అలాంటి వారికి పౌరసత్వం రద్దు చేయాలి | Revoke citizenship, voting rights of those not chanting 'Bharat Mata Ki Jai': Shiv Sena | Sakshi
Sakshi News home page

అలాంటి వారికి పౌరసత్వం రద్దు చేయాలి

Published Thu, Mar 17 2016 3:34 PM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

అలాంటి వారికి పౌరసత్వం రద్దు చేయాలి

అలాంటి వారికి పౌరసత్వం రద్దు చేయాలి

ముంబై: 'భారత్ మాతాకి జై' అనను అని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. చట్టపరంగా ఆయనను తలదించుకునేలా చేయాలని శివసేన 'సామ్నా'లో రాసిన సంపాదకీయంలో పేర్కొంది. 'భారతమాతను ఒవైసీ అవమానించారు. ఆయనకు వ్యతిరేకంగా దేశంలోని ముస్లింలందరూ భారత్ మాతాకి జై అంటూ నినదించాలి. ఈ నినాదం చేయడానికి నిరాకరించేవారి పౌరసత్వం, ఓటు హక్కు రద్దు చేయాలి' అని శివసేన పేర్కొంది.

వివాదాలకు కారణమైన ఒవైసీ స్వేచ్ఛగా మహారాష్ట్రలో తిరుగుతున్నా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. 'సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యేలపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. ఇదే సమయంలో రాజద్రోహం వ్యాఖ్యలు చేసిన వారు(ఒవైసీ) స్వేచ్ఛగా తిరుగుతున్నార'ని శివసేన ధ్వజమెత్తింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement