‘లవ్ సోనియా’తో బాలీవుడ్‌లో మెరిసిన తార మృణాల్ ఠాకూర్. తాజాగా ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. స్క్రీన్ మీద తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నట్టే ఫ్యాషన్‌లోనూ తనకంటూ ఓ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది మృణాల్. ఆ స్టయిల్ క్రియేషన్‌లో ఈ బ్రాండ్స్ కూడా భాగమే!
పిచ్చిక
నెమలి పింఛంలోని ఈకలను తలపించేంత మృదువైన ఫాబ్రిక్స్, ప్రకృతిని మరపించేన్ని రంగులు, డిజైన్లు పిచ్చిక లేబుల్ ప్రత్యేకతలు. ఆ డిజైన్స్ అన్నీ కూడా జైపూర్ హ్యాండ్ పెయింటింగ్స్, హ్యాండ్ ప్రింట్స్, ఎంబ్రాయిడరీలే.
తన కళాత్మక దృష్టితో ఈ లేబుల్‌కు వన్నెలు అద్దిన డిజైనర్ ఊర్వశి సేథీ. ఈ బ్రాండ్ దుస్తులు ఆన్‌లైన్‌లో లభ్యం. ధరలు ఓ మోస్తరు రేంజ్‌లో ఉంటాయి.
ఓలియో
ఆష్నా సింగ్, స్నేహా సక్సేనా అనే ఇద్దరు స్నేహితులు కలసి ఏర్పాటుచేసిన బ్రాండ్ ‘ఓలియో’. ఈ జ్యూవెలరీ బ్రాండ్‌ను స్థాపించక ముందు ఆష్నా మీమ్స్ క్రియేటర్‌గా పాపులర్. స్నేహా.. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిగ్రీ చేసింది. దుస్తులు, యాక్సెసరీస్, జ్యూవెలరీ డిజైనింగ్‌లో దిట్ట.
ఈ ఇద్దరూ కలసి సొంతంగా ఓ ఫ్యాషన్ బ్రాండ్‌ను స్టార్ట్ చేయాలనుకుని 2015లో ‘ఓలియో’కు రూపమిచ్చారు. స్నేహ.. డిజైనింగ్ చూసుకుంటే, ఆష్నా.. బ్రాండ్ వ్యవహార బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఓలియో జ్యూవెలరీ ఆన్‌లైన్‌లో లభ్యం. ధరలూ అందుబాటులోనే.
బ్రాండ్ వాల్యూ
జెట్ బ్లాక్ చీర
బ్రాండ్: పిచ్చిక
ధర: రూ. 21,500
ఇయర్ రింగ్స్
బ్రాండ్: ఓలియో
ధర: రూ. 8,050
ఇండియన్ కర్దాషియాన్ అని పిలిచారు
నటిగా కొనసాగాలంటే ఫిట్‌నెస్ అవసరమని అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఒకసారి అమెరికా వెళ్లినప్పుడు అక్కడ నన్నంతా ఇండియన్ కర్దాషియాన్ అని పిలిచారు. నాలాంటి శరీరాకృతి తెచ్చుకోవడానికి వాళ్లు లక్షల్లో డబ్బు ఖర్చు పెడతారట. ఆ మాట విన్నాక నా మీద నాకు ఎక్కడలేని కాన్ఫిడెన్స్ పెరిగింది – మృణాల్ ఠాకూర్.
-దీపికా కొండి
చదవండి: Fashion-Velvet Long Jacket: సింపుల్ లుక్‌ను ‘రిచ్’గా మార్చేయగల వెల్వెట్ లాంగ్ జాకెట్!
Nazriya Nazim Saree Cost: నజ్రియా ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! స్పెషాలిటీ?
Comments
Please login to add a commentAdd a comment