లైట్ పర్పుల్ కలర్ లెహెంగాలో .. అంతకన్నా లైట్ మేకప్‌తో .. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మెరిసిపోతున్న ఆ సెలబ్రిటీని గుర్తుపట్టారా? రుక్సర్ థిల్లాన్ అంటున్నారు కదా యూత్ అంతా ముక్త కంఠంతో. కరెక్ట్! గతేడాది ఆమె సోదరి పెళ్లి వేడుకలోని ఆ దృశ్యం.
రుక్సర్‌ను పరిచయం చేయడానికి ఆమె నటించిన తెలుగు సినిమాల పేర్లు .. ఆకతాయి, కృష్ణార్జున యుద్ధం! తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం! ఈ ఫంక్షన్‌లో ఆమె అటైర్‌గా మారిన బ్రాండ్స్ వివరాల మీదకూ చూపు మరల్చండి..
వివాణి
‘మనం వేసుకునే దుస్తులు మన అభిరుచినే కాదు మన ఐడెంటినీ వ్యక్తపరుస్తాయి’ అంటారు వాణి వాట్స్. అనడమే కాదు నమ్ముతారు కూడా. ఆ నమ్మకంలోంచి వచ్చిందే మహిళల డ్రెస్ డిజైన్ బ్రాండ్ వివాణి. 2015లో ప్రారంభించింది. ప్రాచీన భారతీయ ఎంబ్రాయిడరీ కళకు మోడర్న్ ఫ్యాషన్ జోడించి సరికొత్త డిజైన్స్‌ను రూపొందించడమే వివాణి వాల్యూ.
కాబట్టే ఆ బ్రాండ్ ఇప్పుడు భారతీయ హస్తకళా రాజసానికి పర్యాయంగా ప్రాచుర్యం పొందుతోంది. చిన్నప్పటి నుంచి ఆమెకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ, హస్తకళలు, ఆర్కిటెక్చర్ అంటే ఆసక్తి. ఆ ఆసక్తే కొద్దే పర్ల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్స్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. వివాణిని సృష్టించింది.
ది చాంద్ స్టూడియో
ఏమ్‌బీఏ చదివిన అన్న దేవేశ్, ఎమ్మే సైకాలజీ చేసిన చెల్లి రిమ్‌ఝిమ్‌ల కలల ప్రాజెక్టే ‘ది చాంది స్టూడియో’ జ్యూయెలరీ. 1990లో రత్నాలు, వెండి నగల ఎగుమతితో ప్రారంభమైంది
ఆ అన్నాచెల్లెళ్ల ఈ ప్రయాణం. వెండి నగల పట్ల ఈ ఇద్దరికీ ఉన్న అభిరుచి.. ఆ నగలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్, ఈ వ్యాపారంలో వాళ్లు గడించిన అనుభవం.. ఈ మూడు ‘ది చాంద్ స్టూడియో’ ఏర్పాటుకు ప్రేరణనిచ్చాయి. ఆకట్టుకునే డిజైన్స్, అందుబాటు ధరలు ఈ బ్రాండ్ యూఎస్‌పీ. ఆన్‌లైన్‌లో లభ్యం.
బ్రాండ్ వాల్యూ : లెహెంగా
బ్రాండ్: వివాణి
ధర: రూ. 79,500
జ్యూయెలరీ: ఇయర్ రింగ్స్
ధర: రూ.2,800
మాంగ్ టీకా
బ్రాండ్: ది చాంది స్టూడియో
ధర: రూ.4,800
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించాలనుంది. అంతేకాదు ప్రతిభావంతులైన ఎంతోమంది డైరెక్టర్స్ వస్తున్నారు. వాళ్లందరితోనూ పనిచేయాలనుంది.
– రుక్సర్ థిల్లాన్
చదవండి👉🏾Varsha Mahendra: అక్కడ కేవలం బ్లవుజులే! ఒక్కో దాని ధర రెండున్నర వేల నుంచి 20 వేల వరకు..
Comments
Please login to add a commentAdd a comment