ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో మరో సంచలనానికి తెర లేపేందుకు అథర్ సంస్థ సిద్ధమైంది. జనాలు మరింత చేరువయ్యేందుకు వీలుగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మార్కెట్‌లోకిత తెచ్చేందుకు సన్నహకాలు చేస్తోంది. అన్ని అనుకూలిస్తే మరో రెండేళ్లలోపు అందుబాటు ధరలో ఈ స్కూటర్ మార్కెట్‌లోకి రానుంది.
ముందే వచ్చినా
ఇండియాలో ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లను భారీ ఎత్తున మార్కెట్‌లోకి తెచ్చిన సంస్థగా అథర్ రికార్డు సృష్టించింది. అయితే ఆ తర్వాత మార్కెట్‌లోకి వచ్చిన ఓలా , సింపుల్‌వన్ స్కూటర్లను ఓ రకంగా ఆర్థర్‌ని వెనక్కి నెట్టేశాయి. ఆకట్టుకునే ఫీచర్లు, ప్రీ బుకింగ్స్‌తో ఓలా అయితే ఓ రేంజ్‌లో దేశవ్యాప్తంగా హడావుడి సృష్టించింది. ఓలా వెంటనే మార్కెట్‌లోకి వచ్చిన సింపుల్ వన్ సైతం తక్కువ సమయంలో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది.
ఆర్థర్ కొత్త రూటు
మార్కెట్‌లోకి ముందే వచ్చినా పరిస్థితులు అనుకూలించని కారణంగా ఆర్థర్ బైకుల ఆమ్మకాలు ఓ స్థాయిలోనే జరిగాయి. కానీ ఓలా, సింపుల్‌వన్ ప్రారంభమే ఘనంగా మొదలైంది. దీంతో ఆ రెండు కంపెనీలను పోటీ ఇవ్వడంతో పాటు మార్కెట్‌లో పట్టు పెంచుకునేందుకు ఆర్థర్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఆప్షన్లతో ఓలా, సింపుల్‌వన్‌తో పోటీ పడుతూనే ధర విషయంలో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది.
లక్ష రూపాయల లోపు
ఓలా, సింపుల్ వన్ స్కూటర్లలో ఆప్షన్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నా వాటి ధర లక్షకు పైగా ఇంచుమించు ఆన్‌రోడ్ ధర లక్షన్నరకు దగ్గరగా వస్తోంది. దీంతో ఈ స్కూటర్లు సొంతం చేసుకుందామని ఊవ్విళ్లూరిన వారు ధర విన్నాక పునరాలోచనలో పడ్డారు. ఇలాంటి వారిని ఆకట్టుకునేందుకు త్వరలో లక్ష రూపాయల ధర లోపే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మార్కెట్‌లోకి తేబోతున్నట్టు అథర్ బిజినెస్ చీఫ్ రవ్‌నీత్ పోకేలా కామెంట్ చేశారు.
ఆర్థర్ 450 కంటే తక్కువ ధరలో
అథర్ నుంచి అనేక మోడళ్లు అందుబాటులో ఉన్నా ఇందులో అన్నింటికంటే తక్కువ ధర 1.13 లక్ష (షోరూం, ఢిల్లీ)లకు 450 ప్లస్ స్కూటర్ లభిస్తోంది. త్వరలో డిజైన్ చేయయబోయే స్కూటర్ ధరను కచ్చితంగా ప్లస్ కంటే తక్కువ ధరకే తేవాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే స్కూటర్ డిజైన్ పనులు ప్రారంభించింది. మరో ఏడాదిలోగా ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తెస్తామంటూ అథర్ ప్రతినిధులు తెలిపారు.
చదవండి : ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్!
Comments
Please login to add a commentAdd a comment