దేశంలో ఉండేందుకు వారు మాత్రమే అర్హులు.. | Who Are Say Bharat Mata Ki Jai They Only Live In India Says Darmendra Pradhan | Sakshi
Sakshi News home page

దేశంలో ఉండేందుకు వారు మాత్రమే అర్హులు: కేంద్రమంత్రి

Published Sun, Dec 29 2019 4:39 PM | Last Updated on Sun, Dec 29 2019 4:40 PM

Who Are Say Bharat Mata Ki Jai They Only Live In India Says Darmendra Pradhan - Sakshi

సాక్షి, ముంబై : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు. ‘భారత్‌ మాతాకీ జై’ అనే వారే ఈ దేశంలో నివసించడానికి అర్హులని అన్నారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారంతా ఇక్కడ ఉండటానికి భారత్‌ ధర్మసత్రం కాదని వ్యాఖ్యానించారు. చట్టాలను గౌరవించలేని వారు ఇక్కడ ఉండేదుకు అనర్హులని పేర్కొన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ఏబీవీపీ మహాసభల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని ఆయన తప్పుపట్టారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పౌరులుకు శాశ్వత గుర్తింపు కార్డులు జారీ చేయకుండా ప్రపంచంలో ఏ దేశమూ లేదని ఆయన గుర్తుచేశారు. దేశ భద్రత కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంపై వివక్షాలు నిరసల చేయాల్సి అవసరం ఏముందని  ఆయన ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement