న్యూఢిల్లీ: లోక్‌సభలో కొత్త ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా మోదీ 3.0 ప్రభుత్వానికి నీట్ పరీక్ష అక్రమాల సెగ తగిలింది. సోమవారం(జూన్24) లోక్‌సభలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు సీట్‌లో నుంచి వెళుతుండగా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై నిరసన తెలిపారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో సభను హోరెత్తించారు. ఇవేవీ పట్టించుకోకుండా ప్రదాన్ ఆయన ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష పేపర్ లీక్‌తో పాటు మార్కులు ఇష్టం వచ్చినట్లుగా వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
నీట్ అక్రమాలపై దేశవ్యాప్త నిరసనలు జరగడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది.
Comments
Please login to add a commentAdd a comment