స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫాస్ట్‌ట్యాగ్ కొత్త డిజైన్‌ను ఆవిష్కరించింది. వాహనదారులకు సమయం వృధాను తగ్గించడంతోపాటు చిన్న వాహనాల ట్యాగ్‌లతో భారీ వాహనాలు చేస్తున్న దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో దీన్ని ప్రారంభించింది.
"వెహికల్ క్లాస్ (VC-04) కేటగిరీలో ఫాస్ట్‌ట్యాగ్ కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టాం. అధునాతన ఫాస్ట్‌ట్యాగ్ డిజైన్ వాహన గుర్తింపు, టోల్ సేకరణ సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే వాహనదారుల సమయం ఆదా అవుతుంది" అని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.కొత్త ట్యాగ్ ఆగస్టు 30 నుండి అందుబాటులో వచ్చింది.
ఫాస్టాగ్ కొత్త డిజైన్ ప్రత్యేకంగా వెహికల్ క్లాస్-4 (VC-04) కోసం ఎస్‌బీఐ తీసుకొచ్చింది. ఇందులో కారు, జీప్, వ్యాన్ కేటగిరీలు ఉన్నాయి. ప్రస్తుతం, ట్రక్కుల వంటి భారీ వాహనాలపై VC-04 ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో టోల్ ప్లాజాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. కొత్త డిజైన్ వాహనాల కేటగిరీని సులభంగా గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. తప్పు కేటగిరీ వాహనాలపై తక్షణ చర్య తీసుకోవడానికి సహాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment