానికి అవకాశాలు ఉన్నాయన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలంటే .. ఇతర దేశాలకు దీటుగా వ్యాపారాలకి అనువైన పరిస్థితులు కల్పించాలి కనుక ప్రధానంగా దీనిపై దృష్టి పెడుతున్నామన్నారు. 21 మంది సీఈవోలు, ఇతర వ్యాపార దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గొన్నారు. కొరియా ప్లస్ ఏర్పాటు..: వ్యాపారాల నిర్వహణ విషయంలో కొరియన్ ఇన్వెస్టర్లకు సహకరించేందుకు కొరియా ప్లస్ పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని మోదీ చెప్పారు. తాను వ్యక్తిగతంగా వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతానని తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్న పన్నుపరమైన పలు వివాదాలను ఇప్పటికే పరిష్కరించామని ప్రధాని వివరించారు. ఇవన్నీ మరింత టెక్నాలజీని, పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగమేనని చెప్పారు. సమావేశం సందర్భంగా హ్యుందాయ్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, పోస్కో, ఎల్జీ వంటి దిగ్గజ సంస్థల అధిపతులతో మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. సీఈవో ఫోరం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కొరియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (కేసీసీఐ) చైర్మన్ పార్క్ యోంగ్ మన్.. ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు మరింత పటిష్టం కావాలని ఆకాంక్షించారు. గతేడాది గణాంకాల ప్రకారం భారత్, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 18.1 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్‌లో నిర్మాణ, రైల్వేస్ తదితర రంగాల్లో కార్యకలాపాలు విస్తరించడంపై హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేసింది. హ్యుందాయ్ ప్లాంటులో మోదీ.. నౌకల నిర్మాణం, మెరైన్ ఇంజిన్ల తయారీ మొదలైన వాటిల్లో పేరొందిన హ్యుందాయ్ హెవీ ఇండస్ట్రీస్ (హెచ్‌హెచ్‌ఐ) ప్లాంటును మోదీ సందర్శించారు. ఉల్సాన్‌లోని హ్యుందాయ్ హెవీ ఇండస్ట్రీస్(హెచ్‌హెచ్‌ఐ) ప్లాంటును మోదీ సందర్శించారు. దాదాపు గంటపాటు అక్కడ గడిపిన ప్రధాని.. హెచ్‌హెచ్‌ఐ చైర్మన్ చోయ్ కిల్-సియోన్‌తో సమావేశమయ్యారు. ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) క్యారియర్లు, ఓడల నిర్మాణానికి సంబంధించి సాంకేతికాంశాలపై భారత కంపెనీలకు తోడ్పాటు అందించే అంశంపై చర్చించారు. -
ప్రపంచ టాప్ బ్రాండ్లలో ‘టాటా’ ల్యాండ్‌రోవర్
భారత్ కంపెనీకి చెందిన ఏకైక బ్రాండ్ లండన్: ప్రపంచంలో అత్యంత విలువైన 100 బ్రాండ్లలో టాటా గ్రూప్‌నకు చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ కార్ల బ్రాండ్ ల్యాండ్ రోవర్ చోటు దక్కించుకుంది. టాప్-100లో భారత్ కంపెనీకి చెందిన ఏకైక బ్రాండ్ ఇదే కావడం గమనార్హం. ఇంటర్‌బ్రాండ్ అనే కన్సల్టెన్సీ సంస్థ రూపొం దించిన 2014 వార్షిక జాబితాలో ల్యాండ్ రోవర్ 4.47 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో 91వ స్థానంలో నిలిచింది. కాగా, ప్రపంచ టాప్ బ్రాండ్‌గా యాపిల్ తన స్థానాన్ని నిలుపుకుంది. దీని బ్రాండ్ విలువ 119 బిలియన్ డాలర్లుగా అంచనా. 107 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో గూగుల్ రెండో స్థానంలో ఉంది. భారత్‌కు చెందిన సీఈఓల సారథ్యంలోని 6 కంపెనీలు/బ్రాండ్లు జాబితాలో ఉన్నాయి. సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ 5వ ర్యాంకు(61 బిలియన్ డాలర్లు)లో ఉంది. ఇంద్రా నూయి సీఈఓగా ఉన్న పెప్సికో(24వ స్థానం-19 బిలి యన్ డాలర్లు), శాంతను నారాయణ్ సీఈఓ గా ఉన్న అడోబ్(77వ స్థానం-5.3 బిలియన్ డాల ర్లు), అజయ్ బంగా సారథ్యంలోని మాస్టర్ కార్డ్(88వ స్థానం-4.7 బిలియన్ డాలర్లు) దీనిలో ఉన్నాయి. ఇవాన్ మెనెజెస్ సీఈఓగా ఉన్న డియాజియో బ్రాండ్లు స్మిర్నాఫ్(34 ర్యాంకు-13 బిలియన్ డాలర్లు), జానీ వాకర్(86 ర్యాంకు-4.8 బిలియన్ డాలర్లు) కూడా జాబితాలో ఉన్నాయి. -
ఉద్యోగానికి గూగుల్ బెస్ట్!
న్యూఢిల్లీ: పనిచేయడానికి అత్యుత్తమ కంపెనీగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నిలిచింది. అంతర్జాతీయ ఎంప్లాయర్ బ్రాండింగ్ కంపెనీ యూనివర్సమ్స్ రూపొందించిన ఈ ఏడాది అత్యంత ఆకర్షణీయ కంపెనీల జాబితాలో గూగుల్ మొదటి స్థానాన్ని సాధించింది. బిజినెస్ విద్యార్ధులు పనిచేయడానికి ఇష్టపడే కంపెనీలు ఒక జాబితాగానూ, ఇంజనీరింగ్, ఐటీ విద్యార్ధులు పనిచేయడానికి ఇష్టపడే కంపెనీలు ఒక జాబితాగానూ ఈ సంస్థ రూపొందించింది. ఈ రెండు జాబితాల్లో గూగుల్ టాప్‌లో నిలిచింది. అయితే ఏ జాబితాలోనూ ఏ ఒక్క భారత కంపెనీకి స్థానం దక్కలేదు. ఈ జాబితాల్లోని కంపెనీలకు భారత్‌లో ఉద్యోగులు భారీగానే ఉన్నారు. బిజినెస్ విద్యార్ధులకు సంబంధించి ఆకర్షణీయ కంపెనీల జాబితాలో గూగుల్ తర్వాతి స్థానాల్లో డెలాయిట్, సిటి, యాపిల్, పీ అండ్ జీ నిలిచాయి. ఇంజినీరింగ్, ఐటీ విద్యార్ధులకు సంబంధించిన జాబితాలో గూగుల్ తర్వాత యాపిల్, మైక్రోసాఫ్ట్, శామ్సంగ్, బీఎండబ్ల్యూలు నిలిచాయి. ఈ రెండు కేటగిరీలకు సంబంధించి ఒక్కో జాబితాలో 50 కంపెనీలున్నాయి.