రిలేషన్‌షిప్ కష్టం.. ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నా: మృణాల్ | Mrunal Thakur Comments On Birth Child And Career | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: పిల్లలు కనడంపై హీరోయిన్ మృణాల్ షాకింగ్ కామెంట్స్

Published Fri, Apr 26 2024 8:32 AM | Last Updated on Fri, Apr 26 2024 8:32 AM

Mrunal Thakur Comments On Birth Child And Career

తెలుగు సినిమాల్లోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలా వచ్చిన ముంబయి బ్యూటీ మృణాల్ ఠాకుర్. 'సీతారామం'తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్'తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కొత్త ప్రాజెక్టులు ఒప్పుకొనే విషయంలో ఆచితూచి వ్యహరిస్తున్న మృణాల్.. రిలేషన్, పిల్లలు కనడం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. హ్యుమన్స్ ఆఫ్ బాంబే అనే యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన అభిప్రాయల్ని బయటపెట్టింది.

'కెరీర్, జీవితం.. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. కానీ మనం ఎప్పుడూ దానిని ఎలా చేయాలనే దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. రిలేషన్‌‌షిప్ అంటే కష్టమనే విషయం నాకు తెలుసు. మనం చేసే పనిని అర్థం చేసుకునే భాగస్వామి దొరకడం చాలా అవసరం. అలానే ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నాను' అని మృణాల్ ఠాకుర్ చెప్పుకొచ్చింది.

మృణాల్ చెప్పిన దానిబట్టి చూస్తే.. ఇప్పట్లో బాయ్ ఫ్రెండ్, పెళ్లి లాంటివి ఉండవనమాట. ఇక ఎగ్ ఫ్రీజింగ్ అనే మాట మనకు కొత్తేమో కానీ హీరోయిన్లకు ఈ మధ్య కాస్త కామన్ అయిపోతుంది. ఓ దశ దాటిన తర్వాత నిల్వ చేసిన తమ అండాలతో పిల్లల్ని కనడాన్నే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు.  వయసులో ఉన్నప్పుడు పిల్లల్ని కంటే కెరీర్ ఇబ్బందుల్లో పడొచ్చనే భయంతో ఈ విధానంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల దారిలోనే మృణాల్ కూడా వెళ్లబోతుందనమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement