హెడ్ టు టోయ్ ప్రామోనోయ్...
సిటీకి ఇప్పుడు ప్రామ్ థీమ్ అనే సరికొత్త ఫీవర్ పట్టుకుంది. ఈ ట్రెండీ థీమ్‌ను అనుసరించి ఫ్రాక్‌ల నుంచి షూస్ దాకా ఎన్నో వచ్చేశాయి. వీటన్నింటిని మేళవించి నిర్వహించే వేడుకలను ప్రామ్ థీమ్ పార్టీలంటున్నారు. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఈ ట్రెండ్ సిటీని ప్రస్తుతం పట్టి కుదిపేస్తోంది. - శిరీష చల్లపల్లి
కాగితపు పూలతో తయారు చేసిన కిరీటాలు... బుట్ట గౌను, ఫ్రాక్‌లు.. విచిత్రంగా అనిపించే ఫ్యాన్సీ ఆభరణాలు.. యాక్ససరీస్.. టాప్ టు బాటమ్ వెరైటీగా అనిపించే లుక్‌తో ఆశ్చర్యపరిచే అమ్మాయిలే ప్రామ్ పార్టీకి సింబల్స్. నగరంలో పెరుగుతున్న ప్రామ్ క్రేజ్‌కు ఈ పార్టీలే నిదర్శనం.
ప్రామ్.. ఫ్రమ్ అమెరికా
పాశ్చాత్య దేశాల నుంచి పుట్టుకొచ్చిన ట్రెండ్ ఇది. అక్కడి హైస్కూళ్లలో సీనియర్లు, జూనియర్లు కలిసిన సందర్భాల్లో విద్యార్థినులు నిర్వహించే డ్యాన్స్ మేళవించిన వేడుకలే ఈ ప్రామ్ థీమ్ పార్టీలు. అమెరికా, కెనడా, యూకేలలో ఎక్కువగా కనిపిస్తాయి ఈ ప్రామ్ సెలబ్రేషన్స్. ఇప్పుడు మన నగరానికి కూడా వచ్చేశాయి.
ఆద్యంతం.. ఆకట్టుకునే లుక్..
సాధార ణంగా సిటీలో జరిగే థీమ్ పార్టీల్లో వేదిక నుంచి అన్నీ థీమ్‌కు తగ్గట్టుగా ఉంటాయి. అయితే ఈ ప్రామ్ పార్టీల్లో థీమ్ అంతా వ్యక్తికే పరిమితం. ఈ పార్టీలకు హాజరయ్యే వ్యక్తి తల నుంచి కాళ్ల దాకా పూర్తి సెపరేట్‌గా డెకరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తలకి కాగితపు పూలతో తయారు చేసిన కిరీటం పెట్టుకోవడంతో ఇది మొదలవుతుంది. రంగురంగుల గులాబీలతో తలకు కిరీటంలో ధరించే ప్రామ్ హెడ్‌బ్యాండ్ ఈ పార్టీ థీమ్‌కి సరైన సింబల్. ఇక ఫ్లోర్ లెన్త్ ఫ్రాక్‌లాగా పొడుగ్గా మోకాళ్ల కిందకి ఉంటూనే స్లీవ్ లెస్ టచ్ ఇచ్చి.. అక్కడక్కడ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే వాటిని ప్రామ్ ఫ్రాక్ అని వ్యవహరిస్తున్నారు. నియాన్ గ్రీన్, నియాన్ పింక్, ఫంకీ బ్లూ, చిల్లీ రెడ్, కార్బన్ బ్లాక్ రంగులు కలిగిన ఫ్రాక్‌లు ఈ పార్టీలకు ఎక్కువగా డిజైన్ చేస్తారు. ఇక ఈ పార్టీకి షైనింగ్ ప్రామ్ స్పెషల్ జ్యువెల్లరీ కూడా ఉంది. స్పింజెడ్ స్టోన్స్‌తో అందంగా మెరిసే ప్రామ్ మిడ్ రింగ్స్, కళ్లు మిరిమిట్లు గొలిపేలా హైహీల్ ప్రామ్ షూస్ మార్కెట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నాయి. ఇలా తల నుంచి కాలి వరకు ఒక సరికొత్త థీమ్ డ్రెస్సింగ్‌తో అమ్మాయిలు తమదైన శైలిలో ప్రామ్ పార్టీలు జరుపుకుంటున్నారు. ఈ తరహా పార్టీలకు ఈ డ్రెస్ కోడ్ తప్పని సరి. దీని కోసం స్పెషల్ ఏంజల్ లుక్‌లో మెరిసిపోతూ ట్రెండ్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు ప్రామ్ గర్ల్స్. ప్రామ్ ఫ్రాక్‌లు రూ.1500 నుంచి లభ్యమవుతున్నాయి. విభిన్న రకాల ప్రామ్ జ్యువెల్లరీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.