ఆరెస్సెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు | RSS wants the world to salute India, says Bhagwat | Sakshi
Sakshi News home page

ఆరెస్సెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Published Sun, Mar 27 2016 8:00 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

ఆరెస్సెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

ఆరెస్సెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

కోల్ కతా: ప్రపంచం భారత దేశానికి సెల్యూట్ చేస్తుందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. భారత్కు ఆత్మగౌరవం ఎక్కువని, ప్రపంచమంతా 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేయాలని తమ సంస్థ భావిస్తుందని చెప్పారు. ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్స్ సొసైటీ సహ వ్యవస్థాపకుడు, దివంగత మదన్ లాల్ అగర్వాల్ పై రాసిన ఓ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ.. భారత్ ను సంపన్న దేశంగా చేయాలని తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

అవిభాజ్య భారత్ నుంచి విడిపోయినప్పుడు దేశం పేరు పాకిస్తాన్ అని పెట్టుకున్నారని ఎందుకంటే... భారత్ అని పేరు పెట్టుకునేందుకు వారిలో ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలు లేవని అభిప్రాయపడ్డారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాజ్యాంగంలో పేర్కొనలేదని, అందుకే భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేయనని ఒవైసీ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ఆరెస్సెస్ లాంటి సంస్థలో ఉన్నందున తాను చాలా అదృష్టవంతుడినని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement