
న్యూఢిల్లీ: దేశీ ఉక్కు కంపెనీల ఉత్పత్తిలో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దేశీ ఉక్కు పోటీనిచ్చే విధంగా క్వాలిటీ పెరగాలని కోరారు. భారత స్టీల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండే స్థాయిలో ఎదగాల్సిన అవసరం ఉందని ఈ రంగంలోని కంపెనీల సీఈఓల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. సామర్థ్యం పెంపు, సాంకేతిక పరిజ్ఞానం మెరుగుదల, నాణ్యత పరంగా పరిశ్రమ చాలా పురోగతి సాధించిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment