పంచె కంటే పాతది ప్యాంటుకట్టు
పంచె పాతదా? ప్యాంటు పాతదా? అంటే పంచెకట్టే పాతదని ఠక్కున చెప్పేస్తాం. అంతేకాదు, పంచెకట్టే వాళ్లకు ఫ్యాషన్ తెలియదని కూడా పెదవి విరిచేస్తాం. వాళ్లను పాతకాలం మనుషులుగా తీసిపారేస్తాం. అయితే, ఈ అభిప్రాయం సరికాదు. నిజానికి పంచెకట్టు కంటే ప్యాంటుకట్టే ఏజ్ ఓల్డ్ ఫ్యాషన్. మరోలా చెప్పాలంటే ప్యాంటుకట్టుతో పోలిస్తే, పంచెకట్టే లేటెస్ట్ ఫ్యాషన్.
చరిత్రను తవ్వితీస్తే బయటపడిన విశేషమిది. ఉత్తర ఇటలీ ప్రాంతంలో పర్యటిస్తున్న ఇద్దరు జర్మన్ పర్యాటకులకు 1991లో ఒక మంచుమనిషి మమ్మీ కనిపించింది. ఆ మంచు మనిషి మమ్మీకి తోలుతో తయారు చేసిన ప్యాంటులాంటి వస్త్రవిశేషం, నడుముకు బెల్టులాంటి పట్టీ ఉన్నాయి. లాబొరేటరీల్లో పరీక్షలు జరిపితే, ఆ మంచుమనిషి మమ్మీ సుమారు క్రీస్తుపూర్వం 3300 సంవత్సరాల నాటిదని తేలింది.
- పన్యాల జగన్నాథదాసు