Bharat Mata Ki Jai
-
దేశంలో ఉండేందుకు వారు మాత్రమే అర్హులు..
సాక్షి, ముంబై : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు. ‘భారత్ మాతాకీ జై’ అనే వారే ఈ దేశంలో నివసించడానికి అర్హులని అన్నారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారంతా ఇక్కడ ఉండటానికి భారత్ ధర్మసత్రం కాదని వ్యాఖ్యానించారు. చట్టాలను గౌరవించలేని వారు ఇక్కడ ఉండేదుకు అనర్హులని పేర్కొన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ఏబీవీపీ మహాసభల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని ఆయన తప్పుపట్టారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పౌరులుకు శాశ్వత గుర్తింపు కార్డులు జారీ చేయకుండా ప్రపంచంలో ఏ దేశమూ లేదని ఆయన గుర్తుచేశారు. దేశ భద్రత కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంపై వివక్షాలు నిరసల చేయాల్సి అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. -
‘భారత్ మాతాకీ జై’ సహజంగా అనాల్సిందే
లక్నో : భారత్ మాతాకీ జై అనే నినాదం సహజ సిద్దంగా రావాల్సిందేనని, అది దేశంపై ఉన్న ప్రేమ, భక్తిలకు నిదర్శనమని ఉత్తరప్రదేశ్ మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి చౌదరి లక్ష్మీనారయణ తెలిపారు. ముఖ్యంగా భారత జెండా ఆవిష్కరణ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి పౌరుడు నోట సహజంగా రావాల్సిందేనన్నారు. ప్రభుత్వ వక్ఫ్ భూముల్లో నడుస్తున్న 1500 మదర్సాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయమనడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రతీ ఏడాది మదర్సాల్లో జెండా పండుగ జరుగుతోందని, జాతీయ గీతం ఆలిపిస్తున్నారని, భారత్ మాతాకీ జై అని నినదిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ఎక్కడా ఆదేశాలు జారీచేయాల్సిన అవసరం లేదన్నారు. జెండా పండుగ నిర్వహించి అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటామన్నారు. ఇక కొంత మంది జాతీయ గీతం ఆలిపించాలా? లేదా అని సందిగ్ధంలో ఉన్నారన్నారు. సీనియర్ హైకోర్టు లాయర్, ఆల్ఇండియా ముస్లిం బోర్డు సెక్రటరీ జాఫర్యాబ్ జిలాని అందరూ జాతీయ గీతాన్ని గౌరవిస్తూ పాడాలన్నారు. రాష్ట్రంలోని మదర్సాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేలా.. ‘భారత్ మాతాకి జై’ అని నినదించేలా ఆదేశాలు జారీ చేయాలని షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రజ్వీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు
-
అలా అనని వారు.. పాకిస్తానీలే!
లక్నో: ‘భారత్ మాతాకీ జై’ అనని వారిని పాకిస్తానీలని పిలుస్తానని యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. భారత్‌లో ఉంటూ భారత్ మాతాకీ జై అనని వారిని పాకిస్తానీయులని పిలుస్తానన్నారు. ఎవరికి భయపడి భారత్ మతాకీ జై అనడం లేదని ప్రశ్నించారు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సురేంద్ర సింగ్ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తొలిసారేం కాదు. ఈ ఏడాది ఆరంభంలో భారతదేశం 2024 నాటికి హిందూ రాజ్యంగా మారబోతుందన్నారు. ఇలా ఒకసారి భారత్ హిందూ రాజ్యంగా మారితే.. ఇక్కడున్న ముస్లింలు అందరూ హిందువుల సంస్కృతి, సంప్రదాయాలను ఆచరించాలని సూచించారు. రాహుల్ గాంధీకి భారతదేశ సంస్కృతిపై పూర్తిస్థాయి అవగాహన లేదని, రాహుల్‌లో భారత్, ఇటలీ సంస్కృతి మిళితమైందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా అప్పట్లో తీవ్ర దుమారం లేపాయి. -
‘అసదుద్దీన్ ఒవైసీపై చర్యలేం తీసుకున్నారు’
న్యూఢిల్లీ: ‘భారత్‌మాతాకీ జై’ వివాదం కేసులో ఎంఐఎం పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. ఒవైసీపై స్వరాజ్ జనతా పార్టీ అధ్యక్షుడు బ్రిజేశ్ చాంద్ శుక్లావేసిన దావాను విచారించిన కోర్టు ఒవైసీపై కేసు నమోదు చేయాలని గతంలోనే ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. దీంతో కరవాల్ నగర్ పోలీసుస్టేషన్లో ఆయనపై కేసు పెట్టారు. దేశద్రోహం, విద్వేషాలను రెచ్చగొట్టడం తదితర సెక్షన్లను నమోదు చేశారు. అయితే పోలీసులు అసదుద్దీన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో శుక్లా మరోసారి కోర్టును ఆశ్రయించారు. తన గొంతుపై కత్తిపెట్టి బెదిరించినా భారత్ మాతాకీ జైకొట్టనని ఒవైసీ అనడం తెలిసిందే. -
తలలు తీసేయగలం.. కానీ!
♦ చట్టంపై గౌరవంతో ఆగిపోతున్నాం ♦ భారత్ మాతా కీ జై అననివారిపై ♦ బాబా రామ్‌దేవ్ అనుచిత వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ‘భారత్ మాతా కీ జై’ నినాదం మరింత వివాదాస్పదమవుతోంది. తాజాగా, ఐంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ లక్ష్యంగా యోగా గురు బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘ఒకతను టోపీ పెట్టుకుని వస్తాడు. తన గొంతు కోసినా భారత్ మాతా కీ జై అని నినదించనంటాడు. ఈ దేశంలో చట్టం ఉంది. లేదంటే నీ ఒక్కడిదేంటి.. మేం లక్షలాది తలలు తెగ్గోయగలం. చట్టం, రాజ్యాంగంపై గౌరవం ఉంది కాబట్టి కానీ.. లేదంటే భారతమాతను ఎవరైనా అవమానిస్తే.. లక్షల తలలు నరికే సామర్ధ్యం మనకుంది’ అంటూ రామ్‌దేవ్ రెచ్చిపోయారు. రోహతక్‌లో ఆదివారం ఆర్ఎస్ఎస్ నిర్వహించిన సద్భావన సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామ్‌దేవ్ వ్యాఖ్యలపై సోమవారం దుమారం చెలరేగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ దీనిపై మండిపడుతున్నాయి. రామ్‌దేవ్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధికారప్రతినిధి సంజయ్ ఝా ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. దేశంలోని రైతులు, ప్రజలు పడుతున్న సమస్యల నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ అని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి విమర్శించారు. భారత్ మాతాకీ జై అనడం ద్వారా మాతృభూమిపై గౌరవాన్ని, దేశభక్తిని అంగీకరించినట్లు అవుతుందని రామ్‌దేవ్ చెప్పారు. ఏ మతమైనా ఆ నినాదాన్ని వ్యతిరేకిస్తే అది జాతి హితాన్ని వ్యతిరేకించినట్లేనన్నారు. మా స్కూళ్లలో చేరాలంటే జై అనాల్సిందే.. బీజీపీ నేత దిలీప్ సంఘానియా, తన ట్రస్టు నడుపుతున్న స్కూళ్లలో చేరాలనునే విద్యార్థులు కచ్చితంగా భారత్ మాతాకీ జై అనాలని వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. -
ఫడ్నవీస్‌కు భారతమాత అంటే ఎంత ప్రేమో!
ముంబై: 'భారత మాతాకీ జై' అంటూ ప్రతి భారతీయుడు నినదించి దేశం పట్ల తనకున్న విధేయతను చాటుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా పిలుపునిచ్చారు. అలా నినాదం చేయనివాడు భారతీయుడే కాదు పొమ్మన్నారు. దేశం సంగతి దేవుడెరుగు.. కనీసం మహారాష్ట్ర పట్ల కూడా విధేయత లేని ఫడ్నవీస్‌ను ఎక్కడికి పొమ్మనాలి? నేడు విదర్భయే కాకుండా మొత్తం మరఠ్వాడా కరవుకోరల్లో చిక్కుకొని అల్లాడిపోతోంది. రాష్ట్రం మొత్తం మీద 90లక్షల మంది రైతులు కరవుకాటకాలతో ఆర్తనాదాలు చేస్తుంటే, వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మున్సిపాలిటీల పరిధిలోనే తాగునీరు దొరక్క ప్రజలు దాహం... దాహం అంటూ వగరుస్తుంటే, కేవలం పది నెలల కాలంలోనే పౌష్టికాహార లోపం వల్ల 1274 మంది పిల్లలు మృత్యువాత పడితే పట్టకుండా మంత్రాలయం ఏసీ గదిలో కూర్చున్న ఫడ్నవీస్‌కు హఠాత్తుగా 'భారత మాతాకీ జై' అనే నినాదం ఎందుకు గుర్తుకు వచ్చింది? హిందూ ఆలయాల్లో లింగవివక్ష తగదంటూ ముంబై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా అహ్మద్‌నగర్‌లోని శని శింగణాపూర్ ఆలయంలోకి తృప్తి దేశాయ్ నాయకత్వంలోని భూమాతా బ్రిగేడ్‌ను అనుమతించలేక పోయారే, అడ్డుకున్నవారిని అరెస్ట్ చేయాలంటూ సాక్షాత్తు హైకోర్టు ఆదేశాలు జారీచేసినా ఒక్కరంటే ఒక్కరిని అరెస్ట్ చేయడానికి చేతులురాని ఫడ్నవీస్‌కు భారతమాతకు చేయెత్తి జైకొట్టమనే అర్హత ఉందా? రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ముంబై హైకోర్టు నాగపూర్ బెంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినా ఫడ్నవీస్ నీళ్లు నమిలారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. రాష్ట్రంలోని 43 వేల గ్రామాల్లో 27,723 గ్రామాలు తీవ్ర కరవు పరిస్థితులను ఎదొర్కుంటున్నాయి. ఈ గ్రామాల్లో సత్వర నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో రైతురుణాలను మాఫీచేయాలి. తక్షణం ల్యాండ్ రెవెన్యూ వసూళ్లను నిలిపివేయాలి. కరెంటు కోతను ఎత్తివేయాలి. విద్యుత్ బకాయిలు ఉన్నప్పటికీ విద్యుత్‌ను నిలిపివేయరాదు. పిల్లల స్కూల్ ఫీజులను రద్దు చేయాలి. పౌష్టికాహార లోపం వల్ల గత పదినెలల్లోనే నందూర్బర్‌లో 662 మంది పిల్లలు, పాల్ఘర్లో 418 మంది, థానేలో 194 మంది పిల్లలు మరణించినప్పటికీ ఆ మూడు జిల్లాలో ఇప్పటికీ ఎలాంటి సహాయక చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? మున్సిపాలిటీల పరిధిలో దినం తప్పించి దినం మంచినీటి సరఫరాకు సత్వర చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? లాతూర్ సిటీలోనే వారానికి ఒకసారి మంచినీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నీటిని ఆదా చేయడం కోసం చెరకు క్రషింగ్‌ను నియంత్రించాలి. చెరకు క్రషింగ్‌కు రోజుకు 25 లక్షల లీటర్ల నీరు ఖర్చవుతోంది. మంచి పాలనను అందిస్తానని బీజేపీ, ఆరెస్సెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ఫడ్నవీస్ అధికారంలోకి రాగానే హామీ ఇచ్చారు. మంచి పాలనంటే ఇదేనా? సమస్యలను పట్టించుకోకపోవడమా? తమరు చెప్పినట్టే 'భారత మాతాకీ జై' అంటే ఈ సమస్యలు తీరిపోతాయా? అసలు ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకేకదా! ఇలాంటి నినాదాలు తీసుకొచ్చేది? -
అలాంటి వారి తలలు నరికేసే వాణ్ని: రాందేవ్
చండీగఢ్: యోగా గురువు బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'భారత్ మాతకీ జై' అని అనని వారిని తాను తలనరికి చంపేవాడినని, కానీ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని అలా చేయడం లేదని ఆయన అన్నారు. 'భారత్ మాతకీ జై' అనే నినాదం చేయడమంటే మాతృభూమిపై ఆపేక్ష చాటడమేనని, ఇందులో మతపరమైన కోణమేమీ లేదని పేర్కొన్నారు. రాందేవ్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. 'ఆరెస్సెస్ భేటీలో రాందేవ్ మాట్లాడుతూ తలలు నరికేస్తానని హెచ్చరించారు. ఇది హింసకు పిలుపునివ్వడమే. ప్రజలను బెదిరించడమే. ప్రధాని మోదీ రాందేవ్‌పై చర్య తీసుకోవాలి' అంటూ కాంగ్రెస్ నేత సంజయ్ ఝా ట్వీట్ చేశారు. 'భారత్ మాతకీ జై' అనడం ముస్లిం మతానికి విరుద్ధమని, అందుకే తాము ఆ నినాదం చేయబోమని దేశంలోని అతిపెద్ద ఇస్లాం సంస్థ 'దారుల్ ఉలూమ్ డియోబంద్' ఇటీవల ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే. తాము కూడా మాతృదేశాన్ని ప్రేమిస్తున్నామని, తాము అందుకు బదులుగా 'హిందూస్తాన్ జిందాబాద్' అని నినదిస్తామని పేర్కొంది. అదేవిధంగా ముస్లిం నాయకుడైన అసదుద్దీన్ ఒవైసీ కూడా మతపరమైన ఆంక్షల వల్ల తాము ఆ నినాదాన్ని చేయబోమని పేర్కొన్నాడు. మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ 'భారత్ మాతకీ జై' అనని వాళ్లు దేశం విడిచివెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో యోగా గురువు రాందేవ్ మరింత తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఈ అంశంపై చర్చ తీవ్రమైంది. మరోవైపు 'భారత్ మాతకీ జై' అంటేనే దేశభక్తులా అని ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. -
'పాకిస్తాన్ కీ జై, చైనా కీ జై అంటారా?'
ముంబై : 'భారత్ మాతా కీ జై' నినాదం తాలూకూ వివాదం రోజురోజుకూ మరింత ముదురుతుంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఇక్కడ బతకాలని అనుకుంటే 'భారత్ మాతా కీ జై' అని అనాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ నినాదం చేయనివాళ్లకు దేశంలో నివసించే హక్కు లేదని, భారత్ మాతా కీ జై అనకపోతే మరేమంటారు? పాకిస్తాన్ కీ జై, చైనా కీ జై అంటారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఈ విషయంపై మాట్లాడుతూ.. ఒక్కసారి ముంబైలోని మజార్ ప్రాంతానికి వెళ్లి చూడండి. ఎంతమంది ముస్లిం మత పెద్దలు భారత్ మాతా కీ జై నినాదాన్ని పఠిస్తుంటారో తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో మరోసారి దుమారం రేగింది. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ.. ఫడ్నవీస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేశంలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు ఇలాంటి వివాదాస్పద స్టేట్మెంట్లు ఇచ్చేముందు ఆలోచించాలన్నారు. లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని తెలిపారు. మరోవైపు ముస్లింలు 'భారత్ మాతా కీ జై' అంటూ నినదించడంపై ఉత్తర్‌ప్రదేశ్ సహరాన్పూర్ జిల్లాలోని దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ వర్సిటీ శుక్రవారం ఫత్వా జారీచేసిన విషయం తెలిసిందే. అలా నినదించడం విగ్రహారాధన కిందకు వస్తుందని, ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. -
'కన్న తల్లి కన్నా.. మాతృభూమి తక్కువేం కాదు'
రాజ్ కోట్: ముస్లింలు ‘భారత్ మాతా కీ జై’ స్లోగన్‌ను పలుకొద్దంటూ దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ వర్సిటీ శుక్రవారం ఫత్వా జారీ చేయడం పై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. మాతృ భూమి కోసం 'భారత్ మాతా కీ జై' అని నినదించడం ప్రతి ఒక్కరి హక్కని తెలిపారు. ఇది ఎన్నో భావోద్వోగాలతో ముడిపడి ఉన్న అంశం అని పేర్కొన్నారు. కన్న తల్లిలాంటి దేశం కోసం నినదించడం ప్రతి మనిషి హక్కు అని తెలిపారు. కన్న తల్లి కన్నా మాతృభూమి ఏమీ తక్కువ కాదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ముస్లింలు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినదించడంపై దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ వర్సిటీ ఫత్వా జారీచేసిన విషయం తెలిసిందే. అలా నినదించడం విగ్రహారాధన కిందకు వస్తుందని, ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. ఆ నినాదాన్ని ఉచ్చరించబోమని వర్సిటీ పీఆర్ఓ అష్రాం ఉస్మానీ పేర్కొన్నారు. తామంతా దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నామని, ‘హిందుస్తాన్ జిందాబాద్’, ‘మద్రే వతన్’ అంటూ నినదిస్తామన్నారు. మనుషులు మాత్రమే మనుషులకు జన్మనివ్వగలరని, అలాంటప్పుడు దేశాన్ని తల్లిగా పేర్కొంటూ ఎలా నినాదాలిస్తారని ప్రశ్నించారు. భారత్ మాతా కీ జై ఉచ్చారణ మాతృభూమిపై ప్రేమావేశానికి నిదర్శనమని దీన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా నినదించాలని ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. -
‘భారత్ మాతా కీ జై’ అనొద్దు
దారుల్ ఉలూమ్ ఫత్వా సహరాన్పూర్: ముస్లింలు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినదించడంపై ఉత్తర్‌ప్రదేశ్ సహరాన్పూర్ జిల్లాలోని దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ వర్సిటీ శుక్రవారం ఫత్వా జారీచేసింది. అలా నినదించడం విగ్రహారాధన కిందకు వస్తుందని, ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. ఆ నినాదాన్ని ఉచ్చరించబోమని వర్సిటీ పీఆర్ఓ అష్రాం ఉస్మానీ పేర్కొన్నారు. తామంతా దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నామని, ‘హిందుస్తాన్ జిందాబాద్’, ‘మద్రే వతన్’ అంటూ నినదిస్తామన్నారు. మనుషులు మాత్రమే మనుషులకు జన్మనివ్వగలరని, అలాంటప్పుడు దేశాన్ని తల్లిగా పేర్కొంటూ ఎలా నినాదాలిస్తారని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని సమర్థించినట్లే: వీహెచ్‌పీ ఫత్వాని వీహెచ్‌పీ తీవ్రంగా తప్పుపట్టింది. దారుల్ ఉలూమ్ బహిరంగంగా ఉగ్రవాదాన్ని సమర్ధించినట్లేనని అభిప్రాయపడింది. ఉగ్రవాదాన్ని ఏ మతంతోనూ లింకుపెట్టకూడదన్న ప్రధానిమోదీ విధానానికిఈ ఫత్వాతో తక్షణం బదులిచ్చారని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. భారత్ మాతా కీ జై ఉచ్చారణ మాతృభూమిపై ప్రేమావేశానికి నిదర్శనమని, అది ఫ్యాషన్ కాదని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసినప్పుడు ఎందుకు ఫత్వాలు జారీచేయలేదని ఆయన కోల్‌కతాలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
'భారత్ మాతకీ జై' అని మెహబూబా అంటారా?'
ముంబై: బీజేపీతో చేతులు కలిపి జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో కమలనాథులపై ఆ పార్టీ మిత్రపక్షం శివసేన ప్రశ్నల వర్షం కురిపించింది. జమ్ముకశ్మీర్ మొదటి మహిళా సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న మెహబూబా ముఫ్తి 'భారత్ మాతకీ జై' అని ఇప్పుడు నినదిస్తారా? ఉగ్రవాద దాడుల్లో మృతిచెందిన కశ్మీర్ పండిట్స్ గౌరవార్థం ఆమె ఈ నినాదం చేస్తారా? అని శివసేన ప్రశ్నించింది. రెండు నెలల ప్రతిష్టంభనకు తెరదించుతూ జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తి శనివారం గవర్నర్‌ను కలిసి విషయం తెలిసిందే. బీజేపీతో గతంలో పెట్టుకున్న పొత్తును యథాతథంగా కొనసాగిస్తూ.. ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 'బీజేపీకి, మెహబూబాకు మధ్య ఎప్పుడూ సఖ్యత లేదు. ఆమె దేశ వ్యతిరేక వ్యాఖ్యలు, ఉగ్రవాదుల పట్ల ఆమె చూపిన ఆపేక్ష గతంలో వివాదాలు సృష్టించింది. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిపట్ల ఆమె ఉదార వైఖరిని కనబర్చారు' అని శివసేన అధికార పత్రిక 'సామ్నా' తన సంపాదకీయంలో పేర్కొంది. 'ఆమె ముఖ్యమంత్రి పదవి స్వీకరించడంపై బీజేపీ సంతృప్తిగా ఉండవచ్చు, కానీ దేశం ఆందోళన చెందుతున్నది. 'భారత మాతకీ జై' అనడం దేశభక్తికి, జాతీయవాదానికి చిహ్నంగా బీజేపీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పుడు మెహబూబా ఈ నినాదాన్ని చేయగలరా?' అని 'సామ్నా' ప్రశ్నించింది. -
ఆరెస్సెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
కోల్ కతా: ప్రపంచం భారత దేశానికి సెల్యూట్ చేస్తుందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. భారత్‌కు ఆత్మగౌరవం ఎక్కువని, ప్రపంచమంతా 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేయాలని తమ సంస్థ భావిస్తుందని చెప్పారు. ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్స్ సొసైటీ సహ వ్యవస్థాపకుడు, దివంగత మదన్ లాల్ అగర్వాల్ పై రాసిన ఓ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ.. భారత్ ను సంపన్న దేశంగా చేయాలని తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అవిభాజ్య భారత్ నుంచి విడిపోయినప్పుడు దేశం పేరు పాకిస్తాన్ అని పెట్టుకున్నారని ఎందుకంటే... భారత్ అని పేరు పెట్టుకునేందుకు వారిలో ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలు లేవని అభిప్రాయపడ్డారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాజ్యాంగంలో పేర్కొనలేదని, అందుకే భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేయనని ఒవైసీ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ఆరెస్సెస్ లాంటి సంస్థలో ఉన్నందున తాను చాలా అదృష్టవంతుడినని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. -
‘భారత మాత’ ఎలా పుట్టింది?
న్యూఢిల్లీ: ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ ‘భారత్ మాతాకి జై’ అని నినాదం చేయనందుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేసింది. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ భారత్ మాతాకీ జై అంటూ నినాదం చేయాల్సిందిగా పఠాన్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. చివరకు ఈ వివాదం పఠాన్ సస్పెన్షన్‌కు దారితీసింది. ఆయన సస్పెన్షన్‌ను బీజీపీ, ఆరెస్సెస్ పార్టీలతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా సమర్ధించడం ఆశ్చర్యకరం. విశ్వంలో అల్లా ఒక్కడే దేవుడని నమ్మే ముస్లింలు కనకదుర్గకు ప్రతిరూపంగా హిందుత్వ జాతీయవాదులు కొలిచే భారత మాతాకు జై అని నినాదం చేయాలంటే వారి మత విశ్వాసాలను కాదనడమే. పరమత వాదాన్ని దౌర్జన్యంగా రుద్దడమే. ప్రస్తుత సందర్భంలో భారత దేశానికి భారత మాతను ప్రతిరూపంగా చూద్దాం అంటే ఆమె చేతిలో దేశ పటానికి బదులు ఆరెస్సెస్ జెండా ఉంటుంది. అసలు భారత మాత ఎలా పుట్టింది? బ్రిటీష్ పరిపాలనలో భారత దేశం నలిగిపోతున్నప్పుడు 1905లో భారత్ మాత అనే పదం పుట్టుకొచ్చింది. అందుకనే భారత మాత వెనకాల కనిపించే మ్యాప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్ దేశాలు కూడా ఉంటాయి. అదే సంవత్సరంలో బెంగాల్, బంగ్లాదేశ్‌గా, పశ్చిమ బెంగాల్‌గా విడిపోయింది. తొలుత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అదబిందో ఘోష్ భారతమాత అనే పదానికి శ్రీకారం చుట్టారు. అప్పటి గుజరాత్ రాజకీయవేత్త, రచయిత కేఎం మున్షీ అసలు దేశభక్తి ఏమిటని అరబిందో ఘోష్‌ను ప్రశ్నిస్తారు. అప్పుడు ఆయన తన ఇంటిగోడపై వేలాడుతున్న బ్రిటీష్ పాలనలోని భారత మ్యాప్‌ను చూపిస్తూ ‘ఇది భారత మాత చిత్రం. నగరాలు, నదులు, పర్వతాలు ఆమె శరీర భాగాలు, ఈ ప్రాంతంలో నివసించే పిల్లలు, పెద్దలు ఆమె నరాలు. ఆమెను తొమ్మిది విధాలుగా పూజించాలి’ అని చెబుతారు. ఆయన వ్యాఖ్యలు భారత మాతా అవతరణకు నాంది పలికాయి. బెంగాల్ సాహిత్యం నుంచి భారత మాత దేవతా రూపాన్ని సంతరించుకుంది. కాళీ, దుర్గ, చండీలను బెంగాల్ ప్రజలు ఎక్కువ పూజిస్తారు. ఆనంద్ మఠ్ ద్వారా ముందుగా భారత మాతకు ప్రచారం లభించింది. తర్వాత బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘వందేమాతరం’ గీతాన్ని భారత మాతకు ఆపాదించడం వల్ల మరింత ప్రచారం లభించింది. వాస్తవానికి ఆయన దుర్గాదేవిని ఉద్దేశించి వందేమాతరం గీతాన్ని రాశారు. ఓ సందర్భంలో ఈ గీతాన్ని జాతీయ గీతంగా అంగీకరించాలనే చర్చ వచ్చినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యతిరేకించారు. ఠాగూర్ మేనల్లుడు, తొలి భారత ఆధునిక పెయింటర్‌గా గుర్తింపు పొందిన రవీంద్రనాథ్ భారత మాతకు చిత్ర రూపం ఇచ్చారు. ఆయన కూడా భారత మాతను దుర్గాదేవి రూపానికి దగ్గరగా ఉండేలా చిత్రించారు. అప్పుడు స్వాతంత్య్ర పోరాటంలో ఈ చిత్రాలను విరివిగా ఉపయోగించారు. రానురాను ఈ చిత్రం భారతమాతకు పది చేతులున్నట్లు, సింహంపై స్వారీ చేస్తున్నట్లు రూపాంతరం చెందింది. చివరకు ఆమె చేతులోకి ఆరెస్సెస్ జెండా కూడా వచ్చి చేరింది. భారత మాతకు వారణాసిలో, మహారాష్ట్రలోని దౌలతాబాద్‌లో, హరిద్వార్‌లో ఆలయాలు వెలశాయి. ఇంత చరిత్ర కలిగిన భారత మాతకు ‘జై’ కొడితే దేశానికి జై కొట్టినట్లా? హిందుత్వ జాతీయవాదుల దేవతకు జై కొట్టినట్లా? మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండైన వారిస్ పఠాన్ మాత్రం తాను ‘ఐ లవ్ మై కంట్రీ’ అని, ‘జై హింద్’ అనమంటే అంటానని చెబుతున్నారు. -
అలాంటి వారికి పౌరసత్వం రద్దు చేయాలి
ముంబై: 'భారత్ మాతాకి జై' అనను అని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. చట్టపరంగా ఆయనను తలదించుకునేలా చేయాలని శివసేన 'సామ్నా'లో రాసిన సంపాదకీయంలో పేర్కొంది. 'భారతమాతను ఒవైసీ అవమానించారు. ఆయనకు వ్యతిరేకంగా దేశంలోని ముస్లింలందరూ భారత్ మాతాకి జై అంటూ నినదించాలి. ఈ నినాదం చేయడానికి నిరాకరించేవారి పౌరసత్వం, ఓటు హక్కు రద్దు చేయాలి' అని శివసేన పేర్కొంది. వివాదాలకు కారణమైన ఒవైసీ స్వేచ్ఛగా మహారాష్ట్రలో తిరుగుతున్నా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. 'సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యేలపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. ఇదే సమయంలో రాజద్రోహం వ్యాఖ్యలు చేసిన వారు(ఒవైసీ) స్వేచ్ఛగా తిరుగుతున్నార'ని శివసేన ధ్వజమెత్తింది. -
మహారాష్ట్ర అసెంబ్లీలో మజ్లిస్ ఎమ్మెల్యే సస్పెన్షన్
‘భారత్ మాతాకీ జై’ అనేందుకు నిరాకరించిన మజ్లిస్ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం సస్పెండ్ చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీలకు అతీతంగా ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ముంబై: ‘భారత్ మాతాకీ జై’ అనేందుకు నిరాకరించిన ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం సస్పెండ్ చేసింది. పార్టీలకతీతంగా అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. సౌత్ ముంబైలోని బైకుల్లా స్థానం నుంచి గెలిచిన పఠాన్‌పై సస్పెన్షన్ వేటు ప్రస్తుత బడ్జెట్ సెషన్స్ అయ్యే వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ‘‘జాతీయ నాయకులను అగౌరవ పరచడంతో పాటు ‘భారత్ మాతాకీ జై’ అనేందుకు పఠాన్ నిరాకరించారు’’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గిరీష్ బపత్ చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ఔరంగాబాద్‌కు చెందిన ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యలతో ఈ రగడ మొదలైంది. ‘‘ప్రజలు కట్టే పన్నుల సొమ్మును ‘గొప్ప వ్యక్తుల’ స్మారక చిహ్నాలు కట్టడానికి వెచ్చించడం ప్రభుత్వానికి తగదు’’ అని జలీల్ వ్యాఖ్యానించారు. దీనిపై ఓ శివసేన ఎమ్మెల్యే స్పందిస్తూ... ‘జలీల్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ భారత్ మాతాకీ జై అనేది లేదని ఇటీవల వ్యాఖ్యానించారు’ అని గుర్తు చేశారు. పఠాన్ కలుగజేసుకుని... ‘‘మేం ‘జైహింద్’ అంటాం కానీ ‘భారత్ మాతాకీ జై’ అనం. కచ్చితంగా ఈ నినాదం చెప్పాలని చట్టంలో ఎక్కడా లేదు’’ అన్నారు. దీంతో కోపోద్రిక్తులైన అధికార బీజేపీ, శివసేనతో పాటు కాంగ్రెస్, ఎన్సీపీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పఠాన్‌ను సస్పెండ్ చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో హోంమంత్రి రంజిత్ పాటిల్ పఠాన్ సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘వాక్స్వాతంత్య్రాన్ని పఠాన్ దుర్వినియోగపరిచారు. సభ సంప్రదాయాన్ని మంటగలిపారు’ అని పాటిల్ చెప్పారు. మజ్లిస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆ పార్టీ చీఫ్ ఎంపీ అసదుద్దీన ఒవైసీ అన్నారు. అసదుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్ఎస్ జమ్మూ: ‘భారత్ మాతాకీ జై’ అనే నినాదం తాను చేయనన్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. భారత్‌ను తమ మాతృభూమిగా భావించనివారు దేశం వదిలి వెళ్లిపోవాలని సూచించింది. ‘ఒవైసీ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మాతృభూమికి గౌరవం ఇవ్వనివారు దేశం వదిలి తమకు నచ్చిన చోటుకి వెళ్లవచ్చు. ఇలాంటి వారు పార్లమెంట్‌కు ఎన్నికవడం దురదృష్టకరం. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని ఆర్ఎస్ఎస్ జమ్మూ కశ్మీర్ ప్రాంత్ సంగ్ చాలక్ బ్రిగ్ సుచెట్ సింగ్ అన్నారు. ‘తన మెడపై కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అని అనను’ అంటూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఆయనిలా స్పందించారు. -
'అలా అని కలలో కూడా అనుకోను'
ముంబై: దేశం పట్ల తనకు అపారమైన ప్రేమ ఉందని మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ అన్నారు. తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. ఎవరి దేశభక్తినైనా ఒక్క నినాదంతోనే ఎలా అంచనా వేస్తారని ఆయన ప్రశ్నించారు. జై హింద్, జై భారత్, జై మహారాష్ట్ర అంటేనే ప్రేమ ఉన్నట్టా అని అడిగారు. తాను ఇక్కడే పుట్టానని, తుదిశ్వాస వరకు ఇండియాలోనే ఉంటానని స్పష్టం చేశారు. మాతృదేశాన్ని అవమానించాలని కలలో కూడా అనుకోనని పేర్కొన్నారు. అసెంబ్లీలో 'భారత్ మాతాకి జై' అని నినదించేందుకు పఠాన్ నిరాకరించడంతో ఆయనను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్ పూర్తయ్యేవరకు సస్పెన్షన్ విధించారు. -
'మహా' అసెంబ్లీని కుదిపేసిన అసద్ కామెంట్స్
ముంబై/హైదరాబాద్: 'గొంతుపై కత్తి పెట్టినా భారత్ మాతాకి జై అనను' అని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర శాసనసభ బుధవారం అట్టుడికింది. అసద్ వ్యాఖ్యలను ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ సమర్ధించారు. సభలో 'భారత్ మాతాకి జై' అని నినదించేందుకు పఠాన్ నిరాకరించడంతో ఆయనను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్ పూర్తయ్యేవరకు సస్పెన్షన్ విధించారు. మరోవైపు అసదుద్దీన్ ఒవైసీపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. హైదరాబాద్ మల్కాజ్ గిరి కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన కోర్టు 153 ఏ కింద కేసు నమోదు చేయాలని నెరేడ్ మెట్ పోలీసులను ఆదేశించింది. అసదుద్దీన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అలహాబాద్ హైకోర్టులోనూ మంగళవారం పిల్ దాఖలైంది. -
''భారత్ మాతాకీ జై' బలవంతంగా అనిపించొద్దు'
న్యూఢిల్లీ: 'భారత మాతా కి జై' అనే నినాద వివాదంలో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా తలదూర్చారు. ఆ నినాదం ఇవ్వడమనేది వారి వ్యక్తిగత విషయం అని, ఏ ఒక్కరూ ఆ నినాదం చేయాలని బలవంతపెట్టకూడదని అన్నారు. 'మన జాతీయ జెండా ఎగురుతున్నప్పుడు దాన్ని చూస్తూ జాతీయ గీతం ఆలపిస్తుంటే.. వందేమాతరం పాడుతుంటే గర్వంగా అనిపిస్తుంటుంది. కానీ కొంతమంది అలా చేయబోమని అంటారు. అది వారి ఇష్టం' అని విశ్వవిద్యాలయాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే అంశంపై ప్రసంగిస్తూ అన్నారు. తన మెడపై కత్తి పెట్టి బెదిరించినా సరే తాను మాత్రం భారత్ మాతాకి జై అనే మాటలు అనబోనని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే ఖుర్షీద్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
గొంతుపై కత్తిపెట్టినా ఆ నినాదం చేయను: ఒవైసీ
'భారత్ మాతాకీ జై' అనే నినాదాన్ని తాను చేయబోనని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యువతరానికి 'భారత్ మాతాకీ జై' అనే నినాదాన్ని బోధించాలన్న ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యలపై అసద్ ఈమేరకు స్పందించారు. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని ఉద్గిర్లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ 'ఆ నినాదాన్ని నేను చేయను. మీరు ఏం చేస్తారు? భగవత్ సాబ్' అని పేర్కొన్నారు. 'నా గొంతుపై కత్తిపెట్టినా ఆ నినాదాన్ని చేయను. 'భారత్ మాతాకీ జై' అని ప్రతి ఒక్కరూ కచ్చితంగా నినదించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు' అని ఒవైసీ తెలిపారు. జెఎన్యూలో జాతి వ్యతిరేక నినాదాల వివాదం నేపథ్యంలో దేశభక్తి పెంపొందించేలా యువతరానికి 'భారత్ మాతాకీ జై' అనే నినాదాన్ని బోధించాలని ఈ నెల 3న మోహన్ భగవత్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. WATCH: Asaduddin Owaisi to RSS chief Mohan Bhagwat- Won't say "Bharat Mata Ki Jai" in Latur (Maharashtra) (March 13)https://t.co/nRNtaBfi6z — ANI (@ANI_news) March 14, 2016