ముంబై: దేశ రాజధానిలో ఢిల్లీ చోటు చేసుకుంటున్న పౌరసత్వం సవరణ చట్టం( సీఏఏ) వ్యతిరేక, అనుకూల అల్లర్ల సెగ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సభకు తగిలింది. మహారాష్ట్ర థానే జిల్లాలోని భీవండిలో స్థానిక ఎంఐఎం నేతలు గురువారం నిర్వహించే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక బహిరంగ సభను పోలీసులు రద్దు చేశారు. ఈ సభకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించాల్సింది. అయితే.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎంఐఎం నేతలు నిర్వహించే ఈ సభను వాయిదా వేయాలని బుధవారం పోలీసులు కోరారు. ఢిల్లీ ఘర్షణలపై స్పందించిన ఆరెస్సెస్
ఇక ఎంఐఎం నేతలు పోలీసుల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి తమ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారని డీసీపీ రాజ్‌కుమార్ షిండే పేర్కొన్నారు. అదే విధంగా గురువారం సాయంత్రం ముంబైలోని భీవండిలో జరగబోయే ఎంఐఎం బహిరంగ సభ వాయిదా పడిందని ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ తన ట్విటర్ ఖాతాలో తెలిపారు. ఈ సభను మార్చి నెల రెండో వారంలొ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. (ఢిల్లీ అల్లర్లు : ఏప్రిల్ 13కు విచారణ వాయిదా)
Comments
Please login to add a commentAdd a comment