ప్యాంట్... బేబీ గౌన్
న్యూలుక్
కార్గో ప్యాంట్స్, జీన్స్ మగ - ఆడ - పిల్లలు తేడా లేకుండా అందరూ వాడేస్తున్నారు. వాటిలో ఏళ్లకేళ్లుగా వాడినా పాడవని ప్యాంట్స్ ఉంటుంటాయి. విసుగొచ్చి పక్కన పడేసినవీ, పిల్లలకు పొట్టిగా మారిన ఈ ప్యాంట్స్‌ను ఉపయోగపడేలా మార్చుకోవచ్చు.
అందమైన హ్యాండ్ బ్యాగ్
ప్యాంట్ నడుము భాగాన్ని తీసుకొని, హ్యాండ్ బ్యాగ్స్‌గానూ, ఫోన్ పౌచ్‌లుగానూ రూపొందించవచ్చు. తీసుకున్న క్లాత్‌ని బ్యాగ్ నమూనా వచ్చేలా కట్ చేసి, ఫొటోలో చూపిన మాదిరిగా కుట్టాలి.
పాకెట్స్‌తో గౌన్: ప్యాంట్స్‌కు పెద్ద పెద్ద పాకెట్స్ (జేబులు) ఉంటాయి. పాకెట్స్‌తోనే ఓ డిజైన్ సృష్టిస్తే.. అది పిల్లలకు మంచి డ్రెస్ అవుతుంది. ప్యాంట్ పెద్ద జేబులు ఉన్న భాగాలను తీసుకోవాలి. పాకెట్ క్లాత్‌కు పూర్తి కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి మెత్తని క్లాత్ తీసుకుంటే మంచిది. కుట్టడానికి వీలైన వస్తువులను తీసుకోవాలి. పిల్లల కొలతలకు తగ్గట్టు స్కర్ట్ లేదా గౌన్ డిజైన్ చేసుకొని కుట్టేసి ప్యాంట్ పాకెట్‌ను జత చేస్తే కొత్త డ్రెస్ రెడీ.