ఇలాగైతే నప్పుతాయి...
బ్యూటిప్స్
రోజు వారీ వాడుకకు బూట్ కట్ జీన్స్ కాని స్లైట్ ఫ్లేర్ జీన్స్ కాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి ఏ తరహా శరీరతత్త్వానికైనా నప్పుతాయి. వీటిని ధరించడం వల్ల స్లిమ్‌గా కనిపించ వచ్చు. ఇవి వయసును దాచేస్తాయి.
డ్రస్ నంబరు చూసుకుని కొనాలి ఒక కంపెనీ ఇచ్చే నంబర్ మరొక కంపెనీ నంబర్‌తో సరిపోలదు. ఒక్కొక్కరు ఒక్కోరకమైన నిబంధనల మేరకు నంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ట్రయల్ వేర్ తప్పనిసరి.
వెయిస్ట్‌తోపాటు ప్యాంటు పొడవు కూడా చూసుకోవాలి. కొన్ని మోడల్స్ పొడవు తక్కువగా ఉంటాయి. షూస్, శాండల్స్ మోడల్, వాటి అందం కనిపించడం కోసం పొడవు తక్కువగా ఉన్న వాటిని ఎంచుకుంటారు. ప్రతిసారీ డ్రస్‌కు మ్యాచింగ్ పాదరక్షలను వాడగలిగినప్పుడే ఇలాంటి వాటిని తీసుకోవాలి. సాధ్యం కానప్పుడు పాదరక్షలను కప్పేసే మోడల్‌ను ఎంచుకోవాలి.
కాళ్లు పొట్టిగా ఉన్న వాళ్లు ఎంత అందమైన పాదరక్షలను వాడే అవకాశం ఉన్నా సరే పొడవు కాళ్లున్న పాంటులనే వాడాలి. పొడవుతో ప్యాంటులో కాళ్ల పొట్టిదనాన్ని దాచేయవచ్చు. అసలే పొట్టిగా ఉన్న కాళ్లకు పొట్టి కాళ్ల ప్యాంటు వేస్తే మరీ కురచగా కనిపిస్తారు.
వైడ్ లెగ్ ప్యాంట్లు చక్కటి స్ట్రెయిట్ లైన్‌తో స్టైల్‌గా ఉంటాయి. ఒక మోస్తరు పొడవు నుంచి బాగా పొడవుగా ఉంటే వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక వయసు రీత్యా చూస్తే ఇవి ధరించినప్పుడు ఉన్న దానికంటే కాస్త పెద్దగా కనిపిస్తారు. ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఉన్న వాళ్లు హుందాగా కనిపించడం కోసం వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అఫీషియల్ మీటింగ్స్‌కు బాగుంటాయి.