న్యూఢిల్లీ: 'భారత మాతా కి జై' అనే నినాద వివాదంలో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా తలదూర్చారు. ఆ నినాదం ఇవ్వడమనేది వారి వ్యక్తిగత విషయం అని, ఏ ఒక్కరూ ఆ నినాదం చేయాలని బలవంతపెట్టకూడదని అన్నారు. 'మన జాతీయ జెండా ఎగురుతున్నప్పుడు దాన్ని చూస్తూ జాతీయ గీతం ఆలపిస్తుంటే.. వందేమాతరం పాడుతుంటే గర్వంగా అనిపిస్తుంటుంది. కానీ కొంతమంది అలా చేయబోమని అంటారు.
అది వారి ఇష్టం' అని విశ్వవిద్యాలయాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే అంశంపై ప్రసంగిస్తూ అన్నారు. తన మెడపై కత్తి పెట్టి బెదిరించినా సరే తాను మాత్రం భారత్ మాతాకి జై అనే మాటలు అనబోనని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే ఖుర్షీద్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
''భారత్ మాతాకీ జై' బలవంతంగా అనిపించొద్దు'
Published Tue, Mar 15 2016 10:34 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM
Advertisement