సాక్షి, ముంబై: కరోనా వైరస్ రెండో దశలో ప్రజలు వణించింది. ముఖ్యంగా కేసుల ఉధృతి ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో ఆక్సిజన్ కొరతతో చాలామంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పుణేకు చెందిన ఒక ఇంజనీరింగ్ సంస్థ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లకోసం ఒక కొత్త డిజైన్‌ను అభివృద్ధి చేసింది. కరోనావైరస్ బాధితులకు ఉపయోపడేలా డూ-ఇట్-యువర్ సెల్ఫ్( డీఐవై) అనే డిజైన్‌ను రూపొందించింది.
భారతీయ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని తయారు చేశామని అనాశ్వర్ టెక్నాలజీస్ డైరెక్టర్ కరణ్ తారాడే ప్రకటించారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ భారతదేశంలో, భారతీయుల కోసం భారతీయులచే అభివృద్ధి చేసినట్టు చెప్పుకొచ్చారు. డిజైన్‌ను సరళంగా, సాధ్యమైనంత చౌక ధరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కంపెనీ ఇంజనీర్లు ఇంటర్నెట్‌లో 'ఆక్సికిట్' ద్వారా గాలి నుంచి ఆక్సిజన్ సేకరిస్తున్న తీరు బాగా ఉన్నప్పటికీ ఓపెన్ సోర్స్‌లో, స్వల్పంగా మార్పులతో దీన్నితయారు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం 1970 లలో కనుగొన్న విదేశీ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్‌లను చాలా కుటుంబాలు వినియోగిస్తున్నాయని తారాడే చెప్పారు. అలాగే కరోనా మూలంగా దాదాపు ప్రతీ పౌరుడు ప్రభావితమవుతున్నారు. అందుకే తమ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతిఒక్కరికీ అందుబాలోకి ఉండాలని బావిస్తున్నామని తరాడే చెప్పారు. ఆక్సిజన్ ఎనలైజర్‌ను కూడా తయారు చేశాం కానీ చాలా ఖరీదైంది కావడంతో కాలామందికి అందుబాటులో లేదన్నారు.
ఈ డిజైన్‌ను యూట్యూబ్ వీడియోలు, గితుబ్రిపోజిటరీ ఉపయోగించి అభివృద్ధి చేశామని తెలిపారు. 'ఆక్సికిట్' టెక్నాలజీలో భారతీయ అవసరాలనకనునుగుణంగా మార్పులతో తీర్చిదిద్దామన్నారు. ముఖ్యంగా నిమిషానికి 15 లీటర్ల (ఎల్‌పిఎం)ఆక్సిజన్ కోసం 'డూ ఇట్ యువర్ సెల్ఫ్' డిజైన్‌ను అభివృద్ధి చేశామనీ, 90 శాతానికి పైగా స్వచ్ఛతను అందించే 20 ఎల్‌పిఎం మోడల్‌పై కూడా పని చేస్తున్నామన్నారు. అంతేకాదు వీటిపై ప్రాథమిక పరిజ్ఞానంతో ఎవరైనా దీన్ని చేయగలుగుతారని కూడా ఆయన చెప్పారు. మెకానికల్ ఇంజనీర్ అయిన తారాడే తన అల్ట్రా-పోర్టబుల్ వాటర్ క్రిమిసంహారక వ్యవస్థ ప్రాజెక్ట్ కోసం 2018 లో నీతి అయోగ్ 'స్మార్ట్ ఇండియా హాకథాన్'లో మొదటి బహుమతిని గెలుచుకోవడం విశేషం.
చదవండి: యూపీలో దారుణం: ఆక్సిజన్ నిలిపివేసి మాక్ డ్రిల్
Samsung స్మార్ట్‌టీవీ: అద్భుత ఫీచర్లు
Comments
Please login to add a commentAdd a comment