ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉపయోగించే మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్. ఈ వాట్సప్‌ను బిజినెస్ అవకాశాల కోసం కూడా వినియోగిస్తారు. ఇలా వినియోగించించుకుని కోట్ల విలువైన సంస్థగా ఎదిగిన 'డుంజో' (Dunzo).. ఈ రోజు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థికి చేరిపోయింది.
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నిత్యావసరాలను అందించే 'డుంజో' గ్రోసరీ డెలివరీ యాప్ కాలంలోనే రూ. 6200 కోట్ల విలువైన కంపెనీగా అవతరించింది. ఇటీవల సుమారు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు ఆ సంస్థలో కేవలం 50 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నట్లు సమాచారం.
డుంజో ఎలా ప్రారంభమైందంటే..
కబీర్ బిస్వాస్, అంకుర్ అగర్వాల్, దల్వీర్ సూరి, ముకుంద్ ఝా కలిసి హోపర్‌ను కొనుగోలు చేసిన తర్వాత డుంజో ప్రారంభమైంది. కంప్యూటర్ ఇంజనీర్ అయిన కబీర్ ఎంబీఏ చదవాలని నిర్ణయించుకునే ముందు సిల్వస్సాలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పని చేయడం ద్వారా బిజినెస్ మీద ఆసక్తి పెంచుకున్నారు. ఆ తరువాత ఎయిర్‌టెల్‌లో చేరి సేల్స్, కస్టమర్ సర్వీస్ వంటివాటిపై ద్రుష్టి పెట్టారు.
బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ప్రత్యర్థులు ఆవిర్భవించకముందే.. డుంజో ప్రజలకు నిత్యావసరాలను డెలివరీ చేసింది. దీనికోసం వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఇదే తరువాత ఇతర ప్రధాన నగరాలకు వ్యాపించింది. ఈ సంస్థలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఏకంగా రూ. 1600 కోట్లు పెట్టుబడులు పెట్టింది. దీంతో డుంజో విలువ రూ. 6200 కోట్లకు చేరింది.
ఇదీ చదవండి: పండగ సీజన్‌పై ఫోకస్.. లక్ష ఉద్యోగాలకు అవకాశం
డుంజో నష్టాలకు కారణం
వేలకోట్ల కంపెనీగా అవతరించిన డుంజో కాలక్రమంలో ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఈ కంపెనీ క్రమంగా దివాలవైపు అడుగులు వేసింది. గత ఏడాది ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వడంలో చాలా ఆలస్యం చేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1800 కోట్ల రూపాయల నష్టాన్ని చూసింది.
Comments
Please login to add a commentAdd a comment