గొంతుపై కత్తిపెట్టినా ఆ నినాదం చేయను: ఒవైసీ
'భారత్ మాతాకీ జై' అనే నినాదాన్ని తాను చేయబోనని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యువతరానికి 'భారత్ మాతాకీ జై' అనే నినాదాన్ని బోధించాలన్న ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యలపై అసద్ ఈమేరకు స్పందించారు. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని ఉద్గిర్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ 'ఆ నినాదాన్ని నేను చేయను. మీరు ఏం చేస్తారు? భగవత్ సాబ్' అని పేర్కొన్నారు.
'నా గొంతుపై కత్తిపెట్టినా ఆ నినాదాన్ని చేయను. 'భారత్ మాతాకీ జై' అని ప్రతి ఒక్కరూ కచ్చితంగా నినదించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు' అని ఒవైసీ తెలిపారు. జెఎన్‌యూలో జాతి వ్యతిరేక నినాదాల వివాదం నేపథ్యంలో దేశభక్తి పెంపొందించేలా యువతరానికి 'భారత్ మాతాకీ జై' అనే నినాదాన్ని బోధించాలని ఈ నెల 3న మోహన్ భగవత్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
WATCH: Asaduddin Owaisi to RSS chief Mohan Bhagwat- Won't say "Bharat Mata Ki Jai" in Latur (Maharashtra) (March 13)https://t.co/nRNtaBfi6z
— ANI (@ANI_news) March 14, 2016