ఓ ఉద్యోగి నెల సంపాదన ఎంత ఉండొచ్చు. మహా అయితే నెలకు 20 నుంచి 30 వేలు ఉంటే..మరి మన దేశంలో దిగ్గజ కంపెనీలు నెలకు కాదు గంటకు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా? ఇటీవల ఆయా కంపెనీలు, ప్రముఖుల ఆదాయాలపై సర్వే నిర్వహించే ఫైన్ షాట్స్ సంస్థ..ఈ సారి మనదేశంలో పలు దిగ్గజ సంస్థలు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాయో తెలుసుకునేందుకు ఓ సర్వే నిర్వహించింది. స్టాక్ మార్కెట్‌లో కంపెనీల వ్యాల్యూ ఆధారంగా రిపోర్ట్‌ను విడుదల చేసింది. అందులో మనదేశానికి పలు కంపెనీలు నిమిషానికి సుమారు రూ.10లక్షలు అర్జించడం గమనార్హం.
వాటిలో భారత్ పెట్రోలియం నిమిషానికి రూ.3.7లక్షల్ని సంపాదిస్తుంది.
ఓఎన్‌జీసీ నిమిషానికి రూ.3.9లక్షల్ని అర్జిస్తుంది
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ నిమిషానికి రూ.3.9లక్షల్ని సంపాదిస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ నిమిషానికి రూ.3.56లక్షల్ని సంపాదిస్తుంది.
ఇన్ఫోసిస్ నిమిషానికి రూ.3.68లక్షల్ని సంపాదిస్తుంది.
ఇండియన్ ఆయిల్ కంపెనీ నిమిషానికి రూ.4.14లక్షలు సంపాదిస్తుంది
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిమిషానికి రూ.4.24లక్షల్ని సంపాదిస్తుంది
హెచ్‌డీఎఫ్‌సీ నిమిషానికి రూ.6.5లక్షల్ని సంపాదిస్తుంది
టీసీఎస్ కంపెనీ నిమిషానికి రూ.6.17లక్షల్ని సంపాదిస్తుంది.
రిలయన్స్ సంస్థ నిమిషానికి రూ.9.34లక్షల్ని సంపాదిస్తూ ప్రదమ స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment