వెబ్‌డెస్క్: రోడ్లపై నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గాలిలో ప్రయాణించే కార్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు, ఆకాశంలో నడిచేలా కార్ల డిజైన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.
ఎయిర్ ట్యాక్సీలు
ఎయిర్ ట్యాక్సీల తయారీ విషయంలో ఇప్పటికే పలు కంపెనీలు విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించాయి. అయితే కమర్షియల్ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ అమితాసక్తితో ఉంది. 2030 నాటికి గాలిలో ఎగిరే కార్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తామనే నమ్మకం ఉందంటూ హ్యుందాయ్ యూరోపియన్ ఆపరేషన్స్ సీఈవో మైఖేల్ కోలే తెలిపారు.
4 సీట్ కెపాసిటీ
భవిష్యత్తులో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఎయిర్ ట్యాక్సీలే మేలైన మార్గం. అందుకే నలుగురు నుంచి ఐదుగురు ప్రయాణించే కెపాసిటీతో ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నట్టు హ్యుందాయ్ తెలిపింది. పూర్తిగా బ్యాటరీతో నడిచేలా ఎయిర్ ట్యాక్సీని డిజైన్ చేస్తోంది హ్యుందాయ్. ఎయిర్ట్యాక్సీల విషయంలో ఇప్పటికే పలు కంపెనీల ప్రోటోటైప్ విజయవంతం అయ్యాయి. కమర్షియల్ తయారీపై ఆయా కంపెనీలు కూడా దృష్టి సారించాయి.
టూ ఇన్ వన్
సాధారణంగా ఎయిర్ పోర్టు వరకు కారులో వెళ్లి అక్కడి నుంచి తిరిగి విమానం ఎక్కి ప్రయాణం చేస్తుంటాం. అయితే ఎయిర్‌ట్యాక్సీలు ఈ రెండు పనులు చేసేలా ప్రస్తుతం డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. రోడ్డుపై నడిచేలా, గాలిలో ఎగిరేలా ఈ ఎయిర్‌ట్యాక్సీని డిజైన్ చేస్తున్నారు. ఎయిర్ ట్రావెల్ ముగిసిన తర్వాత రెక్కలు, ఇతర భాగాలు అన్ని ముడుచుకుని కారులాగా మారి పోతుంది ఈ ఎయిర్ ట్యాక్సీ. రోడ్డుపై ప్రయాణించేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
ప్రత్యేక ఎయిర్‌పోర్టులు
ఎయిర్‌ట్యాక్సీల్లో కొన్ని ఎటవాలుగా ల్యాండింగ్, టేకాఫ్ తీసుకుంటుండగా హ్యుందాయ్ మాత్రం నిట్టనిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ తీసుకునే డిజైన్‌పై దృష్టి సారించింది. ఎయిర్ ట్యాక్సీలు తిరిగేందుకు వీలుగా యూకేలో ప్రత్యేక ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్లో హ్యుందాయ్ తలమునకలై ఉంది. ఈ ఎయిర్‌పోర్టులో దిగే విమానాలు ఏటవాలుగా కాకుండా నిట్టనిలువగా పైకి ఎరగడం, దిగేలా ఈ ఎయిర్‌పోర్టును డిజైన్ చేస్తున్నారు. . అర్బన్ ఎయిర్ మొబిలిటీపై 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు హ్యుందాయ్ సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment