Pants
-
కోడలిపై మామ అరాచకం.. పొట్టి షార్ట్ వేసుకుందని వేడి వేడి సూప్ పోసి..
ఆధునిక కాలంలో అనేక మార్పులు వచ్చాయి. అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. అయినా కొంతమంది ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావడం లేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుత్ను ఇంకా పితృస్వామ్య మూస ధోరణిలోనే జీవిస్తున్నారు. మా మాటే వినాలి, మేము చెప్పిందే చేయాలనే విధంగా స్త్రీలపై అధిపత్యం చెలాయిస్తున్నారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో అలాంటి ఓ సంఘటనే తాజాగా వెలుగు చూసింది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన కోడలిని వేధింపులకు గురిచేశాడు. పొట్టి బట్టలు వేసుకుందని ఆమెపై వేడి వేడి సూప్ పోసి దాడి చేశాడు. ఈ ఘటన జూన్ 12 న జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. కోడలు సరైన బట్టలు వేసుకోలేదని మామ ఆమెపై అరిచాడు. ఆమె ధరించిన హాట్ ప్యాంట్( పొట్టి షార్ట్) చాలా చిన్నగా ఉందని తిట్టాడు. ఇలాగే బయటకు వెళ్తే ఇరుగు పొరుగు వారు చూస్తే తమ పరువు పోతుందని అన్నాడు. దీనిపై కోడలు స్పందిస్తూ.. ‘నా డబ్బులతో నేను దుస్తులు కొనుకున్నాను. నాకు నచ్చినట్లు వేసుకుంటాను’ అని సమాధానం చెప్పింది. ఈ మాటలు విన్న ఆమె మామయ్య ఒక్కసారిగా హింసాత్మకంగా మారాడు. కోడలు ముఖంపై వేడి సూప్ గిన్నెను విసిరాడు. అంతటితో ఆగకుండా ఈ గొడవను పెద్దది చేస్తూ ఆమె జుట్టు పట్టుకొని లాగి ‘ నేను నిన్ను ఈరోజు చంపేస్తాను’ అంటూ బెదిరించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మహిళ కొడుకు.. తల్లిని రక్షించేందుకు ఆమెను బెడ్రూంలోకి తీసుకెళ్లి తాళం వేశాడు. ఈ విషయం పోలీసుల వరకు చేరుకుంది. వారు ఇంటికి చేరుకొని మహిళ దుస్తుల వల్ల ఎవరికి ఏ నష్టం లేదని దుస్తుల పేరుతో ఆమెను వేధించడం మానేయాలని మామను హెచ్చరించారు. అయితే ఈ విషయం అక్కడితో ఆగలేదు. మామ వేధింపుల గురించి భర్తకు తెలియజేయగా అతను సైతం తండ్రి వైపే నిలిచాడు. అలాంటి దుస్తులు ధరించవద్దని భార్యను వారించాడు. తనకు అండగా ఉంటాడనున్న భర్త సైతం తండ్రి వైఖరితోనే ఉండటంతో తాను విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సదరు మహిళ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో ఆమె ముఖంపై గాయాలు, మచ్చలు ఉన్నాయి. వీటిని చూస్తుంటే మామ ఆమెను తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు మామ ప్రవర్తనపై మండిపడుతున్నారు. ‘ఆమెను చంపేస్తానని బెదిరించడానికి అతనికి ఎంత ధైర్యం? చాలా భయంకరంగా ఉంది ఇది. మనం ఇంకా రాజుల కాలంలో జీవించడం లేదు. ఆమె ఆ దుస్తులు ఎందుకు ధరించవద్దంటూ ప్రశ్నిస్తున్నారు. -
18 ఏళ్లుగా జీన్స్ ప్యాంట్లను ఉతకని మహిళ.. ఒక్క మరక కూడా లేదట..!
లండన్: జీన్స్ ధరించే వారు ఒకట్రెండు సార్లు వేసుకున్న తర్వాత కచ్చితంగా వాటిని వాష్ చేస్తారు. కానీ ఓ మహిళ మాత్రం 18 ఏళ్లుగా తన రెండు జీన్స్ ప్యాంట్లను ఉతకలేదట. ఆపై అవి ఇంకా కొత్త వాటిలాగే ఉన్నాయని చెబుతోంది. కొన్నప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు అలాగే ఉన్నాయంటోంది. దీంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ మొదలైంది. ఇంగ్లాండ్ యార్క్‌షైర్‌కు చెందిన ఈ మహిళ పేరు సాండ్రా విల్లిస్. 18 ఏళ్ల క్రితం ఓ జత ఎంఎస్ డెనిమ్ జీన్స్ ప్యాంట్లను కొనుగులు చేసింది. అయితే ఏడాదికి ఒక్కసారి మాత్రమే వాటిని ధరిస్తోందట. వాటిపై ఒక్క మరక కూడా లేకపోవడంతో వాష్ చేయాలనిపించడం లేదట. ఈమె సెంటు బాగా వాడటంతో జీన్స్ కూడా చెమట వాసన రావడం లేదట. ఇక ఎందుకు ఉతకడం అనుకుని వాటిని అలాగే ఉంచుతోంది. దీంతో ఆ జీన్స్ ప్యాంట్లు చెక్కు చెదరకుండా అలాగే కొత్తగా ఉన్నాయని చెబుతోంది సాండ్రా. ఇంకో రెండేళ్లు కూడా వాటిని ఉతకనంటోంది. 20 ఏళ్లు జీన్స్ ఉతకకుండా రికార్డు సృష్టించాలనుకుంటోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. జీన్స్ ప్యాంట్‌ను ఉతక్కుండా 20 సార్లు వేసుకుంటారా? నేనైతే ఒకట్రెండు సార్లు ధరిస్తే వెంటనే వాష్ చేస్తా.. అని పలువురు నెటిజన్లు అంటున్నారు. అసలు మీరు జీన్స్‌ను ఎందుకు ఉతకడం లేదు? అని మరో యూజర్ ప్రశ్నించాడు. దీనికి సాండ్రా బదులిస్తూ.. తాను జీన్స్‌ను ఉతకకపోయినప్పటికీ వాటిని శుభ్రంగా తూడుస్తానని చెప్పారు. అందుకే అవి కొత్తగా ఉన్నాయని పేర్కొన్నారు. నిజంగా వాటిని ఉతకాలని అన్పించినప్పుడు వాష్ చేస్తానని చెప్పుకొచ్చారు. అంతే కాదు తన వద్ద చాలా జతల జీన్స్ ఉన్నాయని, అందుకే వీటిని ఏడాదికి ఒక్కసారే ధరించినట్లు వివరించారు. వాటిపై ఏమైనా మరకలు పడితే అప్పుడు కచ్చితంగా వెంటనే వాష్ చేస్తానన్నారు. ఇప్పుడు మాత్రం అవి చాలా కొత్తగానే ఉన్నాయన్నారు. చదవండి: వణికిపోతున్న ప్రజలు.. పొంచిఉన్న ముప్పు.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితేంటి? -
తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!?
ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది చిన్న చిన్న అనారోగ్యాలకు చికిత్స కోసం ఇప్పటికీ సంప్రదాయ మూలికలపైనే ఆధారపడుతున్నారు. ఇంటి తోటలో వీటిని పెంచడం వల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి సృజనాత్మకమైన సంతృప్తి. మరోటి ఇంట్లో సంప్రదాయ వ్యాధుల చికిత్స. ఈసారి హోం గార్డెనింగ్‌లో భాగంగా ఇంటి తోటలోనే పెంచే ఔషధ మొక్కల గురించి తెలుసుకొని, వాటి పెంపకాన్ని ఆచరణలో పెట్టేయండి. ఈ మొక్కలకు ఎలాంటి మట్టి కావాలి, ఎంత నీరు పోయాలి, ఎలా చూసుకోవాలి అనే విషయాలను కూడా తెలుసుకోండి. అనేక ఉపయోగాల అలోవెరా కలబంద అనేక వ్యాధులకు నివారిణిగా ఉపయోగపడుతుంది. కలబంద రసం చర్మాన్ని యవ్వనంగా, అందంగా ఉంచుతుంది. జీర్ణకోశ సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది. దోమ వంటి ఇతర కీటకాల కాటులో నొప్పి, మంటను తగ్గిస్తుంది. కలబందను కుండీలలో పెంచుకోవచ్చు. సూర్యకాంతి బాగుండాలి. తక్కువ నీరే అవసరం పడుతుంది. రెండు నెలలకు ఒకసారి కాస్తంత ఆవుపేడను ఎరువు గా వేస్తే సరిపోతుంది. తిప్పతీగ గిలోయ్ అనే ఈ తీగ ఆకు గంట ఆకారంలో ఉంటుంది. ఈ ఆకు వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కాలేయం, మూత్రపిండాల సమస్యలను నయం చేస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, మధుమేహానికి ఉపయోగపడుతుంది. దీనికి అమితమై శ్రద్ధ అవసరం లేదు. పెద్ద కుండీల్లో లేదా కుండలో మట్టి పోసి, నాటితే చాలు. సులభంగా పెరుగుతుంది. నిమ్మగడ్డి యాంటీబ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, తలనొప్పి సమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియ మెరుగుకు సహాయపడుతుంది. ఈ గడ్డి మొక్కను వెడల్పాటి కుండీలలో పెంచుకోవచ్చు. దీనికి నీళ్లు ఎక్కువ అవసరం. కుండీ మట్టిపై భాగంలో ఇసుక పోయాలి. అప్పుడు అదనంగా నీళ్లు ఉన్నా త్వరగా ఇంకిపోతాయి. సరస్వతి ఆకు మండుకాపర్ణి, బ్రాహ్మి మొక్కగానూ పేరున్న సరస్వతి ఆకు అధిక ఒత్తిడి, అధిక రక్తపోటు, ఇతర మానసిక వ్యాధులను నయం చేయడానికి తోడ్పడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఈ మొక్కకు ఒక భాగం మట్టి, ఒక భాగం ఇసుక, రెండు భాగాలు సేంద్రీయ ఎరువుల మిశ్రమం ఉండాలి. రోజూ నీళ్లు పోయాలి. అశ్వగంధ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతుంది. వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక వ్యాధులకు ప్రయోజనకారి. ఈ మొక్కలో ఆకులు, కాండం, వేళ్లు కూడా చికిత్సలో ఉపయోగపడతాయి. కుండీలలో సులభంగా పెంచగల చిన్న మొక్క. ఎక్కువ నీళ్లు అవసరం లేదు. వర్షాకాలం అసలే జలుబు కాలం. దాంతోపాటే దగ్గు, తుమ్ములు. కరోనా కాలం కూడా కావడం తో ఈ తరహా అనారోగ్యం మనల్ని భయపెడుతుంటుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగించే ప్రకృతి ఔషధ వరాలు గల మొక్కలు మన ఇంట్లోనే ఉంటే ఆందోళన కొంత తగ్గుతుంది. -
ప్యాంట్ సూట్లో షాకిచ్చిన వధువు!
వివాహం జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక.. దాంతో చాలా మంది పెళ్లి తంతును గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటారు. బట్టలు మొదలు కళ్యాణ మంటపం వరకు ప్రతిదీ ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. ఇక పెళ్లి కూతురు అనగానే మన మనోఫలకం మీద లెహంగా లేదా.. పట్టు చీర ధరించిన అందమైన యువతి మెదులుతుంది. అమ్మాయిలు ఈ పెళ్లి పట్టు చీర విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మొత్తం పెళ్లి బట్టల్లో ఎక్కువ డబ్బు దీనికే కేటాయిస్తారు. ఇక పెళ్లి నాడు కడితే.. ఆ తర్వాత మళ్లీ ఎన్నో ఏళ్లకు దాన్ని బయటకు తీస్తారు. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఇదే జరుగుతుంది. అసలు పెళ్లికి చీరే కట్టుకోవాలా.. రోజు వేసుకునే దుస్తులు వేసుకుంటే ఏం అవుతుంది అని ఆలోచించింది ఓ యువతి. దాంతో ఇంతవరకు భారతీయ వధువు కనిపించని నయా అవతారంలో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ఆ వివరాలు ఏంటో చూడండి.. (చదవండి: ఆరు కోట్ల ఎంగేజ్మెంట్ రింగ్!) సంజన రిషి అనే యువతి తన పెళ్లికి ప్యాంట్ సూట్ ధరించింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘పెళ్లి కుమార్తె అనగానే సాంస్కృతికంగా.. పోత పోసిన బొమ్మలా ఉండాలని ఎవరు చెప్పారు. వ్యక్తిత్వం మాత్రమే కరెక్ట్‌గా సూట్ అవుతుంది ఎవరికైనా. నా స్టైల్‌కి నప్పే దుస్తులను ఎన్నుకోవాలనుకున్నాను. కానీ స్థానిక చేతి వృత్తుల వారికి మద్దతు ఇవ్వాలనే నా నిర్ణయం మేరకు నేను కూడా ఎంతో కొంత చేశాను. ఈ పాత చేవి రింగులను సలోని కొత్వాల్ నుంచి తీసుకున్నాను. నా అద్భుతమైన నూతన ఆభరణాలను అనుమెర్టాన్ దగ్గర నుంచి తీసుకున్నాను. స్థానికల కళాకారులు నాలుగు రోజులు కష్టపడి వీటిని డిజైన్ చేశారు. ఇక నేను ధరించిన బస్టడ్ నా స్నేహితురాలి తల్లి దగ్గర నుంచి తీసుకున్నాను. కాఫీ పౌడర్‌తో డై వేసుకున్నాను. ఇక ఈ మొత్తం తంతులో నా సొంతమైనది ఏదైనా ఉందా అంటే నేను ధరించిన పౌడర్ బ్లూ ప్యాంట్ సూట్ మాత్రమే. నాకు నచ్చినట్లు నా బ్రైడల్ లుక్‌ని డిజైన్ చేసుకున్నాను. ఇందుకు గాను నేను లక్షలకు లక్షలు డబ్బు ఖర్చు చేయలేదు. సమయం కూడా వృథా చేయలేదు. అన్నింటికి మించి ఎంతో సంతృప్తికరంగా ఉన్నాను’ అంటూ సంజన రిషి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. నెటిజనులు ఆమె ఐడియాకి ఫిదా అయ్యారు. మీరు, మీ ఐడియా రెండూ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram Unprecedented vibes ... Who says bridal looks have to fit a mould, cultural or otherwise? The only thing a look must fit (other than your body) is your personality! I wanted to choose a wedding outfit that encapsulated my style but also stayed true to my commitment to supporting sustainability, local artisans and ethical shopping. I think I did great! Something old: These earrings I stole from @salonikotwal & @_rangana Something new: My stunning jewelry, put together by @anumerton and talented artisans in basically 4 days & this custom made-to-order #veilpatta by @toraniofficial Something borrowed: My bustier, which belonged to my best friends’ (@instagirma + @stop_youplay2much) mom, hand dyed by a frantic me the night before the wedding using old coffee. Something blue: The beyond gorgeous Pre-owned #GianfrancoFerre powder blue pantsuit of my dreams I’m never going to get over how I look and feel in this outfit! #pantsuitnation #bride #sustainablefashion #sustainableclothing #sustainability #slowfashion #slowfashionmovement #vintagefashion #vintageclothing #handmadejewelry #secondhandfashion #indianbride #indianbridal A post shared by Sanjana Rishi (@sanjrishi) on Sep 20, 2020 at 1:34am PDT -
సీతాకోక రెక్కలు
బెల్ బాటమ్ ప్యాంట్స్ గురించి తెలిసిందే కదా! పాదాల వద్ద చాలా వదులుగా ‘బెల్’ ఆకారంలో ఈ ప్యాంట్స్ ఉంటాయి. ఇదే విధానం బెల్ ప్యాటర్న్‌ని స్లీవ్స్‌కి ఉపయోగించారు డిజైనర్లు. ముంజేతులు, మోచేతుల వద్ద ‘బెల్’ ఆకారం వస్తుంది. కుచ్చుల అమరిక అయితే భుజం నుంచి కూడా తీసుకోవచ్చు. వీటిని బటర్‌ఫ్లై స్లీవ్స్ అంటారు. ‘బిషప్ స్లీవ్స్’గా కూడా వీటికి మరో పేరుంది. బ్యూటీ విదేశాల్లో మొదలైన స్టైల్ మ్యాక్సీ డ్రెస్‌కు బెల్ స్లీవ్స్ వాడకం 1970లో మొదలయ్యింది. ఆ ప్యాటర్న్ ఈ పదేళ్లలో రకరకాల వెస్ట్రన్ డ్రెస్‌లకు హంగుగా మారింది. అయితే, ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం ఇటీవలే! మనవాళ్లూ అందిపుచ్చుకున్నారు దేశీయ సంప్రదాయ దస్తులను స్టైలిష్‌గా రూపకల్పన చేయడంలో ఫ్యాషన్ డిజైనర్లు ఎప్పటికప్పుడు ఉత్సుకత చూపుతూనే ఉన్నారు. దీంట్లో భాగంగానే చిన్న చిన్న గౌన్లతో పాటు బ్లౌజ్‌లకూ బెల్ షేప్ స్లీవ్స్ తీసుకువచ్చారు. దీంతో ఇవి కాస్త సంప్రదాయం, మరికాస్త పాశ్చాత్యంతో యువతరాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి. సంప్రదాయానికి అసలు సిసలు చిరునామాగా ఉండే చీరలకూ ఈ స్టైల్‌ని తీసుకువచ్చారు. శారీ బ్లౌజులకు కూడా బెల్ స్లీవ్స్, బటర్‌ఫ్లై స్లీవ్స్ జత చేయడంతో సరికొత్త స్టైల్‌తో అమ్మాయిలను, అమ్మలనూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పూర్తి కాంట్రాస్ట్‌తో మెరుపులు చీరకు పూర్తి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ తీసుకుని లాంగ్ స్లీవ్స్‌ను బెల్షేప్లా డిజైన్ చేయాలి. దీని వల్ల మరో ఎంబ్రాయిడరీ వర్క్ అవసరం ఉండదు. లాంగ్ జాకెట్‌కు కుచ్చులు, లెహంగా, స్కర్ట్మీదకు లాంగ్ జాకెట్‌ని డిజైన్ చేసుకొని దీనికి బెల్ లేదా కుచ్చుల స్లీవ్స్‌ని జత చేస్తే చాలు ఇండో వెస్ట్రన్ లుక్‌తో పార్టీలో ఆకర్షణీయంగా కనిపిస్తారు. పెప్లమ్ బ్లౌజ్ జాకెట్ నడుము భాగంలో కుచ్చుల పార్ట్‌ను అదనంగా జత చేస్తే పెప్లమ్ బ్లౌజ్ అవుతుంది. దీనికి బెల్ స్లీవ్స్ లేదా కుచ్చుల స్లీవ్స్ జత చేస్తే జాకెట్ లుక్ పూర్తిగా మారిపోతుంది. ఈ మోడ్రన్ జాకెట్‌ను అటు లాంగ్ లెహంగాల మీదకే కాకుండా జీన్స్ వంటి అధునాతన ప్యాంట్స్మీదకూ ధరించవచ్చు. జాకెట్ చేతుల భాగం వదులుగా ఉండటం వల్ల వేసవి ఉక్కకు సరైన పరిష్కారం కూడా దొరికినట్టే. స్టైల్‌కి స్టైల్ .. సౌకర్యానికి సౌకర్యం. ఒకే నగ కాలికి.. భుజానికి అందమైన ఆభరణాలతో మేనిని సింగారించడం అనే మాట మగువలకు అత్యంత ప్రియమైనది. ఆధునిక మహిళల మదిని దోచుకునేలా బాడీ జువెల్రీ పేరుతో కాలికి, భుజానికి పట్టీలా అలంకరించుకునేందుకు ఓ ఆభరణం సిద్ధంగా ఉంది. అదే యాంకిల్ అండ్ ఆర్మ్ జువెల్రీ. ఫ్యాషన్ జువెల్రీగా అతివలను ఆకట్టుకుంటున్న ఈ నవీన ఆభరణాలను ధరించే డ్రెస్‌ను బట్టి ఒకసారి చేతికి పట్టీలా అలంకరించుకొని మెరిసిపోవచ్చు. మరోసారి కాలికి పట్టీలా ధరించి వెలిగిపోవచ్చు. ధర మాత్రం ఆన్లైన్లో రూ.200/– నుంచి పలుకుతున్నాయి. -
డెనిమ్.. డైనమిక్
న్యూలుక్ చలికాలాన వెచ్చగా ఉంటుంది. వేసవిలో కంఫర్ట్ ఉంటుంది. ఏకాలమైనా స్టైలిష్‌గా ఉంటుంది. యూత్ ఇష్టపడే డెనిమ్ గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటోంది. డెనిమ్, కార్గో ప్యాంట్లు, షర్ట్లు చాలా కాలం మన్నుతాయి. అందుకే వాటి వినియోగం కూడా ఎక్కువ. కొన్నాళ్లయ్యాక బోర్ కొట్టడమో, పిల్లల ప్యాంట్లు అయితే బిగుతు అవడమో జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు వాటిని ఏం చేస్తారు? ఇక్కడిచ్చిన విధంగా మార్చేయండి. డెనిమ్‌ను ధరించి డైనమిక్ లుక్‌తో కట్టిపడేయండి. షర్ట్ టాప్ డెనిమ్ షర్ట్‌ను ఛాతీ పై భాగానికి కట్ చేయాలి. అయితే, మధ్య బటన్స్ ఉన్న లైన్‌ను అలాగే ఉంచేయాలి. అలాగే, చేతుల భాగాన్ని కత్తిరించాలి. కింది భాగాన్ని పూర్తి కాంట్రాస్ట్ క్లాత్‌ని కొలత ప్రకారం తీసుకొని, జత చేయాలి. ఆకట్టుకునే వెరైటీ టాప్ రెడీ! దీన్ని డెనిమ్ ప్యాంట్స్ మీదకు ధరించవచ్చు. కత్తిరించు.. అతికించు ప్యాంట్ పై భాగం (కటిభాగం) వరకు కత్తిరించాలి. కింద షిఫాన్ లేదా కాటన్ క్లాత్ తీసుకోవాలి. అది ప్లెయిన్ అయినా, ప్రింట్లు ఉన్నది అయినా నచ్చిన కలర్‌కాంబినేషన్ సరిచూసుకోవాలి. కింది భాగం క్లాత్ కొలత ప్రకారం కత్తిరించి, కుచ్చులు పెట్టి, ప్యాంట్ పై భాగానికి జత చేయాలి. ప్యాంట్ స్కర్ట్ రెడీ. పిల్లల ప్యాంట్లు.. పొట్టి స్కర్ట్లు పొట్టివైతే పిరుదుల కింది భాగం వరకు ప్యాంట్‌ను కత్తిరించి, రెండు-మూడు రకాల క్లాత్‌లను విడి విడిగా కుచ్చులు పెట్టి జత చేయాలి. పిల్లలకు నచ్చే స్కర్ట్ సిద్ధం. దీనికి పై భాగాన్ని అతికించి గౌన్లా కూడా రూపొందించవచ్చు. డెనిమ్ లెహెంగా ప్యాంటు పొడవును సరి చూసుకొని కాంట్రాస్ట్ కలర్ కాటన్ క్లాత్స్తో ప్యాచ్ వర్క్ చేసి, మధ్య భాగాన జత చేయాలి. దీంతో ఇలా ఆకట్టుకునే లాంగ్లెహంగా రూపు దిద్దుకుంటుంది. -
ప్యాంట్ స్కర్ట్
న్యూలుక్ స్కర్ట్ తెలుసు. ప్యాంట్ హవా ఎరిగిందే! మరి, ప్యాంట్ స్కర్ట్ ఏంటనుకుంటున్నారా! న్యూలుక్‌తో కలర్ఫుల్గా కనిపించాలంటే ప్యాంట్‌ను + స్కర్ట్‌ను కలిపేస్తే.. ఇదిగో ఇలా ఈ కొత్త డిజైన్ మీ ముందు ఉంటుంది. డెనిమ్ ప్యాంట్ పై భాగాన్ని కత్తిరించాలి. స్కర్ట్ నడుము భాగంలోని కుట్లు విప్పదీసి ప్యాంట్‌కి జత చేయాలి. పిల్లల స్కర్ట్లు పొట్టివైనా, టీనేజ్ అమ్మాయిల ఫ్యాన్సీ డ్రెస్ కైనా ఇలాంటి ఐడియా బాగా నప్పుతుంది. లాంగ్ లెహెంగా: రంగు రంగు క్లాత్ ముక్కలను ప్యాచ్‌లుగా తీసుకొని, స్కర్ట్ మోడల్ కుట్టాలి. దీనికి నడుము భాగంలో ప్యాట్ పై భాగానికి జత చేయాలి. ఈ ప్యాంట్ స్కర్ట్ క్యాజువల్వేర్కి బాగా నప్పుతుంది. చూసినవారు ‘నీ జీనూ స్కర్టు చూసి బుల్లమ్మో..’ అని పాడుకోవాల్సిందే! నెటెడ్తో: సెల్ఫ్ ప్రింట్లు ఉన్న నెటెడ్ మెటీరియల్ స్కర్ట్‌కి పై భాగాన డెనిమ్ ప్యాంట్‌ను జత చేస్తే ఇలా అందమైన స్కర్ట్ రూపుదిద్దుకుంటుంది. -
ఇలాగైతే నప్పుతాయి...
బ్యూటిప్స్ రోజు వారీ వాడుకకు బూట్ కట్ జీన్స్ కాని స్లైట్ ఫ్లేర్ జీన్స్ కాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి ఏ తరహా శరీరతత్త్వానికైనా నప్పుతాయి. వీటిని ధరించడం వల్ల స్లిమ్‌గా కనిపించ వచ్చు. ఇవి వయసును దాచేస్తాయి. డ్రస్ నంబరు చూసుకుని కొనాలి ఒక కంపెనీ ఇచ్చే నంబర్ మరొక కంపెనీ నంబర్‌తో సరిపోలదు. ఒక్కొక్కరు ఒక్కోరకమైన నిబంధనల మేరకు నంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ట్రయల్ వేర్ తప్పనిసరి. వెయిస్ట్తోపాటు ప్యాంటు పొడవు కూడా చూసుకోవాలి. కొన్ని మోడల్స్ పొడవు తక్కువగా ఉంటాయి. షూస్, శాండల్స్ మోడల్, వాటి అందం కనిపించడం కోసం పొడవు తక్కువగా ఉన్న వాటిని ఎంచుకుంటారు. ప్రతిసారీ డ్రస్‌కు మ్యాచింగ్ పాదరక్షలను వాడగలిగినప్పుడే ఇలాంటి వాటిని తీసుకోవాలి. సాధ్యం కానప్పుడు పాదరక్షలను కప్పేసే మోడల్‌ను ఎంచుకోవాలి. కాళ్లు పొట్టిగా ఉన్న వాళ్లు ఎంత అందమైన పాదరక్షలను వాడే అవకాశం ఉన్నా సరే పొడవు కాళ్లున్న పాంటులనే వాడాలి. పొడవుతో ప్యాంటులో కాళ్ల పొట్టిదనాన్ని దాచేయవచ్చు. అసలే పొట్టిగా ఉన్న కాళ్లకు పొట్టి కాళ్ల ప్యాంటు వేస్తే మరీ కురచగా కనిపిస్తారు. వైడ్ లెగ్ ప్యాంట్లు చక్కటి స్ట్రెయిట్ లైన్‌తో స్టైల్‌గా ఉంటాయి. ఒక మోస్తరు పొడవు నుంచి బాగా పొడవుగా ఉంటే వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక వయసు రీత్యా చూస్తే ఇవి ధరించినప్పుడు ఉన్న దానికంటే కాస్త పెద్దగా కనిపిస్తారు. ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఉన్న వాళ్లు హుందాగా కనిపించడం కోసం వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అఫీషియల్ మీటింగ్స్‌కు బాగుంటాయి. -
ప్యాంట్... బేబీ గౌన్
న్యూలుక్ కార్గో ప్యాంట్స్, జీన్స్ మగ - ఆడ - పిల్లలు తేడా లేకుండా అందరూ వాడేస్తున్నారు. వాటిలో ఏళ్లకేళ్లుగా వాడినా పాడవని ప్యాంట్స్ ఉంటుంటాయి. విసుగొచ్చి పక్కన పడేసినవీ, పిల్లలకు పొట్టిగా మారిన ఈ ప్యాంట్స్‌ను ఉపయోగపడేలా మార్చుకోవచ్చు. అందమైన హ్యాండ్ బ్యాగ్ ప్యాంట్ నడుము భాగాన్ని తీసుకొని, హ్యాండ్ బ్యాగ్స్గానూ, ఫోన్ పౌచ్లుగానూ రూపొందించవచ్చు. తీసుకున్న క్లాత్‌ని బ్యాగ్ నమూనా వచ్చేలా కట్ చేసి, ఫొటోలో చూపిన మాదిరిగా కుట్టాలి. పాకెట్స్‌తో గౌన్: ప్యాంట్స్‌కు పెద్ద పెద్ద పాకెట్స్ (జేబులు) ఉంటాయి. పాకెట్స్తోనే ఓ డిజైన్ సృష్టిస్తే.. అది పిల్లలకు మంచి డ్రెస్ అవుతుంది. ప్యాంట్ పెద్ద జేబులు ఉన్న భాగాలను తీసుకోవాలి. పాకెట్ క్లాత్‌కు పూర్తి కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి మెత్తని క్లాత్ తీసుకుంటే మంచిది. కుట్టడానికి వీలైన వస్తువులను తీసుకోవాలి. పిల్లల కొలతలకు తగ్గట్టు స్కర్ట్ లేదా గౌన్ డిజైన్ చేసుకొని కుట్టేసి ప్యాంట్ పాకెట్‌ను జత చేస్తే కొత్త డ్రెస్ రెడీ. -
ప్యాంట్లతో పెద్దమనుషులైపోరు: అసదుద్దీన్
బనగానపల్లె : ఆర్ఎస్ఎస్ 1925లో నిక్కర్లతో ఏర్పాటయిందని.. ఇప్పుడు ప్యాంట్లలోకి వచ్చి పెద్దమనుషుల్లా చెలామణి అవుతోందని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. గురువారం రాత్రి కర్నూలు జిల్లా బనగానపల్లెలోని ఉర్దూ భవన్లో ఎంఐఎం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ ఎంఐఎం మతతత్వ పార్టీ కాదని.. ముస్లిం, దళిత సోదరుల పార్టీ అన్నారు. ఈ వర్గాలపై దాడులను నిరోధించడంతో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నికల ముందు ముస్లింలకు ఇచ్చిన హామీలను బాబు విస్మరించారన్నారు. -
పంచె కంటే పాతది ప్యాంటుకట్టు
పంచె పాతదా? ప్యాంటు పాతదా? అంటే పంచెకట్టే పాతదని ఠక్కున చెప్పేస్తాం. అంతేకాదు, పంచెకట్టే వాళ్లకు ఫ్యాషన్ తెలియదని కూడా పెదవి విరిచేస్తాం. వాళ్లను పాతకాలం మనుషులుగా తీసిపారేస్తాం. అయితే, ఈ అభిప్రాయం సరికాదు. నిజానికి పంచెకట్టు కంటే ప్యాంటుకట్టే ఏజ్ ఓల్డ్ ఫ్యాషన్. మరోలా చెప్పాలంటే ప్యాంటుకట్టుతో పోలిస్తే, పంచెకట్టే లేటెస్ట్ ఫ్యాషన్. చరిత్రను తవ్వితీస్తే బయటపడిన విశేషమిది. ఉత్తర ఇటలీ ప్రాంతంలో పర్యటిస్తున్న ఇద్దరు జర్మన్ పర్యాటకులకు 1991లో ఒక మంచుమనిషి మమ్మీ కనిపించింది. ఆ మంచు మనిషి మమ్మీకి తోలుతో తయారు చేసిన ప్యాంటులాంటి వస్త్రవిశేషం, నడుముకు బెల్టులాంటి పట్టీ ఉన్నాయి. లాబొరేటరీల్లో పరీక్షలు జరిపితే, ఆ మంచుమనిషి మమ్మీ సుమారు క్రీస్తుపూర్వం 3300 సంవత్సరాల నాటిదని తేలింది. - పన్యాల జగన్నాథదాసు -
జీన్స్‌తో జర జాగ్రత్త!
బహుశా ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్‌ప్యాంట్ పొందినంత ప్రాచుర్యం మరే ఇతర దుస్తులూ పొంది ఉండవు. రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగించడానికి అనువైనవి కావడంతోపాటు సౌకర్యమూ ఉండటం వల్ల ఈ ఆధిపత్యం ఇలాగే కొనసాగుతోంది. అయితే జీన్స్ ప్యాంట్ల వల్ల కలిగే అనర్థాలపై జరిగిన అధ్యయనాల్లోని అనేక అంశాల్లో ఒకటి కాస్త ఆందోళన గొలిపేదిగానే ఉంది. జీన్స్ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం (సక్లముక్లం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీన్స్ ప్యాంట్ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే ఒక్కోసారి జీన్స్ ప్యాంట్లతో బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకుని కూర్చునేవారు అస్సలు నడవలేని పరిస్థితి కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్ వేసుకొని ‘స్క్వాటింగ్’ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్‌లో పరిశోధకులు ప్రచురించారు. కొత్త పరిశోధన -
ప్యాంట్ కొలత కరెక్టేనా?!
షాప్‌లో లేదా ఆన్లైన్ ద్వారా ప్యాంట్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఎప్పుడూ కొలతల విషయంలో ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. షాప్‌లోనే వేసుకొని ఎంపికచేసుకోవడం అన్నిసందర్భాలలో కుదరదు. మీ నడుము కొలతకు వదులుగానో, మరీ బిగుతుగా ఉండే ప్యాంట్స్‌ను ఎంచుకోవడం, ఇంటికి వచ్చాక చెక్ చేసుకొని సరైన ఫిటింగ్ లేకపోతే మళ్లీ షాప్‌కి వెళ్లడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది లేకుండా... ముందు టేప్‌తో మీ నడుము కొలత సరిచూసుకోండి. కొలత తీసుకునేటప్పుడు మరీ బిగుతుగా కాకుండా ‘ఫింగర్ విడ్త్’ ఉండేలా చూసుకోండి. షాప్‌కి వెళ్లినప్పుడు ఎంచుకున్న ప్యాంట్ కొలతతో సరిచూసుకోండి. ఉదా: మీ నడుము సైజ్ 24 అంగుళాలు అయితే మీ ప్యాంట్ సైజ్ 0 అని గుర్తించండి. అదే 25 అంగుళాలు అయితే సైజ్ ‘2’, 26 అంగుళాలు అయితే సైజ్ ‘4’, 27 అంగుళాలు అయితే సైజ్ ‘6’ ఎంచుకోండి. మీరు కొనుగోలు చేయబోయే ప్యాంట్‌ను ధరించిన ప్యాంట్ పైనే వేసుకొని షాప్ ట్రైలర్ రూమ్‌లో చూసుకుంటే కొలతలలో తేడా వస్తుంది. బ్రాండెడ్ ప్యాంట్ కంపెనీలు ఆన్లైన్లో ‘ఉమెన్స్ సైజ్ చార్ట్’లు ప్రత్యేకంగా రూపొందించినవి ఉన్నాయి. వీటిని బట్టి మీ కొలతలకు తగ్గ ప్యాంట్ సైజ్‌లను ఎంచుకోవచ్చు. -
మళ్లీ వచ్చేశాయి!
ట్రెండ్ ఫ్యాషన్ అనేది ‘టాటా... వీడుకోలు’ అని ఎప్పుడూ పాడదు. ఎందుకంటే అది వెళ్లినట్టే వెళ్లి మళ్లీ వస్తుంది. ‘బాగున్నారా!’ అని పలకరిస్తుంది. ‘రిప్పెడ్ జీన్స్’ హవా 1990 ప్రాంతంలో బాగా నడిచింది. ఇప్పుడు లేటెస్ట్గా ముందుకు వచ్చింది. ఈ జీన్స్ వేసుకోవడాన్ని ఇప్పుడు కుర్రకారు ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ప్యాంట్లో ఏ చిన్న చిరుగు కనిపించినా ‘ఇక సెలవా మరి!’ అని మూలకు పడేసేవాళ్లం. ‘రిప్పెడ్ జీన్స్’లో ఎన్నో చిరుగులు! ఎంత ఎక్కువ చిరుగులు కనిపిస్తే ఇప్పుడు అంత ఫ్యాషన్ అన్నమాట! -
ఆజన్మం: ధోవతిలో ఆఫీసుకు..
ఇది బాధే; కానీ బాధ అంటే ఒప్పుకోవడానికి ఎవరూ ఇట్టే సిద్ధంగా ఉండని బాధ! మన నాన్నల తరంలో మగవాళ్లు చెడ్డీలు దాటే వయసురాగానే, ధోవతుల్లోకి మారిపోయేవారు. చదువుకున్నవాళ్లు ప్యాంట్లు తొడిగినా, ధోవతులు కట్టుకోవడం కూడా కొనసాగింది. అదే ఇప్పుడు నాకు నిక్కరు వదిలెయ్యగానే ప్యాంటు తప్ప మరో దారిలేదు. అదే అమ్మాయిలు లంగావోణీలు దాటాక చీరలు కట్టుకున్నా బాగుంటుంది; చుడీదార్లు, జీన్సులు, ఆఖరికి ప్యాంటు షర్టు వేసుకున్నా బానేవుంటుంది. నా ఉద్దేశం వాళ్లు చీర కట్టుకుంటే మనం దాన్ని ‘ఆడ్’గా చూడం. మరి మనకు ధోవతి ఎందుకు దూరమైపోయింది? మా రాజన్న ధోవతి నుంచి ప్యాంటుకు మారే పరిణామ క్రమాన్ని మా ఊరి పొలిమేర గమనించేది. ఇంట్లో ధోవతి కట్టుకుని, స్కూటర్ డిక్కీలో ప్యాంటు పెట్టుకుని, ఊరి బయట ఆ ప్యాంటులోకి మారిపోయి, పని నుంచి తిరిగి వచ్చేప్పుడు మళ్లీ ధోవతిలోకి వచ్చేసేవాడు. అంటే, తన వస్త్రధారణను ఎవరు చూస్తే అసౌకర్యంగా ఫీలవగలడో, వాళ్ల దగ్గర దాన్ని తన సహజమైన స్థితిగా నమోదు చేయించుకునేదాకా అలా కొనసాగించాడు. కాకపోతే అది ధోవతి నుంచి ప్యాంటులోకి! మరి ఇటుది అటుగా సాధ్యమా? ధోవతి కట్టుకుని ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగానికో వెళ్తే ఎలా ఉంటుంది? ఎక్కువమంది ఆమోదం పొందాక, సహజమైనది అసహజంగానూ, ‘అసహజమైనది’ సహజంగానూ మారిపోవడం విడ్డూరం. స్వాభావికంగా వస్త్ర ప్రీతి ఉన్నవాళ్ల సంగతి సరే; లేదంటే ఒక్క జతతో వెళ్లిపోయే జీవితం కదా! రంగుబట్టల్లో ఒక్క జతతో గడపడం సాధ్యం కాదు. ఉన్నవి అవే రెండని ఎందుకు తెలియాలి? కనీసం తమిళుల్లాగా తెల్లలుంగీ అయినా కట్టుకోవడానికి ‘అధికారిక’ అవకాశం ఎందుకు లేదు మనకు? ఫకీర్లలాగా ముందువైపున కాస్త ఎత్తికట్టిన లుంగీ, కాళ్లకు తగలకుండా నడవడానికి సౌకర్యంగా ఉంటుంది కదా! మగ వస్త్రం గుడి మల్కాపూర్‌లో ఒకసారి ఒక ఇంటి వరండాలో ఒకాయన్ని చూశాను. ముందు ఆమె అనుకున్నాను; కానీ ఆమె కాకుండా ఉండేదేదో కూడా అంతే చప్పున స్ఫురిస్తూ ఉండటం వల్ల ఆయనేనని నిర్ధారించుకున్నాను. మరి ఈయన నైటీ వేసుకున్నాడేంటీ! నా ఆశ్చర్యపు చూపును ఆయన పసిగట్టకుండా వడివడిగా నడుస్తూండగా, దీనికి సమాధానం చెప్పడం కోసమే అన్నట్టుగా మా బాపు ఠక్కున మదిలోకి వచ్చాడు: బాపు ధోతి కట్టుకుంటాడు. చిన్నతనంలో ఆయనా నాలా లాగు వేసుకునివుంటాడా? మరి లాగు తర్వాత? హెచ్చెస్సీ చదివినప్పుడు? ప్యాంటు ధరించిన బాపును నేనేరకంగానూ ఊహించలేకపోయేవాణ్ని. ఏ వడ్ల కల్లాలప్పుడో, నా పది పన్నెండేళ్ల వయసు కుతూహలానికి, ‘‘సైను బట్టతోటి గుడుతర్రా; అది అటు పాయింటుగాదు, ఇటు అంగీగాదు; ఎల్ల ఒకటే బట్ట,’’ అన్నాడు. ఓహో! అయితే, ఆయన వేసుకున్నదిదీ! నిలువెల్లా తెల్లటి అంగరఖ ధరించడం చూసిందే అయినా, ఆయన తెలుపుకు బదులుగా చుక్కలది వేసుకోవడం వల్ల, దాని మీద ఆపాదించబడివున్న స్త్రీత్వపు గుణం వల్ల, ధరించిన మనిషి గురించిన లింగస్పృహ కలగజేసిన షాక్, నా పూర్వ జ్ఞాపకాన్ని తాత్కాలికంగా రద్దుచేసింది; అదే సమయంలో ఈ జ్ఞాపకాన్ని మేల్కొల్పడానికి తిరిగి అంతకంటే బలమైన పూర్వజ్ఞాపకం పూనుకోవడంతో సందేహ నివృత్తి జరిగింది. అయితే, చిత్రంగా ఆ నివృత్తి జరిగింది ప్రస్తుతంలో మాత్రమే కాదు; ఇరవై ఏళ్ల క్రితం ‘అంగరఖ’ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలియకపోవడం వల్ల, బాపు చెప్పినప్పుడు సందూకు అడుగునెక్కడో అబ్స్ట్రాక్ట్గా ఉన్న దాని రూపం ఇప్పటి సంఘటన ఊతంతో ఛక్‌మని మెరిసినట్టయి సజీవంగా హేంగర్‌కు వేలాడింది. - పూడూరి రాజిరెడ్డి