new design
-
ఫాస్టాగ్ కొత్త డిజైన్.. దుర్వినియోగానికి ఇక చెక్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫాస్ట్‌ట్యాగ్ కొత్త డిజైన్‌ను ఆవిష్కరించింది. వాహనదారులకు సమయం వృధాను తగ్గించడంతోపాటు చిన్న వాహనాల ట్యాగ్‌లతో భారీ వాహనాలు చేస్తున్న దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో దీన్ని ప్రారంభించింది."వెహికల్ క్లాస్ (VC-04) కేటగిరీలో ఫాస్ట్‌ట్యాగ్ కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టాం. అధునాతన ఫాస్ట్‌ట్యాగ్ డిజైన్ వాహన గుర్తింపు, టోల్ సేకరణ సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే వాహనదారుల సమయం ఆదా అవుతుంది" అని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.కొత్త ట్యాగ్ ఆగస్టు 30 నుండి అందుబాటులో వచ్చింది.ఫాస్టాగ్ కొత్త డిజైన్ ప్రత్యేకంగా వెహికల్ క్లాస్-4 (VC-04) కోసం ఎస్బీఐ తీసుకొచ్చింది. ఇందులో కారు, జీప్, వ్యాన్ కేటగిరీలు ఉన్నాయి. ప్రస్తుతం, ట్రక్కుల వంటి భారీ వాహనాలపై VC-04 ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో టోల్ ప్లాజాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. కొత్త డిజైన్ వాహనాల కేటగిరీని సులభంగా గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. తప్పు కేటగిరీ వాహనాలపై తక్షణ చర్య తీసుకోవడానికి సహాయపడుతుంది. -
ఎస్యూవీ లవర్స్ కోసం: సరికొత్తగా న్యూ-జెన్ హ్యుందాయ్ టక్సన్
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ టక్సన్ 2022నికొత్త డిజైన్‌తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. న్యూ-జెన్ హ్యుందాయ్ టక్సన్ ఎస్యూవీ ఆగస్ట్ 4 ఇండియాలో లభ్యం కానుంది. కొత్త డిజైన్, పలు సేఫ్టీ ఫీచర్లతో దీన్ని తీసుకురానుంది. హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసిన హ్యుందాయ్ తాజాగా ఎస్యూవీ కార్ లవర్స్ కోసం 2022 హ్యుందాయ్ టక్సన్ పోలరైజింగ్ డిజైన్, AWD, ADAS లాంటి ఫీచర్లు జోడించింది. హ్యుందాయ్ బెస్ట్ ఎస్‌యూవీగా ఉన్న ఈ కారు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ టక్సన్: డిజైన్, ఫీచర్లు ఇంటిగ్రేటెడ్ LED DRLలతో కొత్తగా రూపొందించిన 'పారామెట్రిక్-జువెల్' గ్రిల్‌ను ఫ్రంట్ ఫాసియా , బంపర్‌పై హెడ్‌ల్యాంప్‌లు, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్‌తో పాటు పదునైన కట్‌తో స్పోర్టినెస్ డిజైన్‌తో తీర్చిదిద్దింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC/VSM, హిల్ స్టార్ట్-స్టాప్ అసిస్ట్, లెవల్ 2 ADAS సూట్ వంటి 60 ప్లస్ సేఫ్టీ ఫీచర్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ , డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ లాంటి అనేక ఫీచర్లతో హ్యుందాయ్ టక్సన్ వస్తుంది. వాయిస్ ఆదేశాలకు మద్దతు ఇచ్చే హ్యుందాయ్ బ్లూలింక్ సిస్టమ్ ఉంది. ఇంటీరియర్ విషయానికి వస్తే 10.25అంగుళాల టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్లెస్ ఛార్జర్లాంటి ఫీచర్లున్నాయి. హ్యుందాయ్ టక్సన్: ఇంజీన్ , ధర 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొత్త Nu 2.0 పెట్రోల్ ఇంజన్, 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొత్త ఆర్ 2.0 డీజిల్ ఇంజన్‌తో లభించనుంది. అంతేకాకుండా, ఇంజిన్లు ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పని చేస్తాయి. ఎలాంటి కఠినమైన భూభాగంలో నావిగేట్ చేయగల సామర్థ్యం దీని సొంతం. హ్యుందాయ్ టక్సన్ ధరను ఇంకా అధికారికంగా వెల్లడికానప్పటికీ, దాదాపు రూ. 23 లక్షలు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారతీయ ఎస్యూవీ మార్కెట్లో జీప్ కంపాస్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్, ఇతర మోడళ్లతో పోటీపడనుంది. The all new @HyundaiIndia #TUCSON premieres in India. #HyundaiTUCSON #NextdriveNow #HyundaiSUVLife @MobilityOutlook pic.twitter.com/T0IaikZVAU — Deepangshu Dev Sarmah (@deepangshu) July 13, 2022 -
అథర్ నుంచి కొత్త స్కూటర్.. ధర లక్ష లోపే!
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మరో సంచలనానికి తెర లేపేందుకు అథర్ సంస్థ సిద్ధమైంది. జనాలు మరింత చేరువయ్యేందుకు వీలుగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకిత తెచ్చేందుకు సన్నహకాలు చేస్తోంది. అన్ని అనుకూలిస్తే మరో రెండేళ్లలోపు అందుబాటు ధరలో ఈ స్కూటర్ మార్కెట్లోకి రానుంది. ముందే వచ్చినా ఇండియాలో ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లను భారీ ఎత్తున మార్కెట్లోకి తెచ్చిన సంస్థగా అథర్ రికార్డు సృష్టించింది. అయితే ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చిన ఓలా , సింపుల్‌వన్ స్కూటర్లను ఓ రకంగా ఆర్థర్ని వెనక్కి నెట్టేశాయి. ఆకట్టుకునే ఫీచర్లు, ప్రీ బుకింగ్స్‌తో ఓలా అయితే ఓ రేంజ్లో దేశవ్యాప్తంగా హడావుడి సృష్టించింది. ఓలా వెంటనే మార్కెట్లోకి వచ్చిన సింపుల్ వన్ సైతం తక్కువ సమయంలో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది. ఆర్థర్ కొత్త రూటు మార్కెట్లోకి ముందే వచ్చినా పరిస్థితులు అనుకూలించని కారణంగా ఆర్థర్ బైకుల ఆమ్మకాలు ఓ స్థాయిలోనే జరిగాయి. కానీ ఓలా, సింపుల్‌వన్ ప్రారంభమే ఘనంగా మొదలైంది. దీంతో ఆ రెండు కంపెనీలను పోటీ ఇవ్వడంతో పాటు మార్కెట్లో పట్టు పెంచుకునేందుకు ఆర్థర్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఆప్షన్లతో ఓలా, సింపుల్వన్తో పోటీ పడుతూనే ధర విషయంలో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది. లక్ష రూపాయల లోపు ఓలా, సింపుల్ వన్ స్కూటర్లలో ఆప్షన్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నా వాటి ధర లక్షకు పైగా ఇంచుమించు ఆన్‌రోడ్ ధర లక్షన్నరకు దగ్గరగా వస్తోంది. దీంతో ఈ స్కూటర్లు సొంతం చేసుకుందామని ఊవ్విళ్లూరిన వారు ధర విన్నాక పునరాలోచనలో పడ్డారు. ఇలాంటి వారిని ఆకట్టుకునేందుకు త్వరలో లక్ష రూపాయల ధర లోపే ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి తేబోతున్నట్టు అథర్ బిజినెస్ చీఫ్ రవ్నీత్ పోకేలా కామెంట్ చేశారు. ఆర్థర్ 450 కంటే తక్కువ ధరలో అథర్ నుంచి అనేక మోడళ్లు అందుబాటులో ఉన్నా ఇందులో అన్నింటికంటే తక్కువ ధర 1.13 లక్ష (షోరూం, ఢిల్లీ)లకు 450 ప్లస్ స్కూటర్ లభిస్తోంది. త్వరలో డిజైన్ చేయయబోయే స్కూటర్ ధరను కచ్చితంగా ప్లస్ కంటే తక్కువ ధరకే తేవాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే స్కూటర్ డిజైన్ పనులు ప్రారంభించింది. మరో ఏడాదిలోగా ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తెస్తామంటూ అథర్ ప్రతినిధులు తెలిపారు. చదవండి : ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్! -
Flying Cars: ఆకాశంలో నడిచే కార్లు.. వచ్చేది ఎప్పుడంటే ?
వెబ్‌డెస్క్: రోడ్లపై నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గాలిలో ప్రయాణించే కార్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు, ఆకాశంలో నడిచేలా కార్ల డిజైన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఎయిర్ ట్యాక్సీలు ఎయిర్ ట్యాక్సీల తయారీ విషయంలో ఇప్పటికే పలు కంపెనీలు విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించాయి. అయితే కమర్షియల్ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ అమితాసక్తితో ఉంది. 2030 నాటికి గాలిలో ఎగిరే కార్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తామనే నమ్మకం ఉందంటూ హ్యుందాయ్ యూరోపియన్ ఆపరేషన్స్ సీఈవో మైఖేల్ కోలే తెలిపారు. 4 సీట్ కెపాసిటీ భవిష్యత్తులో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఎయిర్ ట్యాక్సీలే మేలైన మార్గం. అందుకే నలుగురు నుంచి ఐదుగురు ప్రయాణించే కెపాసిటీతో ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నట్టు హ్యుందాయ్ తెలిపింది. పూర్తిగా బ్యాటరీతో నడిచేలా ఎయిర్ ట్యాక్సీని డిజైన్ చేస్తోంది హ్యుందాయ్. ఎయిర్ట్యాక్సీల విషయంలో ఇప్పటికే పలు కంపెనీల ప్రోటోటైప్ విజయవంతం అయ్యాయి. కమర్షియల్ తయారీపై ఆయా కంపెనీలు కూడా దృష్టి సారించాయి. టూ ఇన్ వన్ సాధారణంగా ఎయిర్ పోర్టు వరకు కారులో వెళ్లి అక్కడి నుంచి తిరిగి విమానం ఎక్కి ప్రయాణం చేస్తుంటాం. అయితే ఎయిర్‌ట్యాక్సీలు ఈ రెండు పనులు చేసేలా ప్రస్తుతం డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. రోడ్డుపై నడిచేలా, గాలిలో ఎగిరేలా ఈ ఎయిర్‌ట్యాక్సీని డిజైన్ చేస్తున్నారు. ఎయిర్ ట్రావెల్ ముగిసిన తర్వాత రెక్కలు, ఇతర భాగాలు అన్ని ముడుచుకుని కారులాగా మారి పోతుంది ఈ ఎయిర్ ట్యాక్సీ. రోడ్డుపై ప్రయాణించేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రత్యేక ఎయిర్‌పోర్టులు ఎయిర్ట్యాక్సీల్లో కొన్ని ఎటవాలుగా ల్యాండింగ్, టేకాఫ్ తీసుకుంటుండగా హ్యుందాయ్ మాత్రం నిట్టనిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ తీసుకునే డిజైన్‌పై దృష్టి సారించింది. ఎయిర్ ట్యాక్సీలు తిరిగేందుకు వీలుగా యూకేలో ప్రత్యేక ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్లో హ్యుందాయ్ తలమునకలై ఉంది. ఈ ఎయిర్‌పోర్టులో దిగే విమానాలు ఏటవాలుగా కాకుండా నిట్టనిలువగా పైకి ఎరగడం, దిగేలా ఈ ఎయిర్‌పోర్టును డిజైన్ చేస్తున్నారు. . అర్బన్ ఎయిర్ మొబిలిటీపై 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు హ్యుందాయ్ సిద్ధమైంది. -
Mahindra XUV 700: మేఘాలలో తేలిపొమ్మన్నది
ఎస్యూవీ మార్కెట్లో ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా సిద్దమవుతోంది. త్వరలో రాబోతున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మోడల్ని అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుతోంది. ఈ మోడల్‌కి సంబంధించిన కీలక అప్డేట్ని మహీంద్రా అఫీషియల్‌గా రివీల్ చేసింది. స్కై రూఫ్ గత రెండుమూడేళ్లుగా సన్ రూఫ్ ఫీచర్ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ యూటిలిటీ సెగ్మెంట్లో ఈ ఫీచర్ క్రమంగా తప్పనిసరిగా మారింది. దీంతో మహీంద్రా సంస్థ నుంచి త్వరలో రాబోతున్న ఎక్స్‌యూవీ 700 మోడల్లో సన్‌రూఫ్‌ని మరింత ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. స్కై రూఫ్ పేరుతో ఈ సెగ్మెంట్లో ఉన్న ఇతర కార్లకంటే పెద్దగా సన్‌రూఫ్‌ని డిజైన్ చేశారు. మహీంద్రా వెల్లడించిన వివరాల ప్రకారం 1360 మిల్లీమీటర్ల పొడవు, 870 మిల్లీమీటర్ల వెడల్పుతో స్కైరూఫ్ ఉంది. వీటికి పోటీగా ఇండియాలో అమ్మకాలు ఎక్కువగా ఎస్యూవీ మోడళ్లైన ఎంజీ హెక్టార్, జీప్ కంపాస్, టాటా హారియర్, టాటా సఫారీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీలలో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. ఇప్పుడు వాటి కంటే పెద్ద సన్‌రూఫ్‌తో మహీంద్రా మార్కెట్లో అడుగు పెడుతోంది. అంతేకాదు వేగానఇ బట్టి ఆటోమేటిక్‌గా లైటింగ్ అడ్జస్ట్ చేసే ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్ ఫీచర్‌ని సైతం మహీంద్రా యాడ్ చేసింది. వెహికల్ స్పీడ్ 80 కి.మీ దాటితే ఆటోమేటిగా లైటింగ్ పెరుగుతుంది. Sorry sunroofs. The Skyroof™ has arrived.https://t.co/TsnlBtaeFq . . Stay tuned. There’s more coming.#HelloXUV700 #HelloSkyroof#XUV700 pic.twitter.com/ywfQcAo2Ph — MahindraXUV700 (@MahindraXUV700) June 26, 2021 చదవండి : స్కోడా ఎలక్ట్రిక్ కార్లు త్వరలోనే..! -
oxygen concentrator: పుణే సంస్థ కొత్త డిజైన్
సాక్షి, ముంబై: కరోనా వైరస్ రెండో దశలో ప్రజలు వణించింది. ముఖ్యంగా కేసుల ఉధృతి ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో ఆక్సిజన్ కొరతతో చాలామంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పుణేకు చెందిన ఒక ఇంజనీరింగ్ సంస్థ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకోసం ఒక కొత్త డిజైన్‌ను అభివృద్ధి చేసింది. కరోనావైరస్ బాధితులకు ఉపయోపడేలా డూ-ఇట్-యువర్ సెల్ఫ్( డీఐవై) అనే డిజైన్‌ను రూపొందించింది. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని తయారు చేశామని అనాశ్వర్ టెక్నాలజీస్ డైరెక్టర్ కరణ్ తారాడే ప్రకటించారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ భారతదేశంలో, భారతీయుల కోసం భారతీయులచే అభివృద్ధి చేసినట్టు చెప్పుకొచ్చారు. డిజైన్‌ను సరళంగా, సాధ్యమైనంత చౌక ధరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కంపెనీ ఇంజనీర్లు ఇంటర్నెట్లో 'ఆక్సికిట్' ద్వారా గాలి నుంచి ఆక్సిజన్ సేకరిస్తున్న తీరు బాగా ఉన్నప్పటికీ ఓపెన్ సోర్స్‌లో, స్వల్పంగా మార్పులతో దీన్నితయారు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం 1970 లలో కనుగొన్న విదేశీ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను చాలా కుటుంబాలు వినియోగిస్తున్నాయని తారాడే చెప్పారు. అలాగే కరోనా మూలంగా దాదాపు ప్రతీ పౌరుడు ప్రభావితమవుతున్నారు. అందుకే తమ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతిఒక్కరికీ అందుబాలోకి ఉండాలని బావిస్తున్నామని తరాడే చెప్పారు. ఆక్సిజన్ ఎనలైజర్‌ను కూడా తయారు చేశాం కానీ చాలా ఖరీదైంది కావడంతో కాలామందికి అందుబాటులో లేదన్నారు. ఈ డిజైన్‌ను యూట్యూబ్ వీడియోలు, గితుబ్రిపోజిటరీ ఉపయోగించి అభివృద్ధి చేశామని తెలిపారు. 'ఆక్సికిట్' టెక్నాలజీలో భారతీయ అవసరాలనకనునుగుణంగా మార్పులతో తీర్చిదిద్దామన్నారు. ముఖ్యంగా నిమిషానికి 15 లీటర్ల (ఎల్పిఎం)ఆక్సిజన్ కోసం 'డూ ఇట్ యువర్ సెల్ఫ్' డిజైన్‌ను అభివృద్ధి చేశామనీ, 90 శాతానికి పైగా స్వచ్ఛతను అందించే 20 ఎల్పిఎం మోడల్‌పై కూడా పని చేస్తున్నామన్నారు. అంతేకాదు వీటిపై ప్రాథమిక పరిజ్ఞానంతో ఎవరైనా దీన్ని చేయగలుగుతారని కూడా ఆయన చెప్పారు. మెకానికల్ ఇంజనీర్ అయిన తారాడే తన అల్ట్రా-పోర్టబుల్ వాటర్ క్రిమిసంహారక వ్యవస్థ ప్రాజెక్ట్ కోసం 2018 లో నీతి అయోగ్ 'స్మార్ట్ ఇండియా హాకథాన్'లో మొదటి బహుమతిని గెలుచుకోవడం విశేషం. చదవండి: యూపీలో దారుణం: ఆక్సిజన్ నిలిపివేసి మాక్ డ్రిల్ Samsung స్మార్ట్‌టీవీ: అద్భుత ఫీచర్లు -
స్మార్ట్ టెక్నాలజీ, న్యూలుక్ : టీవీఎస్ కొత్త అపాచీ
సాక్షి, ముంబై: పముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటర్స్ బీఎస్-6 ప్రమాణాలకు తోడుగా, కొత్త ఫీచర్లు, అధునిక టెక్నాలజీతో రూపొందించిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బైక్‌ను లాంచ్ చేసింది. ప్రత్యేక ఎడిషన్ బైక్‌లో తొలిసారి రైడ్ మోడ్‌ను పరిచయం చేసింది. స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడ్ మోడ్లతో దీన్ని భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ధరను మాత్రం పాత దానితో పోలిస్తే.. కాస్త ఎక్కువగానే ఉంది. ధర రూ .1.31 లక్షలుగా నిర్ణయించింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బుకింగ్, డెలివరీ ఈ రోజు నుండే ప్రారంభం. ఈ పండుగ సీజన్లో కస్టమర్లను ఆకట్టుకునేలా ఈ కొత్త బైక్‌ను కొత్త అవతారంలో తీసుకొచ్చింది. ఎల్ఈడీ టెక్ హెడ్‌ల్యాంప్స్, డ్యూయల్ ఛానల్ సింగిల్ ఛానల్ ఏబీఎస్, హై పెర్ఫార్మెన్స్ రియర్ రేడియల్ టైర్లు, రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, రేస్ ట్యూన్డ్ స్లీపర్ క్లచ్, స్లైడ్ త్రూ టెక్నాలజీ ఉన్నాయి. దీనితో పాటు, ఎడ్జస్టబుల ఫ్రంట్ సస్పెన్షన్ లివర్‌నుజోడించింది. అంతేకాదు బ్లూటూత్‌తో కూడిన స్మార్ట్ఎక్స్ కనెక్ట్ టెక్నాలజీని అపాచీ ఆర్టీఆర్ 200 4వీలో జోడించింది. దీని ద్వారా యాప్‌ను మొబైల్‌కు కనెక్ట్ చేయవచ్చు.తద్వారా బైక్‌కు సంబంధించిన చాలా సమాచారం తీసుకోవచ్చు. రైడర్‌ను ఎల్లప్పుడూ బైక్‌తో ఎటాచ్ అవ్వవచ్చు. ఇంకా ఈ బైక్‌లో ప్రామాణిక బ్లూటూత్ కనెక్టివిటీతో ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందిచింది. 197.75 సీసీ సింగిల్ సిలిండర్, 4 వాల్వ్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఈ ఇంజన్ 20.2 బీహెచ్పీ పవర్‌ను, 16.8 న్యూటన్ మీటర్ టార్క్‌ను అందిస్తుంది. -
నూతన సచివాలయ డిజైన్ ఖరారు!
సాక్షి, హైదరాబాద్: ఆ భవన నమూనాను చూడగానే అమెరికా పరిపాలన ప్రధాన కార్యాలయం వైట్‌హౌజ్ గుర్తుకు వస్తుంది.. కానీ అది పక్కా డెక్కన్ కాకతీయ శైలిలో అలరారుతుంది. అదే ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతున్న తెలంగాణ సచివాలయ భవనం. సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత చెన్నైకు చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్స్ రూపొందించిన నమూనాను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆ నమూనా ముఖ్యమంత్రి కేసీఆర్ అమితంగా ఇష్టపడే గుమ్మటం ఆకృతులతో అలరారనుంది. ఆరు అంతస్తుల్లో, విశాలమైన పాలరాతి నిర్మాణంలా అనిపించే అందమైన భవంతి. ముందు నుంచి చూస్తే 11 గుమ్మటాలతో కూడిన గమ్మత్తయిన రాచఠీవీ దాని సొంతం. భవనం మధ్య భాగంలో పైన ఎత్తయిన ప్రధాన గుమ్మటం, దాని దిగువన అటూఇటూ మరో రెండు చిన్న గుమ్మటాలు. భవనానికి రెండు వైపులా మరో రెండు పెద్ద గుమ్మటాలు.. వాటికి రెండు వైపులా రెండు చొప్పున పహారా కాస్తున్నాయా అన్నట్టు మరో నాలుగు, ప్రధాన గుమ్మటానికి ద్వారపాలకుల్లా మరో రెండు.. వెరసి 11 గుమ్మటాల సమ్మిళితంగా ఆ భవనం ఔరా అనిపిస్తుంది. భవనానికి ముందు నీటిని విరజిమ్ముతూ స్వాగతం పలికే భారీ వాటర్ ఫౌంటెయిన్.. దాని ముందు సగర్వంగా జాతీయ పతాకాన్ని ఉంచే జెండా దిమ్మె. దానికి రెండు వైపులా 20 చొప్పున విశాలమైన మెట్లు ఉండే రెండు మార్గాలుంటాయి. పైకి వెళ్లిన తర్వాత భవనంలోకి వెళ్లేందుకు మరో భారీ మెట్ల మార్గం ఉంటుంది. సీఎం కార్యాలయానికి ప్రత్యేక మార్గం భవనం ఆరు అంతస్తుల్లో (జీ ప్లస్ 5)ఉంటుంది. ప్రవేశద్వారం వద్ద ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఉంటుంది. ప్రధాన ప్రవేశద్వారం రెండు మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ముందువైపు భవనం మధ్యలో ‘తెలంగాణ’ను ప్రతిబింబించే చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నారు. భవనం 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. మంత్రులు, పేషీలు, కార్యదర్శుల కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా తీర్చిదిద్దనున్నారు. పచ్చదనానికి ప్రాధాన్యం ప్రస్తుత సచివాలయ ప్రాంగణం 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. కొత్త భవనానికి 20 శాతం స్థలం కేటాయించారు. మిగతా ప్రాంతంలో పచ్చిక బయళ్లకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. హరిత తెలంగాణ మదిలో మెదిలేలా పచ్చటి సచివాలయం ఇక్కడ ఆవిష్కృతం కానుంది. మొత్తం స్థలంలో 60 శాతం పచ్చిక ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఫ్రాన్స్‌లోని వెసాయ్ల్స్ ప్యాలెస్ ముందున్న ఉద్యానవనం తరహాలో ఈశాన్యం, ఆగ్నేయం వైపు ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. మధ్యలో భారీ ఫౌంటెయిన్ కూడా ఉంటుంది. దీన్ని తెలంగాణ పుష్పం తంగేడు ఆకృతిలో రూపొందించనున్నారు. గ్రీన్బిల్డింగ్ కాన్సెప్ట్.. ప్రపంచవ్యాప్తంగా భారీ నిర్మాణాలను పర్యావరణహితంగా నిర్మిస్తున్నారు. నూతన సచివాలయం భవనం విషయంలో కూడా గ్రీన్బిల్డింగ్ కాన్సెప్ట్‌ను అవలంభిస్తున్నారు. సహజ వెలుతురు ఎక్కువగా భవనంలోకి చొరబడేలా చేయటం ద్వారా లైట్ల అవసరాన్ని తగ్గించనున్నారు. ఇక వీలైనంతమేర సౌర విద్యుత్తును వాడనున్నారు. ఇందుకోసం భవనం పై భాగంలో సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తారు. సహజ వెలుతురు పెరగ్గానే లైట్లు వాటంతట అవే కాంతిని తగ్గించుకునేలా, అవసరమైతే ఆరిపోయేలా ఆటోమేటిక్ విధానంతో అనుసంధానిస్తారు. భవనంలోనికి సహజ గాలి ధారాళంగా వచ్చేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం సచివాలయంలో దాదాపు 200 వరకు చెట్లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని పెద్ద వృక్షాలు కూడా ఉన్నాయి. వాటిని అలాగే కాపాడుతూ, నిర్మాణానికి అడ్డుగా ఉన్న కొన్నింటిని ట్రాన్స్ లొకేట్ చేయాలని నిర్ణయించారు. 800 కార్లతో భారీ పార్కింగ్ లాట్ సచివాలయం అనగానే నిత్యం వేల మంది సందర్శకులు వస్తుంటారు. వీరి వాహనాలు నిలిపేందుకు భారీ పార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయంలో పనిచేసే మంత్రులు, అధికారులకు సంబంధించి 500 కార్లు నిలిపేలా, సందర్శకులకు సంబంధించి మరో 300 కార్లు ఇక్కడ నిలిపే ఏర్పాట్లు ఉంటాయి. తొలుత సెల్లార్ పార్కింగ్ అనుకున్నా... తర్వాత విరమించుకుని ఉపరితలంలోనే నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుత సచివాలయంలో దేవాలయం, మసీదు ఉన్నాయి. వాటిని కొత్త సచివాలయంలో కూడా నిర్మించనున్నారు. సిబ్బందికి సంబంధించి చిన్న పిల్లల కోసం క్రెచ్, బ్యాంకు, పోస్టాఫీసు.. తదితర ఏర్పాట్లు ఉంటాయి. చాలా గర్వంగా ఉంది: ఆస్కార్ జి. కాన్సెస్సో, ఆర్కిటెక్ట్ దేశంలోనే వేగంగా పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయ నిర్మాణానికి డిజైన్ రూపొందించే అవకాశం రావటం చాలా గర్వంగా ఉందని డిజైన్ రూపొందించిన చెన్నైకు చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్టస్ అధిపతి ఆస్కార్ జి.కాన్సెస్సో పేర్కొన్నారు. తన భార్య పొన్ని జి.కాన్సెస్సోతో కలిసి ఆయన ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. వినూత్న నిర్మాణాలకు డిజైన్లు రూపొందించటంతో ఈ సంస్థ మంచి ఖ్యాతిని పొంది ఇప్పటివరకు దాదాపు 100కుపైగా పురస్కారాలు అందుకుంది. తాజాగా తెలంగాణ సచివాలయ నమూనా రూపొందించే కాంట్రాక్టును దక్కించుకుంది. తిరిచురాపళ్లి నిట్‌లో ఈ దంపతులు బి.ఆర్క్ డిగ్రీ పొంది ఆ తర్వాత అమెరికాలో మాస్టర్స్ చేసి ఆర్కిటెక్ట్ సంస్థను ప్రారంభించారు. ‘తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనానికి డిజైన్ రూపొందించే అవకాశం మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ లాంటి వారితో పోటీపడి అవకాశం దక్కించుకున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి ఆశించేస్థాయిలో డిజైన్లు అందించాం. పచ్చిక బయళ్లతో సహా కలిపి మొత్తం 15 డిజైన్లు ఇచ్చాం. వాటిని పరిశీలించి చివరకు అత్యద్భుత నమూనాను ఎంచుకున్నారు. పూర్తి ఆధునిక హంగులుంటాయి. -
అయోధ్య తీర్పు : సోంపురా డిజైన్లోనే ఆలయం?
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రకాంత్ సోంపురా.. అయోధ్య తీర్పు వెలువడిన కొద్ది గంటలకే ఈయన పేరు పతాక శీర్షికల్లో చేరిపోయింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితమే డిజైన్ రూపొందించిన శిల్పి ఈయనే. గుజరాత్ వాసి అయిన చంద్రకాంత్ సోంపురా(78) 1989లో నాటి విశ్వహిందూ పరిషత్ చీఫ్ అశోక్ సింఘాల్ వినతి మేరకు రామాలయ నిర్మాణానికి డిజైన్ గీశారు. 1990లో అలహాబాద్‌లో కుంభ మేళా సమయంలో సమావేశమైన సాధువులు ఈ ఆకృతికి సమ్మతించారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన రాతి స్తంభాలను మలిచేందుకు ప్రత్యేక కార్యశాల ఏర్పాటు చేశారు. ఈ డిజైన్‌లో పేర్కొన్న విధంగా శిల్పులు శిల్పాలు, స్తంభాల్లో 40 శాతం వరకు ఇప్పటికే చెక్కారు. నిర్మాణ పనులు పూర్తి చేయాలంటే కనీసం రెండున్నరేళ్లు పడుతుందని చంద్రకాంత్ వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ట్రస్ట్ ఏర్పాటు, వనరుల సమీకరణకు కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. రామ మందిర నిర్మాణ నినాదానికి తోడుగా ఈ నమూనానే ఇంటింటికీ చేరింది. అందుకే ఇదే డిజైన్‌తో ఆలయం రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో నమూనా రూపొందించి, మళ్లీ దానికి తగిన రీతిలో రాయి సమకూర్చుకోవడం వంటి అంశాలు ఇమిడి ఉన్నందున తగు సమయం పట్టే అవకాశం ఉంది. పైగా చంద్రకాంత్ సోంపురా కుటుంబమే దేశ విదేశాల్లోని వందలాది ఆలయాలకు నమూనాలను అందించింది. చంద్రకాంత్ సోంపురా తండ్రి ప్రభాకర్ సోంపురా గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయానికి, మథురలోని శ్రీకృష్ణ ఆలయానికి డిజైన్ అందించారు. చంద్రకాంత్ సోంపురా స్వయంగా 100 ఆలయాలకు శిల్పిగా వ్యవహరించారు. ఇందులో గుజరాత్‌లోని స్వామి నారాయణ్ మందిర్ వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ఆలయ పనులు ప్రారంభమవుతాయని, వచ్చే శ్రీరామనవమికి ఆలయ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వీహెచ్‌పీ నేతలు అంటున్నారు. సోంపురా రూపొందించిన నమూనా ఇలా ► ఆలయ నిర్మాణానికి ఆరున్నర ఎకరాల స్థలం అవసరం. ► ఉత్తర భారతంలో ప్రఖ్యాతి గాంచిన ‘నగర’ శైలిలో ఆలయం ఉంటుంది. ► గర్భ గృహం, అంత్రల్, మహా మండపం, రంగ మండపం, ప్రవేశ మండపం.. ఇలా ఐదు భాగాలుగా ఉంటుంది. వీటి గుండానే రాముడి దర్శనం ఉంటుంది. ► గర్భ గృహానికి ఒక ద్వారం, మహా మండపానికి 7 ద్వారాలు ఉంటాయి. ► ఈ ఆకృతిలో ఆలయ నిర్మాణానికి 2.75 లక్షల ఘనపుటడుగుల రాయి అవసరం. ఇప్పటికే 1.25 లక్షల ఘనపుటడుగుల రాయిని చెక్కారు. ► ఈ నమూనా ప్రకారం 270 అడుగుల పొడవు, 126 అడుగుల వెడల్పు, 132 అడుగుల ఎత్తుతో ప్రధాన ఆలయ కట్టడం ఉంటుంది. ఇందులో 81 అడుగుల మేర గోపుర శిఖరం ఉంటుంది. ► 212 స్తంభాలతో నిర్మాణం ఉంటుంది. ► ప్రధాన ఆలయం రెండంతస్తుల్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో బాల రాముడి విగ్రహం, మొదటి అంతస్తులో రామ దర్బారు ఉంటుంది. ఆ పైన ఆలయ శిఖరం ఉంటుంది. ► ప్రధాన ఆలయానికి ఒకవైపు కథా కుంజ్ ఉంటుంది. ► రాజస్తాన్ రాష్ట్రంలోని భరత్పూర్ జిల్లా బన్సి పహార్పూర్ నుంచి తెచ్చిన గులాబీ రంగు రాయితో ఇప్పటికే దాదాపు 40 శాతం మేర శిల్పాల పనులు పూర్తయ్యాయి. ► ఆలయ నిర్మాణంలో స్టీలు అవసరం లేదు. -
సచిన్ లగ్జరీ కారు కొత్త లుక్‌లో
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు సూపర్ కార్లంటే మోజు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అత్యంత విలాసవంతమైన కార్లను సొంతం చేసుకున్నాడు. మరోవైపు జర్మనీ కార్ మేకర్ బీఎండబ్ల్యూ బ్రాండ్ ఎంబాసిడర్‌గా ఉన్న సచిన్ బీఎండబ్ల్యూ7 సిరీస్, ఎం3, ఎం 4 లాంటి లగ్జరీ కార్లను సొంతం చేసుకున్నాడు. ఇపుడు తనువాడే స్పోర్ట్స్‌కారును కొత్త లుక్‌ను జోడించడం విశేషంగా మారింది. ముఖ్యంగా సచిన్ తరచూ వాడే హైబ్రీడ్ స్పోర్ట్స్ కారు ఐ8ను తాజాగా అప్డేట్ చేయించారు. పాపులర్ డీసీ డిజైన్‌తో మరింత స్పోర్టివ్ లుక్‌ను తీసుకొచ్చారు. స్పెషల్ గ్రిల్లే, ముందూ వెనుక కొత్త బంపర్స్, క్వాడ్ ఎగ్సాస్ట్ టిప్స్, పెద్ద బంపర్ పానెల్స్‌తో వైడర్ మోడ్ లుక్‌తో ఆకర్షణీయంగా రూపొందించడం విశేషం. 1.5 లీటర్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఎలక్ట్రిక్ మోటార్, 231 బిహెచ్పీ, 321 ఎన్ఎమ్ టార్క్ ప్రధాన ఫీచర్లుగా ఉండగా 4.4 సెకన్లలో 100 కీ.మీవేగాన్ని అందుకుంటుంది. ధర రూ. 2.62 కోట్లు (ఎక్స్ షో రూం ఢిల్లీ) -
పూణే బాలుడి వినూత్న ఆవిష్కరణ
పూణే : మహారాష్ట్రలోని పూణేకు చెందిన 12 సంవత్సరాల బాలుడు వినూత్న ఆవిష్కరణతో ఔరా అనిపించాడు. సముద్రంలో కాలుష్యాన్ని తగ్గించి, సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు ఎర్విస్ పేరుతో నౌకను రూపొందించిన బాలుడు హజీక్ ఖాజీ అందరి మన్ననలూ అందుకున్నాడు. తాను పలు డాక్యుమెంటరీలు చూసి సముద్ర జీవజాలంపై వ్యర్ధాల ప్రభావాన్ని అర్ధం చేసుకున్నానని, దీనికోసం ఏదైనా తలపెట్టాలని నిర్ణయించుకున్నానని ఖాజీ చెబుతాడు. ఆహారంలో మనం తీసుకునే చేప సముద్రంలోని ప్లాస్టిక్‌ను తింటుండటంతో మానవులపైనా ఈ ప్రభావం పడుతుందని, అందుకే తాను ఎర్విస్‌ను డిజైన్ చేశానని చెప్పుకొచ్చాడు. ఖాజీ రూపొందించిన ఈ నౌక సముద్ర జలాల్లో వ్యర్ధాలను వేరు చేసి శుద్ధ జలాలు, జీవజాలాన్ని సముద్రంలోకి తిరిగి పంపుతుంది, వ్యర్ధాలను ఐదు భాగాలుగా విడగొడుతుంది. టెడ్ఎక్స్, టెడ్ 8 వంటి పలు అంతర్జాతీయ వేదికలపై ఈ నౌక డిజైన్‌ను ఖాజీ ప్రపంచం ముందుంచగా పలువురు అంతర్జాతీయ మేథావులు, సంస్ధలు అతడి ప్రతిభకు అబ్బురపడ్డాయి. ఇక ఎర్విస్ నౌక కింది భాగంలో ఉండే మెషీన్ సముద్రంలోని ప్లాస్టిక్‌ను సంగ్రహించి దాని పరిమాణం ఆధారంగా దాన్ని విడగొడుతుంది. సముద్ర జీవజాలాన్ని పరిరక్షిస్తూ, వ్యర్ధాలను ఏరివేస్తూ సముద్రం నలుచెరుగులా ఈ నౌక సంచరిస్తుంది. సముద్రంలో ప్లాస్టిక్ కాలుష్యం వల్ల జరిగే అనర్దాలు, ముప్పుపై ఖాజీ ప్రస్తుతం పలు రంగాలకు చెందిన వ్యక్తులు, సంస్ధలతో కలిసి పనిచేస్తున్నారు. సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు పూనుకున్న పన్నెండేళ్ల బాలుడు హజీక్ ఖాజీకి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. -
బైక్ కాదు సైకిలే
చక్రాలు చూస్తే బైక్ ... ఆకారం పరిశీలిస్తే సైకిల్...ఇది చైనా తయారీ. చైనా దేశానికి చెందిన షినానో కంపెనీ తయారు చేసిన ఈ బైక్ లాంటి సైకిల్ పలువుర్ని ఆకట్టుకుంటోంది. యానాంలోని మావుళ్లమ్మ గిఫ్ట్స్ షాప్ అధినేత మహేష్ ఈ సైకిల్‌ను సుంకరపాలెం వేసుకురాగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. సుమారు రూ.20 వేలు ఖరీదు చేసే ఈ సైకిల్‌ను రాజమహేంద్రవరానికి చెందినఓ స్నేహితుడు చైనా నుంచి రప్పించాడని సైకిల్ యజమాని మహేష్ తెలిపారు. మోటారు సైకిల్ మాదిరిగానే దీనికి కూడా ఐదు గేర్లు ఉన్నాయని, చూసేందుకు భారీగా కనిపిస్తున్నా రన్నింగ్‌లో ఎంతో సౌకర్యవంతంగా ఉందని ఆయన తెలిపారు. – తాళ్లరేవు -
ప్యాంట్ స్కర్ట్
న్యూలుక్ స్కర్ట్ తెలుసు. ప్యాంట్ హవా ఎరిగిందే! మరి, ప్యాంట్ స్కర్ట్ ఏంటనుకుంటున్నారా! న్యూలుక్‌తో కలర్ఫుల్గా కనిపించాలంటే ప్యాంట్‌ను + స్కర్ట్‌ను కలిపేస్తే.. ఇదిగో ఇలా ఈ కొత్త డిజైన్ మీ ముందు ఉంటుంది. డెనిమ్ ప్యాంట్ పై భాగాన్ని కత్తిరించాలి. స్కర్ట్ నడుము భాగంలోని కుట్లు విప్పదీసి ప్యాంట్‌కి జత చేయాలి. పిల్లల స్కర్ట్లు పొట్టివైనా, టీనేజ్ అమ్మాయిల ఫ్యాన్సీ డ్రెస్ కైనా ఇలాంటి ఐడియా బాగా నప్పుతుంది. లాంగ్ లెహెంగా: రంగు రంగు క్లాత్ ముక్కలను ప్యాచ్‌లుగా తీసుకొని, స్కర్ట్ మోడల్ కుట్టాలి. దీనికి నడుము భాగంలో ప్యాట్ పై భాగానికి జత చేయాలి. ఈ ప్యాంట్ స్కర్ట్ క్యాజువల్వేర్కి బాగా నప్పుతుంది. చూసినవారు ‘నీ జీనూ స్కర్టు చూసి బుల్లమ్మో..’ అని పాడుకోవాల్సిందే! నెటెడ్తో: సెల్ఫ్ ప్రింట్లు ఉన్న నెటెడ్ మెటీరియల్ స్కర్ట్‌కి పై భాగాన డెనిమ్ ప్యాంట్‌ను జత చేస్తే ఇలా అందమైన స్కర్ట్ రూపుదిద్దుకుంటుంది. -
రాజన్న క్షేత్రానికి సరికొత్త కళ
♦ యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి ♦ నమూనాలు సిద్ధం.. త్వరలో సీఎం పరిశీలన ♦ శృంగేరీ పీఠాధిపతి ఆమోదం తర్వాత పనులు ♦ కొత్త డిజైన్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: యాదాద్రి ఆల యాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న తరహాలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని రూపుదిద్దడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆలయ అభివృద్ధి నమూనాలు కూడా సిద్ధమయ్యాయి. ఆర్కిటెక్ట్‌లు రూపొం దించిన ఈ నమూనాలను సోమవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. వీటిని త్వరలోనే ముఖ్యమంత్రికి చూపించి ఆయన చేసే సూచనల ఆధారంగా మార్పు చేర్పులు చేయనున్నారు. అనంతరం శృంగేరీ పీఠాధిపతికి చూపించనున్నారు. పీఠాధిపతి సూచించే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుని తుది నమూనాలు సిద్ధం చేయనున్నట్టు ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. రెండో ప్రాకార మండపం, ఆలయ రాజగోపురం, నిత్యకల్యాణ మండపాలను ఎలా తీర్చిదిద్దనున్నారో ఈ నమూనాల ద్వారా ఆర్కిటెక్ట్‌లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వివరించారు. ఈ సమావేశంలో మంత్రి వెంట వేములవాడ ఎమ్మెల్యే రమేశ్, దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్, వేములవాడ అథారిటీ వైస్ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, ఆలయ ఈవో రాజేశ్వర్, స్థపతి వల్లినాయగం, విజువల్ ఆర్కిటెక్ట్ నాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.