జీన్స్‌తో జర జాగ్రత్త!
బహుశా ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్‌ప్యాంట్ పొందినంత ప్రాచుర్యం మరే ఇతర దుస్తులూ పొంది ఉండవు. రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగించడానికి అనువైనవి కావడంతోపాటు సౌకర్యమూ ఉండటం వల్ల ఈ ఆధిపత్యం ఇలాగే కొనసాగుతోంది. అయితే జీన్స్ ప్యాంట్ల వల్ల కలిగే అనర్థాలపై జరిగిన అధ్యయనాల్లోని అనేక అంశాల్లో ఒకటి కాస్త ఆందోళన గొలిపేదిగానే ఉంది. జీన్స్ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం (సక్లముక్లం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
జీన్స్ ప్యాంట్ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే ఒక్కోసారి జీన్స్ ప్యాంట్లతో బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకుని కూర్చునేవారు అస్సలు నడవలేని పరిస్థితి కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్ వేసుకొని ‘స్క్వాటింగ్’ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్‌లో పరిశోధకులు ప్రచురించారు.
కొత్త పరిశోధన