ప్యాంట్ స్కర్ట్
న్యూలుక్
స్కర్ట్ తెలుసు. ప్యాంట్ హవా ఎరిగిందే! మరి, ప్యాంట్ స్కర్ట్ ఏంటనుకుంటున్నారా! న్యూలుక్‌తో కలర్‌ఫుల్‌గా కనిపించాలంటే ప్యాంట్‌ను + స్కర్ట్‌ను కలిపేస్తే.. ఇదిగో ఇలా ఈ కొత్త డిజైన్ మీ ముందు ఉంటుంది. డెనిమ్ ప్యాంట్ పై భాగాన్ని కత్తిరించాలి. స్కర్ట్ నడుము భాగంలోని కుట్లు విప్పదీసి ప్యాంట్‌కి జత చేయాలి. పిల్లల స్కర్ట్‌లు పొట్టివైనా, టీనేజ్ అమ్మాయిల ఫ్యాన్సీ డ్రెస్ కైనా ఇలాంటి ఐడియా బాగా నప్పుతుంది.
లాంగ్ లెహెంగా: రంగు రంగు క్లాత్ ముక్కలను ప్యాచ్‌లుగా తీసుకొని, స్కర్ట్ మోడల్ కుట్టాలి. దీనికి నడుము భాగంలో ప్యాట్ పై భాగానికి జత చేయాలి. ఈ ప్యాంట్ స్కర్ట్ క్యాజువల్‌వేర్‌కి బాగా నప్పుతుంది. చూసినవారు ‘నీ జీనూ స్కర్టు చూసి బుల్లమ్మో..’ అని పాడుకోవాల్సిందే!
నెటెడ్‌తో: సెల్ఫ్ ప్రింట్లు ఉన్న నెటెడ్ మెటీరియల్ స్కర్ట్‌కి పై భాగాన డెనిమ్ ప్యాంట్‌ను జత చేస్తే ఇలా అందమైన స్కర్ట్ రూపుదిద్దుకుంటుంది.