స్కర్ట్... కుచ్చుల గౌను...
న్యూలుక్
వేసవిలో పిల్లలకు వేయాల్సిన దుస్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సిల్క్ దుస్తులు కాకుండా పిల్లల సున్నితమైన చర్మానికి హాయినిచ్చే ఫ్యాబ్రిక్‌వి ఎంచుకోవాలి. ఇందుకు మెత్తని టీ షర్టులు, పెద్దమ్మాయిల కాటన్ స్కర్ట్‌లు బాగా ఉపయోగపడతాయి. వాడకుండా ఉంచిన వీటితో పిల్లలకు అందమైన స్కర్ట్‌లు ఎలా రూపొందించుకోవచ్చో తెలుసుకుందాం...
పిల్లలు త్వరగా పొడవు పెరుగుతుంటారు. వారి డ్రెస్సులు మాత్రం కొత్తదనం పోనివి చాలానే ఉంటాయి. అలాంటి వాటికి ఇలా కుచ్చులు పెట్టి అందంగా మార్చేయవచ్చు. మీదైన స్టైల్‌తో డిజైనర్ మార్క్ కొట్టేయవచ్చు. స్కర్ట్ పై భాగంలో భుజం మీదుగా రెండు స్ట్రాప్‌లు జత చేస్తే ఎండాకాలానికి ఉపయోగపడేలా జంపర్ స్టైల్ గౌన్ సిద్ధం.
అందంగానూ కుచ్చులు కుచ్చులుగానూ డ్రెస్‌ను మార్చేయాలంటే 2-3 రకాల పొడవాటి క్లాత్‌లు తీసుకోవాలి. ఇందుకు పాత గౌనులు, స్కర్ట్‌లు తీసుకోవచ్చు. కట్ చేసిన స్కర్ట్ పొడవాటి క్లాత్‌లను.. కుచ్చులుగా కుట్టాలి. ఇలా కుట్టిన వాటిని ఒకదాని కింద మరొకటి జత చేస్తూ కుట్టాలి. దీనికి లైనింగ్‌గా లోపలి వైపు పల్చని కాటన్ క్లాత్ వేసి కుట్టాలి. ఇలా చేస్తే పిల్లల ఒంటికి లోపలి డిజైన్ గుచ్చుకోకుండా ఉంటుంది.