darmendra pradan
-
లోక్‌సభలో ధర్మేంద్ర ప్రదాన్‌కు ‘నీట్’ సెగ
న్యూఢిల్లీ: లోక్‌సభలో కొత్త ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా మోదీ 3.0 ప్రభుత్వానికి నీట్ పరీక్ష అక్రమాల సెగ తగిలింది. సోమవారం(జూన్24) లోక్‌సభలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు సీట్లో నుంచి వెళుతుండగా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై నిరసన తెలిపారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో సభను హోరెత్తించారు. ఇవేవీ పట్టించుకోకుండా ప్రదాన్ ఆయన ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష పేపర్ లీక్‌తో పాటు మార్కులు ఇష్టం వచ్చినట్లుగా వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. నీట్ అక్రమాలపై దేశవ్యాప్త నిరసనలు జరగడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. -
నీట్ వివాదం.. ధర్మేంద్ర ప్రదాన్ కీలక కామెంట్స్
భువనేశ్వర్: ‘నీట్’పేపర్ లీక్ వ్యవహారంలో ఒకవేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులది తప్పని తేలితే వదిలేది లేదని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పష్టం చేశారు. ఆదివారం(జూన్16) ఒడిశాలోని సంబల్పూర్లో ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పేపర్‌లీక్‌కు సంబంధించి రెండు చోట్ల అక్రమాలు వెలుగుచూశాయి. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని పేరెంట్స్, తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నా. ఇందులో ఎంత పెద్దస్థాయి అధికారులున్నప్పటికీ వదిలేది లేదు. ఎన్టీఏలో చాలా మార్పులు చేయాల్సి ఉంది. బిహార్ ఆర్థిక నేరాల విభాగం తొమ్మిది మంది నీట్ అభ్యర్థులకు పేపర్‌లీక్ కేసులో నోటీసులిచ్చింది. వారిని విచారణకోసం పిలిచాం’అని ప్రదాన్ తెలిపారు. -
సొంత గనులు లేకనే స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు
ఢిల్లీ: సొంత ఇనుప ఖనిజం గనులు లేకపోవడం విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణాలలో ఒకటని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా జవాబిస్తూ.. సొంత ఇనుప ఖనిజం గనులు లేనందున విశాఖ స్టీల్ ప్లాంట్ మార్కెట్ ధరలకు బహిరంగ మార్కెట్లో ఇనుప ఖనిజం కొనుగోలు చేయవలసి వస్తోందని, స్టీల్ ప్లాంట్‌కు వాటిల్లితున్న నష్టాలకు కారణాలలో ఇది ఒకటని తెలిపారు. ఇనుప ఖనిజం గనులను రిజర్వ్ చేయవలసిందిగా కేంద్రంలోని గనుల మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయవలసిందిగా విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఒడిషా, చత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇనుప ఖనిజం గనిని రిజర్వ్ చేయవలసిందిగా గనుల మంత్రిత్వ శాఖ ఒడిషా ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. గడచిన అయిదేళ్ళ కాలంలో పర్బత్పూర్, సితనాలాలోని బొగ్గు, ఇనుప ఖనిజం గనులను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)కు కేటాయించడం జరిగింది.అయితే ఈ గనులను సెయిల్ తిరిగి స్వాధీనం చేయడంతో ఆ కేటాయింపులను రద్దు చేయడం జరిగినట్లు ఆయన తెలిపారు. అయితే ఒడిషాలోని థాకురాని బ్లాక్ ఏ, రమణదుర్గ ఫారెస్ట్ రేంజ్‌లోని బ్లాక్ 31లోని ఇనుప ఖనిజం గనులను 2004, 20019లో సెయిల్ పేరిట రిజర్వ్ చేసినందున ఒడిషా ప్రభుత్వం మూడేళ్ళ పాటు ఆయా బ్లాకుల్లో ఇనుప ఖనిజం తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. బొగ్గు మంత్రిత్వ శాఖ 2020 మార్చిలో జార్ఘండ్‌లోని రబోధి కోల్ గనిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు సూత్రప్రాయంగా కేటాయించిందని మంత్రి తెలిపారు. చదవండి: స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఎంతదూరమైనా వెళ్తాం ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు ఉద్యమానికి మద్దతు -
చిత్రపరిశ్రమలో మరో విషాదం, సీనియర్ నటుడు మృతి
భువనేశ్వర్: 2020 చిత్ర సీమకు అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి. ఏడాది మొదలు నుంచి సినీ పరిశ్రమలో ఏదో మూల ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఒడియా సీనియర్ నటుడు బిజయ్ మొహంతి(70) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంత కాలంగా మొహంతి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో ఆయన సోమవారం సాయంత్రం స్వర్గస్థులయ్యారు. మొహంతి మృతి పట్ల ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పలువురు ఒడియాకు చెందిన పలువురు సినీ కళాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో మొహంతి వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనియాడారు. మొహంతి మరణంతో ఒడియా చిత్ర సీమలో ఒక శకం ముగిసిందన్నారు.ఆయన మరణం చిత్రసీమలో తరగని అంతరాన్ని కలిగించిందన్నారు. ఆయన అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. చదవండి: సీనియర్ నటుడిని పొట్టనపెట్టుకున్న కరోనా CM @Naveen_Odisha has expressed deep grief over the passing away of renowned film actor & director #BijayMohanty. CM said, his death marks the end of an era and has created a deep void in Odia film industry. CM announced that the veteran actor will be cremated with state honours. — CMO Odisha (@CMO_Odisha) July 20, 2020 ఇక ఒడిశాకే చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, బిజయ్ మొహంతిని కోల్పోయినందుకు ఎంతో బాధగా ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో శ్రీ జగన్నాథ స్వామి ఆయన కుటుంబానికి శాంతిని, సహనాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ధర్మేంద్రప్రధాన్ ఒడిస్సీలో ట్వీట్ చేశారు. మొహంతి ఆయన భార్య తాండ్రా రే, కుమార్తె జాస్మిన్‌తో కలిసి నివసిస్తున్నారు. మొహంతి భార్య తాండ్రా కూడా ఒడియాలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆయన దండా బలూంగా, నగా ఫాసా, సమయ్ బడా బాలాబన్ వంటి పలు చిత్రాల నటించి చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ଖ୍ୟାତିସମ୍ପନ୍ନ ଅଭିନେତା ବିଜୟ ମହାନ୍ତିଙ୍କ ବିୟୋଗରେ ମୁଁ ଗଭୀର ଭାବରେ ମର୍ମାହତ । ତାଙ୍କ ମୃତ୍ୟୁରେ ଓଡ଼ିଶା ସିନେ ଜଗତରେ ଏକ ଯୁଗର ଅନ୍ତ ଘଟିଲା । ପିଢି ପରେ ପିଢି ତାଙ୍କର ପ୍ରଶଂସକଙ୍କୁ ସେ କଳାର ଯାଦୁରେ ବାନ୍ଧି ରଖି ପାରିଥିଲେ । — Dharmendra Pradhan (@dpradhanbjp) July 20, 2020 చదవండి: హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు -
దేశంలో ఉండేందుకు వారు మాత్రమే అర్హులు..
సాక్షి, ముంబై : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు. ‘భారత్ మాతాకీ జై’ అనే వారే ఈ దేశంలో నివసించడానికి అర్హులని అన్నారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారంతా ఇక్కడ ఉండటానికి భారత్ ధర్మసత్రం కాదని వ్యాఖ్యానించారు. చట్టాలను గౌరవించలేని వారు ఇక్కడ ఉండేదుకు అనర్హులని పేర్కొన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ఏబీవీపీ మహాసభల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని ఆయన తప్పుపట్టారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పౌరులుకు శాశ్వత గుర్తింపు కార్డులు జారీ చేయకుండా ప్రపంచంలో ఏ దేశమూ లేదని ఆయన గుర్తుచేశారు. దేశ భద్రత కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంపై వివక్షాలు నిరసల చేయాల్సి అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. -
'కాకినాడను హెడ్ క్వార్టర్‌గా కొనసాగించాలి'
సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ బుధవారం కేంద్ర ఉక్కు, పెట్రోలియం - సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను అధికారికంగా కలిశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓఎన్జీసీ కార్యకలాపాలపై ఆమె ఈ సందర్భంగా కేంద్రమంత్రితో చర్చించారు. ధర్మేంద్ర ప్రధాన్ కాకినాడ పార్లమెంట్ నియోజక వర్గాన్ని సందర్శించి.. అభివృద్ధికి కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ ప్రజల తరఫున ఎంపీ గీతా కోరారు. జిల్లాలో కాకినాడ కేంద్రంగా కేజీ బేసిన్ ఆపరేషన్ కార్యకలాపాలు, ఓఎన్జీసీ ఈస్ట్రన్ ఆఫ్‌షోర్ అసెట్స్, కైర్న్ ఎనర్జీ లిమిటెడ్, రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీల కార్యకలాపాలు కాకినాడ ప్రధాన కార్యాలయంగా (హెడ్ క్వార్టర్) జరుగుతున్నాయని ప్రధాన్‌కు...వంగా గీతా వివరించారు. అయితే కాకినాడ హెడ్ క్వార్టర్‌ను మార్చి వేరే చోటుకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయంపై ఆమె... పెట్రోలియం మంత్రితో చర్చలు జరిపారు. మొత్తం కార్యకలాపాలు కాకినాడ కేంద్రంగా కొనసాగించాలని, కాకినాడను హెడ్ క్వార్టర్‌గా గుర్తించాలని కేంద్రమంత్రికి విన్నవించారు. అయితే కాకినాడనే హెడ్ క్వార్టర్‌గా గుర్తిస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. త్వరలోనే మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తానని ఆయన తెలిపారు. -
ఉక్కు ఉత్పత్తి నాణ్యత పెరగాలి: ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: దేశీ ఉక్కు కంపెనీల ఉత్పత్తిలో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దేశీ ఉక్కు పోటీనిచ్చే విధంగా క్వాలిటీ పెరగాలని కోరారు. భారత స్టీల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండే స్థాయిలో ఎదగాల్సిన అవసరం ఉందని ఈ రంగంలోని కంపెనీల సీఈఓల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. సామర్థ్యం పెంపు, సాంకేతిక పరిజ్ఞానం మెరుగుదల, నాణ్యత పరంగా పరిశ్రమ చాలా పురోగతి సాధించిందని అన్నారు. -
మరోసారి ప్రధానిగా మోదీనే కావాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలు అవినీతికి, అభివృద్ధికి మధ్యేనని..రెండోసారి ప్రధానిగా మోదీనే గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేవైఎం నేతలకు జాతీయ నేతలు పిలుపునిచ్చారు. దేశాన్ని అగ్రపథాన నిలిపే సత్తా ఒక్క మోదీకే ఉందని, అందుకే ఆయన సారథ్యాన్ని మరోసారి తీసుకురావాల్సిన బాధ్యత యువమోర్చాదేనన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్ ఆధ్వర్యంలో విజయ లక్ష్య–2019 యువ మహాధివేçశన్ సభ ఘనంగా జరిగింది. ఈ సభకు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, ఎంపీ అనురాగ్ ఠాకూర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లతో పాటు దేశవ్యాప్తంగా బీజేవైఎం కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..వ్యక్తుల కోసం కాకుండా సిద్ధాంతాల కోసం నడిచే పార్టీ ఒక్క బీజేపీనే అన్నారు. జనసంఘ్ ఆవిర్భావం నుంచి జనతా పార్టీ ఏర్పడిన విధానాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పటి ప్రధాని ఇందిరా పాలనలో ఎమర్జెన్సీ విధింపు, జయప్రకాశ్ నారాయణ, వాజ్‌పేయి, అద్వానీ, మొరార్జీ దేశాయ్ వంటి నాయకులు ఇందిరను నిలువరించిన తీరును స్మరించుకున్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కన్నా 6 ఏళ్లు పాలించిన వాజ్‌పేయి పాలనలో విప్లవాత్మక అభివృద్ధి జరిగిందన్నారు. ఇపుడు మోదీ నాలుగున్నరేళ్ల పాలనలో దేశం అన్నిరంగాల్లో దూసుకుపోతోందన్నారు. రోడ్లు, పోర్టులు, రైలు మార్గాలు, మౌలికసదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, సైన్స్ ఆవిష్కరణలు, సమీకృత అభివృద్ధి లక్ష్యంగా రాత్రి, పగలు తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మోదీ పాలనకు బ్రహ్మరథం: ఫడ్నవిస్ నాలుగున్నరేళ్ల మోదీ పాలనకు దేశం బ్రహ్మర థం పడుతోందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్న విస్ పేర్కొన్నారు. అబ్దుల్ కలామ్ కలగన్న 2020 నాటికి భారత్ అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందన్నారు. కశ్మీర్ ను పూర్తిగా భారత్‌లో కలపకుండా సగం పాకిస్తాన్‌కు ఇచ్చిన కాంగ్రెస్ నిత్యం అక్కడ అశాంతికి కారణమైం దన్నారు. మోదీని మరోసారి ప్రధానిని చేయాలని ఆయన చేస్తోన్న పనులను యువతకు వివరించాల్సిన ఆవశ్యకత బీజేవైఎందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆరోపణలు సిగ్గుచేటు: జేపీ నడ్డా మోదీని ప్రపంచదేశాలు ప్రపంచనేతగా గుర్తిస్తున్నాయని అలాంటి నేతపై కాంగ్రెస్ ఆరోపణలు చేయడం సిగ్గు చేటని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. మోదీని విమర్శించిన ప్రతీ సారి కాంగ్రెస్ ఓటుశాతం పడిపోతుందన్న విషయం ఆ పార్టీ గుర్తించలేదన్నారు. 2014కు ముందు దేశరాజకీయా ల్లో పూర్తి నైరాశ్యం ఆవరించిందని, అలాంటి పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిన మోదీ దేశాభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. మోదీ వల్లే పెట్రోలు ధరలు తగ్గాయి: ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం దేశంలో పెట్రోఉత్పత్తుల ధరలపై చర్చ నడుస్తోందని, వాస్తవానికి ఈ ధరల పెరుగుదల ప్రపంచ మార్కెట్లపై ఆధారపడి ఉంటుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మోదీ అంతర్జాతీయ సంబంధాల కారణంగానే తొమ్మిది రోజులనుంచి ధరలు దిగివస్తున్నాయని వెల్లడించారు. దేశంలో సోలార్, బయో ఇంధన వనరులను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సోషల్‌మీడియా బాధ్యతలు మీవే: అనురాగ్ ఠాకూర్ గత ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో సోషల్ మీడియా కీలకపాత్ర పోషించిందని, ఈ సారి కూడా ఆ బాధ్యతలు బీజేవైఎం నేతలవేనని ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి అనేక విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని, పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేవైఎందేనని చెప్పారు. -
పేద మహిళలకు కానుక ‘ఉజ్వల’
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: పొగ రహిత దేశాన్ని చూడాలన్నదే ప్రధాన మంత్రి మోదీ లక్ష్యమని, ఇందుకోసం పేద మహిళలు వంటగదిలో ఇబ్బందులు పడకుండా వారికి కానుకగా ఉజ్వల యోజనను ప్రవేశపెట్టారని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. శనివారం సూర్యాపేటలో ఆయన ఉజ్వల యోజనను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. అలాగే దళితులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఎస్వీ కాలేజి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంబేడ్కర్ జయంతి రోజు రాష్ట్రంలో ఉజ్వల పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పథకం కింద ఒక్క రూపాయి కూడా కట్టనవస రం లేకుండా పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందిస్తామన్నారు. రాష్ట్రంలోని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కోమురం భీం జిల్లాల్లో ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉన్నారని, ఈ జిల్లాల్లో 40 శాతం కటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు లేవని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు లేవని, వీరందరికీ ఈ పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ నెల 20న దేశ వ్యాప్తంగా 15 వేల పైచి లుకు గ్రామాల్లో ఉజ్వల మేళా నిర్వహిస్తున్నామని, గ్యాస్ కనెక్షన్ కోసం పేదలు ఈ మేళాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఉజ్వల్ పథకంతో రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు పెరుగుతుండటంతో పంపిణీకి సమస్య లేకుండా డిస్ట్రిబ్యూటర్లను కూడా పెంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 73 పొగ రహిత గ్రామాలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ వచ్చే నెల 5వ తేదీ నాటికి రాష్ట్రంలో 73 గ్రామాలను పొగ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దనున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయిస్తామని, నిరుద్యోగ భృతి కింద యువతకు ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇస్తామని చెప్పారు. అనంతరం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లబ్ధిదారులకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ సభలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చింతా సాంబమూర్తి, నేతలు ప్రేమేందర్‌రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్రావు, జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పెట్రోల్ మార్కెట్లో ప్రైవేట్ హవా
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ మార్కెట్లో ఎస్సార్ ఆయిల్, రిలయన్స్ వంటి ప్రైవేట్ సంస్థలు గణనీయంగా వాటా పెంచుకుంటున్నాయి. గత మూడేళ్లలో ఇవి తమ వాటాను రెట్టింపు చేసుకున్నాయి. పెట్రోల్ అమ్మకాల్లో 7%, డీజిల్ విక్రయాల్లో 8% వాటాకు చేరుకున్నాయి. చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో ఈ విషయాలు తెలిపారు. 2002 మార్చి నుంచి ప్రైవేట్ కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్‌ను విక్రయించేందుకు అనుమతులు ఇచ్చినట్లు, ఆ తర్వాత ఇంధనం ధరలపై నియంత్రణలను కూడా తొలగించినట్లు ఆయన వివరించారు. దీంతో ఇండియన్ ఆయిల్ వంటి ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థలకు పోటీగా రిలయన్స్, ఎస్సార్, షెల్ మొదలైనవి కూడా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేశాయి. 2004–05లో ధరలపై ప్రభుత్వ నియంత్రణ మళ్లీ తిరిగి రావడంతో పోటీపడలేక వెనక్కి తగ్గాయి. ఇక 2010 జూన్‌లో పెట్రోల్ ధరలపైనా, 2014 అక్టోబర్ నుంచి డీజిల్‌పైనా నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ పరిణామాలన్నింటి దరిమిలా 2015–16లో పెట్రోల్ అమ్మకాల్లో 3.5 శాతం, డీజిల్ అమ్మకాల్లో 3.1 శాతం ప్రైవేట్ కంపెనీల వాటా ఉండేదని ప్రధాన్ వివరించారు. 2017–18లో పెట్రోల్ అమ్మకాల్లో 6.8%కి, డీజిల్ అమ్మకాల్లో 8.2%కి ప్రైవేట్ సంస్థల వాటా చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 61,678 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో ఐవోసీవి 26,752, హెచ్పీసీఎల్వి 14,853, బీపీసీఎల్వి 14,293 ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగంలో ఎస్సార్కి 4,275 పెట్రోల్ బంకులు, రిలయన్స్‌కి 1,400, షెల్కి 100 బంకులు ఉన్నాయి. -
అధికార పార్టీది పగటి కల
భువనేశ్వర్(ఒడిశా): పశ్చిమ ఒడిశాలోని బర్గడ్ జిల్లా బిజేపూర్ అసెంబ్లీ నియోజకవర్గం వైపు అందరి దృష్టి మళ్లింది. ఈ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం తథ్యమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ప్రకటించారు. బీజేడీ దీర్ఘపాలనతో బిజేపూర్ నియోజకవర్గానికి జరిగిన నష్టం, వెనుకబాటు దృష్ట్యా సానుభూతి ముసుగులో బిజూ జనతా దళ్‌కు ఓట్లు పడి విజయం సాధిస్తారనేది పగటి కల అని మంత్రి ధర్మేంద్ర వ్యాఖ్యానించారు. బిజేపూర్ ఓటర్లు సానుభూతిపట్ల మక్కువ కనబరచరు. దీర్ఘకాలంగా ఈ నియోజకవర్గం ఎటువంటి పురోగతికీ నోచుకోలేదు. రాష్ట్రంలో బిజూ జనతా దళ్ సర్కారు దీర్ఘపాలనపట్ల బిజేపూర్ ఓటర్ల వైఖరి భిన్నంగా ఉంది. ఇక్కడి ఓటర్లు సానుభూతి వలలో చిక్కుకోకుండా విచక్షణతో మార్పు కోసం ఓటు వేయడం తథ్యం. గత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి ప్రభంజనం కనిపిం చింది. ఇదే పంథాలో బిజేపూర్‌లో కూడా ఊహాతీతమైన పరిణామాలు తలెత్తి భారతీయ జనతా పార్టీకి అనుకూలిస్తాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గట్టి ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే అభ్యర్థి ప్రకటన దివంగత నాయకుడు సుబొలొ సాహు అకాల మరణంతో రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో భారీ లోటు ఏర్పడింది. ఈ లోటు భర్తీపట్ల బిజేపూర్ నియోజకవర్గం ఓటర్లు ఆచి తూచి ఓటు వేస్తారు. అందుకు అన్ని విధాలా అనుకూలమై న వ్యూహంతో తమ పార్టీ ప్రజల ముందు ప్రత్యక్షమవుతుంది. ప్రజల మనోగతాలకు అనుకూలమైన అభ్యర్థిని బరిలోకి దింపి విజయం సాధి స్తుం దని చెప్పారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి కార్యకర్తలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలో పార్టీ తరఫు అభ్యర్థిని ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. పం చాయతీ ఎన్నికల్లో విజయం స్ఫూర్తితో బిజేపూర్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ శిబిరం నుంచి ఊహాగానాలు విస్తృతంగా ప్రసారంలో ఉన్నాయి. ఆన్లైన్లో పెట్రోల్, డీజిల్ భువనేశ్వర్: సాంకేతిక సమాచారం, టెలికాం రంగాల అభివృద్ధి నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పంపిణీ వ్యవస్థ సంస్కరణకు ఆ విభాగం యోచిస్తోంది. అతి త్వరలో పెట్రోల్, డీజిల్‌ను ఆన్లైన్లో పంపిణీ చేయనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ట్విటర్ ఖాతాలో ప్రసారం చేశారు. దైనందిన జీవితంలో డిజిటలైజేషన్‌కు తమ ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తుందని కేంద్ర సాంకేతిక సమాచార శాఖ తరచూ ప్రసారం చేస్తోంది. ఈ నేపథ్యంలో పెట్రోలియం శాఖ ఆన్లైన్ పంపిణీ యోచన త్వరలో కార్యాచరణకు నోచుకుంటుందనే నమ్మకం వినియోగదారుల్లో కలుగుతోంది. క్లిక్ చేస్తే ఇంటికే పెట్రోల్ పెట్రోల్ బంకు వరకు వెళ్లి బారులు తీరి వేచి ఉండాల్సిన పరిస్థితులకు త్వరలో తెరపడనుంది. క్లిక్ చేస్తే ఇంటి ముంగిట పెట్రోల్, డీజిల్ ప్రత్యక్షమవుతాయనే ఉత్సాహం వినియోగదారుల్లో ఉరకలేస్తోంది. దేశంలో గత ఏడాది నవంబర్‌లో పెద్ద నోట్లు రూ.500, రూ.1,000 రద్దును పురస్కరించుకుని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఆన్లైన్లో పెట్రో ఉత్పాదనల పంపిణీని ప్రతిపాదించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు పెట్రో ఉత్పాదనల్ని ఆన్లైన్లో పంపిణీ చేసేందుకు యోచిస్తున్నట్లు ఆ విభాగం ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన పార్లమెంట్ సలహా మండలి సమావేశంలో పేర్కొంది. Using the technological advancements in the IT & Telecom Sector we will soon be starting online home delivery of Diesel & Petrol. — Dharmendra Pradhan (@dpradhanbjp) September 27, 2017 -
'పేదలకు గ్యాస్ కనెక్షన్లు అధికంగా ఇవ్వాలి'
న్యూఢిల్లీ: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బృందం గురువారం ఢిల్లీలో పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కలిసింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి, పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని ధర్రేంద్రకు వైఎస్ జగన్ వివరించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు గ్యాస్ కనెక్షన్లు అధికంగా ఇవ్వాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ వెంట పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. అంతకముందు వైఎస్ జగన్ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) నదీమ్ జైదీని కలిశారు. ఏపీలో ఫిరాయింపుల వ్యవహారాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అధికార టీడీపీ సాగిస్తున్న అనైతిక రాజకీయాలు, ప్రలోభాలతో ఎమ్మెల్యేలను లోబర్చుకుంటున్న తీరును వివరించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలో 'సేవ్ డెమొక్రసీ' ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీ నాయకులతో పాటు వైఎస్ జగన్ ఢిల్లీలో పలువురు జాతీయ పార్టీల నేతలను, కేంద్ర మంత్రులను కలిశారు.