ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాలన ప్రజా రంజకంగా కంటే ప్రతి చిన్న విషయంపైనా ఆంక్షలు విధిస్తూ నిరంకుశత్వ ధోరణితో పాలన సాగిస్తాడు కిమ్. అక్కడ ప్రజల జీవిన విధానం దగ్గర నుంచి ధరించే దుస్తులపై కూడా ఆంక్షలు ఉంటాయి. 'స్వేచ్ఛ' అన్న పదానికి సంకేళ్లు వేసేలా ఉంటుంది అక్కడ ప్రజల జీవన విధానం. విచిత్రమేమిటంటే దీన్ని తమ జాతీయతను గౌరవించడమని సగర్వంగా చెప్పుకుంటుంది ఉత్తర కొరియా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..జీన్స్ అంటే ఎంత క్రేజ్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ విదేశాల్లో యువత ఎంతో ఇష్టంగా ఫ్యాషన్ ట్రెండ్‌గా ధరిస్తుంది. అలాంటి జీన్స్‌ని ఉత్తర కొరియా బ్యాన్ చేయడమే గాక ధరించటాన్నే నేరంగా, ముప్పుగా చూస్తుంది. ఇలా ఎందుకంటే..!
ఉత్తరకొరియ జీన్స్‌ని ఎందుకు బ్యాన్ చేసిందంటే..రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 20వ శతాబ్దంలో కొరియా రెండు వేర్వేరు దేశాలుగా విడిపోయింది. దక్షిణ, ఉత్తర కొరియాలుగా విడిపోయింది. ప్రతి దేశం అమెరికాతో ప్రభావితమవుతుంది. అది ఆహార్యం, విద్య, ఫుడ్, టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్క అంశంలోనూ ఆ దేశం ప్రభావం ఉంటుంది. అయితే అందుకు విరుద్ధం ఉత్తరకొరియా ఉంటుంది. ఇక్కడ దక్షిణ కొరియా అమెరికాకి మిత్ర దేశంగా ఉంటే..ఉత్తర కొరియా మాత్రం అమెరికాకి పూర్తి వ్యతిరేకి. అంతేగాదు ఆ దేశానికి సాన్నిహిత్యంగా ఉన్న ప్రతిదీ కూడా తనకి వ్యతిరేకం అన్నంతగా ఆ దేశాన్ని వ్యతిరేకిస్తుంది ఉత్తర కొరియా. అందులో భాగంగానే పాశ్చాత్య సంస్కృతి ప్రభావం తన దేశంపై పడటాన్ని అస్సలు ఇష్టపడదు ఉత్తర కొరియా.
అందులోని జీన్స్ అమెరికాకి సంబంధించిన ఫ్యాషన్ శైలి. ఇది ఉత్తర కొరియా దృష్టిలో ఫ్యాంటు కాదు పాశ్చాత్య వ్యక్తిత్వం, స్వేచ్ఛ, తిరుగుబాటుకి చిహ్నంగా పరిగణిస్తుంది. అందువల్లే ఉత్తర కొరియా దేశ సంస్కృతికి అనుగుణంగా, క్రమశిక్షణ విధేయతకు పెద్ద పీఠవేసేలా ఆహార్యం ఉండాలని నొక్కి చెబుతుంది. ఈ జీన్స్ అనేది జస్ట్ ఫ్యాషన్ కాదు అంతకు మించి తీవ్రమైన ముప్పుగా పరిణిస్తుంది. అందువల్లే ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలోనూ ఎక్కడ కూడా ప్రజలు జీన్స్ ధరించకూడదు. తమ దేశ సంప్రదాయానికి అనుగుణంగానే ఉండాలి. ఇది పాలనకు అత్యంత ముఖ్యమని ఉత్తర కొరియా విశ్వసించడం విశేషం.
అంతేగాదు దీన్ని ఆ దేశం స్వచ్ఛమైన సామ్యవాదానికి అనుగుణంగా ఉండేలా చేయడమని విశ్వసిస్తోంది. ఈ జీన్స్‌ని తిరగుబాటుకు, ధిక్కారానికి చిహ్నంగా పేర్కొంటుంది. అందువల్లే తమ ప్రజలు ఈ నియమాన్ని ఉల్లంఘించకుండా ఉండేలా దుస్తుల కోడ్‌ని అమలు చేయడమే గాక వీధుల్లో అందుకోసం పోలీసుల చేత పెట్రోలింగ్ నిర్వహిస్తోంది కూడా. ఒకవేళ ఎవ్వరైన జీన్స్ ధరించి కనబడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనవల్సి ఉంటుంది. ముఖ్యంగా జరిమానా, బహిరంగ అవమానం లేదా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అక్కడ అధ్యక్షుడు కిమ్ తన పాలనపై పట్టు కోసం ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చిన్న చిన్న విషయాలపై కూడా ఆంక్షలు వేస్తూ నియంతలా పాలన చేస్తుంటాడని స్థానిక మీడియా పలు కథనాల్లో పేర్కొంది కూడా.
(చదవండి: స్పేస్‌లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్..అన్ని రోజులు ఉండిపోతే వచ్చే అనారోగ్య సమస్యలు?)
Comments
Please login to add a commentAdd a comment