భువనేశ్వర్: ‘నీట్’పేపర్ లీక్ వ్యవహారంలో ఒకవేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అధికారులది తప్పని తేలితే వదిలేది లేదని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పష్టం చేశారు. ఆదివారం(జూన్16) ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు.
‘పేపర్‌లీక్‌కు సంబంధించి రెండు చోట్ల అక్రమాలు వెలుగుచూశాయి. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని పేరెంట్స్, తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నా. ఇందులో ఎంత పెద్దస్థాయి అధికారులున్నప్పటికీ వదిలేది లేదు.
ఎన్‌టీఏలో చాలా మార్పులు చేయాల్సి ఉంది. బిహార్ ఆర్థిక నేరాల విభాగం తొమ్మిది మంది నీట్ అభ్యర్థులకు పేపర్‌లీక్ కేసులో నోటీసులిచ్చింది. వారిని విచారణకోసం పిలిచాం’అని ప్రదాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment