Silk dresses
-
పట్టుదారం గుట్టు తెలిసింది..
పట్టు వస్త్రాలు కట్టుకుంటే వచ్చే లాభమేమిటి? అందంగా కనిపించడం కాసేపు పక్కనబెడితే.. పట్టు వస్త్రాలు శరీరాన్ని చలికాలంలో వెచ్చగా.. ఎండాకాలంలో చల్లగానూ ఉంచుతాయి. అయితే ఏంటి? అనొద్దు.. ఇలాంటివే అనేక మంచి లక్షణాలున్న పట్టు సూపర్ మెటా మెటీరియల్ అంటున్నారు పర్డ్యూ శాస్త్రవేత్తలు. పది నుంచి 20 మైక్రాన్ల మందం ఉండే పట్టుపోగుల్లో అతిసూక్ష్మమైన పోగులు మరిన్ని ఉంటాయని.. నానో స్థాయిలో ఉండే నిర్మాణాల కారణంగా దీనికి అనేక అద్భుత లక్షణాలు చేకూరుతున్నాయని యంగ్ కిమ్ అనే శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ లక్షణాలను పూర్తిగా అర్థం చేసుకుని అచ్చం ఇలాంటి నిర్మాణాలతో కృత్రిమ పదార్థాలను తయారు చేయవచ్చునని కిమ్ తెలిపారు. వైద్యరంగంతోపాటు బయోసెన్సింగ్లోనూ ఈ మెటా మెటీరియల్స్ ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. కాంతి కణాలను దాదాపుగా నిలువరించగల మెటామెటీరియల్స్ను ఇప్పటికే కృత్రిమంగా తయారు చేసినప్పటికీ వాణిజ్యస్థాయిలో.. చౌకగా ఉత్పత్తి చేయడం మాత్రం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పట్టు వంటి సాధారణ పదార్థం ద్వారా మెటా మెటీరియల్ లక్షణాలను సాధించగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంచనా. అంతే కాకుండా పట్టు దారాలు ఒకచోట ఉండే వేడిని ఇంకోచోటికి తరలించేందుకు, అది కూడా అతితక్కువ నష్టంతో జరిగేందుకు ఉపయోగపడతాయని కిమ్ చెబుతున్నారు. -
స్కర్ట్... కుచ్చుల గౌను...
న్యూలుక్ వేసవిలో పిల్లలకు వేయాల్సిన దుస్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సిల్క్ దుస్తులు కాకుండా పిల్లల సున్నితమైన చర్మానికి హాయినిచ్చే ఫ్యాబ్రిక్‌వి ఎంచుకోవాలి. ఇందుకు మెత్తని టీ షర్టులు, పెద్దమ్మాయిల కాటన్ స్కర్ట్లు బాగా ఉపయోగపడతాయి. వాడకుండా ఉంచిన వీటితో పిల్లలకు అందమైన స్కర్ట్లు ఎలా రూపొందించుకోవచ్చో తెలుసుకుందాం... పిల్లలు త్వరగా పొడవు పెరుగుతుంటారు. వారి డ్రెస్సులు మాత్రం కొత్తదనం పోనివి చాలానే ఉంటాయి. అలాంటి వాటికి ఇలా కుచ్చులు పెట్టి అందంగా మార్చేయవచ్చు. మీదైన స్టైల్‌తో డిజైనర్ మార్క్ కొట్టేయవచ్చు. స్కర్ట్ పై భాగంలో భుజం మీదుగా రెండు స్ట్రాప్‌లు జత చేస్తే ఎండాకాలానికి ఉపయోగపడేలా జంపర్ స్టైల్ గౌన్ సిద్ధం. అందంగానూ కుచ్చులు కుచ్చులుగానూ డ్రెస్‌ను మార్చేయాలంటే 2-3 రకాల పొడవాటి క్లాత్‌లు తీసుకోవాలి. ఇందుకు పాత గౌనులు, స్కర్ట్లు తీసుకోవచ్చు. కట్ చేసిన స్కర్ట్ పొడవాటి క్లాత్‌లను.. కుచ్చులుగా కుట్టాలి. ఇలా కుట్టిన వాటిని ఒకదాని కింద మరొకటి జత చేస్తూ కుట్టాలి. దీనికి లైనింగ్‌గా లోపలి వైపు పల్చని కాటన్ క్లాత్ వేసి కుట్టాలి. ఇలా చేస్తే పిల్లల ఒంటికి లోపలి డిజైన్ గుచ్చుకోకుండా ఉంటుంది. -
అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రేపు ధ్వజారోహణం
తిరుచానూరు: పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఆటంకాలు లేకుండా జరగాలని సకల దేవతలను కోరుతూ అంకురార్పణ నిర్వహించడం ఆనవాయితీ. సర్వసేనాధిపతియైన విశ్వక్సేనుల వారి సమక్షంలో ఉద్యానవనంలో సేకరించిన పుట్టమన్ను ఆలయానికి తీసుకొచ్చి, పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా నవపాలికలలో నింపి, అందులో నవదాన్యాలు వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టనున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు 19వ తేదీ ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభంకానున్నాయి. ఉదయం 9.16 నుంచి 9.30 గంటల లోపు ధనుర్లగ్నంలో ధ్వజస్తంభంపై గజచిత్రపటాన్ని ఎగురవేయనున్నారు. రాత్రి చిన్న శేషవాహనంతో అమ్మవారి వాహన సేవలు ప్రారంభంకానున్నాయి. లక్షకుంకుమార్చన అంకురార్పణ రోజు ఉదయం ఆలయంలో లక్షకుంకుమార్చన సేవ నిర్వహించడం 19ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలు బాగా పండి, రైతులు, కర్షకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, సకల జీవరాశులు సుఖసంతోషాలతో వర్థిల్లాలని అమ్మవారి అష్టోత్తర శత(108) నామావళిని వేదపండితులు లక్షసార్లు స్తుతిస్తూ ఈ సేవను లోకకల్యాణార్థం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారిని కొలువుదీర్చి ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు లక్షకుంకుమార్చన సేవను నిర్వహించనున్నారు. ఈ సేవలో పాల్గొనదలచిన భక్తులు రూ.1,116 చెల్లించి సేవా టికెట్ కొనుగోలు చేయాలి. ఒక టికెట్‌పై ఇద్దరిని అనుమతించనున్నారు. వీరికి వస్త్ర బహుమానం, అమ్మవారి ప్రసాదాలను అందజేయనున్నారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులతో హాజరు కావాలని ఆలయ అధికారులు సూచించారు. రేపు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం నాలుగేళ్లుగా ఆనవాయితీ. ఈ ఏడాది కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే 19వ తేదీ మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సీఎం సమర్పించనున్నట్లు తెలిసింది. టీటీడీ ఉన్నతాధికారులు హైదరాబాదులో సీఎం చంద్రబాబునాయుడిని కలిసి ఆహ్వానించారు. ఆయన హాజరు కాలేని పక్షంలో ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రుల్లో ఒకరు ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన మంత్రి పట్టువస్త్రాలు సమర్పించవచ్చని ఆలయ అధికారుల ద్వారా తెలిసింది. -
చిన్న శేషుడిపై కల్యాణ వెంకన్న
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలో వెలసిన శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం స్వామివారు చిన్న శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని ఉదయం అర్చకులు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యపూజా కైంకర్యాలు చేశారు. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించారు. వాహన మండపంలో స్వామివారిని పట్టు వస్త్రాలు, వివిధ బంగారు ఆభరణాలతో సర్వాంగసుందరంగా ముస్తా బు చేశారు. అలంకరభూషితులైన స్వామివారిని చిన్న శేషవాహనంపై కొలువుంచి పురవీధుల్లో ఊరేగించారు. భక్తుల గోవిందనామస్మరణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారు విహరించారు. దారిపొడవునా స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పిం చారు. అనంతరం ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం సేవ నిర్వహించారు. ఆకట్టుకుంటున్న కేరళ వాయిద్యాలు తుమ్మలగుంటలో కల్యాణ వెంకన్న బ్ర హ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సా గుతున్నాయి. ఊరంతా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. వాహన సేవల ముందు అశ్వా లు, వృషభాలు, గోమాతలు గంభీరం గా నడుస్తుండగా కోలాటాలు, వేషధారణలు వేలాదిమంది భక్తుల గోవింద నామస్మరణలతో గ్రామం ఆధ్యాత్మిక భక్తిభావం వెల్లివిరుస్తోంది. కేరళ నుంచి వచ్చిన పదిమందితో కూడిన బృందం వాయిద్య విన్యాసాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హంస వాహనంపై స్వామివారు రాత్రి హంస వాహనసేవ కన్నుల పండువగా జరిగింది. భక్తుల గోవిందనామస్మరణలు, భజన బృందాల సాంస్కృతిక సమ్మేళనం నడుమ శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణవెంకన్న మాడవీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, ఈవో సుబ్బరామిరెడ్డి, సర్పంచ్ జయలక్ష్మి, ఉపసర్పంచ్ గోవిందరెడ్డి, కార్యదర్శి వెంకటప్ప, ప్రసాద్, ఆలయాధికారులు, అధిక సంఖ్యలో భక్తులు తది తరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉదయం 7 గంటలకు సింహ వాహనం, సాయంత్రం 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. -
పట్టుమహిషులు
పట్టు గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమైనా, ఫ్యాషన్ ప్రపంచంలో పట్టుకు ప్రాధన్యం కల్పించడమైనా సరే.. ‘పట్టు’దలతోనే సాధ్యం అంటున్నారు ఈ మహిళలు. ‘శ్రీమతి సిల్క్‌మార్క్-2014’లో ర్యాంప్‌పై ఇటీవల మిలమిలలాడిన ఈ మిసెస్లు పట్టువస్త్రాలకు మళ్లీ మంచిరోజులు రావాలనే ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. భిన్న నేపథ్యాలకు చెందిన వారైనా ‘పట్టు’దల వీరిని ఒకే వేదికపైకి తెచ్చింది. పట్టు వస్త్రాలపై ఈ ‘పట్టు’మహిషుల మనోగతం వారి మాటల్లోనే... పట్టుపై అవగాహన పెరగాలి.. పట్టు గురించి విద్యార్థుల్లోనే కాదు, ప్రజల్లోనూ అవగాహన పెరగాలి. పట్టు ప్రాధాన్యమేమిటో మహిళలకే బాగా తెలుసు. పట్టుపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు నా వంతు బాధ్యతగా ఈ ర్యాంప్‌వాక్‌లో పాల్గొన్నా. గత ఏడాది ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్నా, కానీ హాజరు కాలేకపోయాను. అప్పుడు ఇచ్చిన వివరాలను గుర్తుంచుకుని మరీ నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో ఈసారి పాల్గొనగలిగాను. - స్వప్నప్రసాద్, టీచర్, వసంతనగర్, కూకట్పల్లి పట్టు గొప్పదనం అర్థమైంది.. మాది రాజస్థాన్. రాజస్థాన్ సంప్రదాయ వస్త్రధారణలో చీరలకు ప్రాధాన్యం ఉండదు. ఇక్కడికొచ్చాక పట్టు గొప్పదనం అర్థమైంది. టీవీలో స్క్రోలింగ్ చూసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. కాలేజీ డేస్ ఇలాంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. పెళ్లి తర్వాత హైదరాబాద్ వచ్చేశాక ఆ లైఫ్ మిస్సయ్యానన్న దిగులు ఉండేది. పెళ్లయిన వారు సైతం తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు హైదరాబాద్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటం చాలా బాగుంది. - శ్వేతాచౌదరి, పార్ట్‌టైమ్ ట్యూటర్, కొండాపూర్ పట్టుచీరలంటే చాలా ఇష్టం.. మా ఆయన అభిషేక్ హైకోర్టు అడ్వొకేట్. అమ్మాయి శ్రావ్య ఇంటర్ చదువుతోంది. నేను బడ్స్ అండ్ ఫ్లవర్స్ స్కూల్లో పనిచేస్తున్నాను. చివరి నిమిషంలో ఈ కార్యక్రమం గురించి తెలియడంతో స్కూలు నుంచి నేరుగా కార్యక్రమానికి వచ్చేశాను. మన సంప్రదాయ వేడుకల్లో, పండుగల్లో పట్టువస్త్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది. నాకు పట్టుచీరలంటే ఇష్టం.నా దగ్గర పట్టుచీరల కలెక్షన్ చాలానే ఉంది. - సత్యవాణి, టీచర్, కమలాపురి కాలనీ అవగాహన కార్యక్రమం ప్రశంసనీయం.. మా ఆయన ఫ్రాంక్లిన్ కంపెనీలో ట్రెజరర్. పెళ్లయి మూడున్నరేళ్లు అయింది. పెళ్లయ్యాక ఒక్కసారిగా బాధ్యతలన్నీ మీదపడతాయి. ఒతిళ్లు పెరుగుతాయి. అలాంటి ఒత్తిళ్ల నుంచి మహిళలకు రిఫ్రెష్మెంట్ కావాలి. అందులో అవేర్నెస్ కూడా ఉంటే మానసిక తృప్తి కూడా ఉంటుంది. టీవీలో స్క్రోలింగ్ చూసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. పట్టుపై అవగాహన కోసం ఈ కార్యక్రమం చేపట్టడం ప్రశంసనీయం. - శ్రుతిలక్ష్మి, ‘రేడియో అర్చన’లో ఆపరేషన్స్ ఆఫీసర్, రామంతపూర్ మా ఆయన ప్రోత్సాహంతో వచ్చాను.. మా ఆయన హరీష్, డెలాయిట్‌లో ప్రాజెక్ట్ మేనేజర్. పద్నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నా. చిన్నప్పటి నుంచి చదువు కంటే ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీల్లో చదువుకునేటప్పుడు ప్రతి ఈవెంట్లోనూ పార్టిసిపేట్ చేసేదాన్ని. నా ఇంటరెస్ట్ చూసి మా ఆయన నన్ను ప్రోత్సహిస్తుంటారు. పట్టుచీరలపై అవగాహన కల్పించే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమానికి వచ్చాను. - జయ ఇంటూరి, గృహిణి పెళ్లయిన వారికీ వేదికలు ఉండటం విశేషం.. పెళ్లయి నాలుగు నెలలే అయింది. మా ఆయన నరసింహారెడ్డి, మార్కెటింగ్ ఇంజనీర్. టీవీలో స్క్రోలింగ్ చూసి వచ్చాను. పెళ్లయ్యాక ఇదో కొత్త జ్ఞాపకం. మా ఆయన ఎంకరేజ్ చేసి, ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారు. ఇలాంటి వేదికలు పెళ్లయిన వాళ్లకు సైతం అందుబాటులో ఉండటం విశేషం. - అనసూయారెడ్డి, చేవెళ్ల