కేథరీన్ త్రెస్సా.. అవును .. సరైనోడు కథానాయిక. సంఖ్యాపరంగా టాలీవుడ్‌లో ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. తెచ్చుకున్న పేరు.. సంపాదించుకున్న అభిమానం మాత్రం ఘనమే. ఇటీవల ‘భళా తందనానా’ తో తెలుగు స్క్రీన్ మీద ఆమె మళ్లీ కనిపించింది. ఆమెను సెలబ్రిటీని చేసిన నటన సరే.. ఆమెను యూనిక్‌గా నిలిపిన ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం..
దీప్ థీ..
బ్రాండ్ సృష్టికర్త.. దీప్తి పోతినేని. తనదైన డిజైన్స్‌తో సినిమా స్టార్స్ ఫ్యాషన్ సిగ్నేచర్‌ను మార్చేసింది దీప్తి. ఫ్యాషన్ ప్రేమికుల అభిరుచి, ఫ్యాషన్‌తో వాళ్లు చేయాలనుకున్న ప్రయోగాలను గమనించి.. వాళ్లు నచ్చే.. మెచ్చేలా తన దీప్ థీని తీసుకొచ్చింది. దాన్నే తన బ్రాండ్ వాల్యూగా స్థిరపర్చుకుంది.
ఆ వాల్యూ వల్లే దీప్తీ నేడు సినిమా స్టార్స్‌కు ఫేవరెట్ డిజైనర్‌గా మారింది. ఆ క్రేజ్ ఆమెనూ ఓ సెలబ్రిటీగా మార్చింది. డిజైన్, ఫాబ్రిక్‌ను బట్టి ధరలు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.
ఆమ్రపాలి
నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది.
అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్‌లైన్‌లో లభ్యం.
బ్రాండ్ వాల్యూ
అంగ్రఖా కుర్తా
బ్రాండ్: దీప్‌థీ
ధర: రూ. 32,800
జ్యూయెలరీ
ఇయర్ రింగ్స్ అండ్ ఉంగరం
బ్రాండ్: అమ్రపాలి
ధర: డిజైన్, నాణ్యతను బట్టి ఉంటుంది.
జీవితంలో జరిగే పరిణామాలను మంచి, చెడులుగా చూడను. అలాగే నా కెరీర్‌ను కూడా అలా విభజించలేను. వచ్చిన.. నచ్చిన అవకాశాన్ని స్వీకరిస్తా. నా వంతు కృషి చేస్తా.. సినిమా అయినా.. జీవితమైనా! – కేథరీన్ త్రెస్సా
-దీపిక కొండి
Comments
Please login to add a commentAdd a comment