ప్యాంట్లతో పెద్దమనుషులైపోరు: అసదుద్దీన్ | MP Asaduddin OWAISI comments on RSS | Sakshi
Sakshi News home page

ప్యాంట్లతో పెద్దమనుషులైపోరు: అసదుద్దీన్

Published Fri, Apr 8 2016 8:14 AM | Last Updated on Thu, Aug 9 2018 5:00 PM

ప్యాంట్లతో పెద్దమనుషులైపోరు: అసదుద్దీన్ - Sakshi

ప్యాంట్లతో పెద్దమనుషులైపోరు: అసదుద్దీన్

బనగానపల్లె : ఆర్‌ఎస్‌ఎస్ 1925లో నిక్కర్లతో ఏర్పాటయిందని.. ఇప్పుడు ప్యాంట్లలోకి వచ్చి పెద్దమనుషుల్లా చెలామణి అవుతోందని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. గురువారం రాత్రి కర్నూలు జిల్లా బనగానపల్లెలోని ఉర్దూ భవన్‌లో ఎంఐఎం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ ఎంఐఎం మతతత్వ పార్టీ కాదని.. ముస్లిం, దళిత సోదరుల పార్టీ అన్నారు. ఈ వర్గాలపై దాడులను నిరోధించడంతో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నికల ముందు ముస్లింలకు ఇచ్చిన హామీలను బాబు విస్మరించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement