Air taxi service
-
భారత్‌లో మొదటి ఎయిర్ ట్యాక్సీ 'శూన్య': దీని గురించి తెలుసా?
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'సరళా ఏవియేషన్' భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో2025లో తన ప్రోటోటైప్ ఎయిర్ ట్యాక్సీ 'శూన్య'ను ఆవిష్కరించింది. కంపెనీ దీనిని 2028 నాటికి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.శూన్యా ఎయిర్ ట్యాక్సీ.. 20 కిమీ నుంచి 30 కిమీ దూరాల ప్రయాణాలు కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. 680 కేజీలు బరువు మోయగల ఈ ఎయిర్ టాక్సీలో ఆరుగురు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లో అత్యధిక పేలోడ్ మోయగల కెపాసిటీ ఉన్న ఎయిర్ టాక్సీగా రికార్డ్ క్రియేట్ చేయనుంది. అయితే కంపెనీ దీనికి సంబంధించిన ధరలను అధికారికంగా వెల్లడించలేదు.శూన్య ఎయిర్ ట్యాక్సీ.. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా గమ్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ రద్దీ నుంచి ప్రయాణికులను వేగంగా గమ్యస్థానానికి చేర్చడానికి మాత్రమే కాకుండా.. కాలుష్యం వంటి సవాళ్లను పరిష్కరించడానికి కూడా సహరిస్తుందని సరళ ఏవియేషన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ 'అడ్రియన్ ష్మిత్' పేర్కొన్నారు.సరళ ఏవియేషన్‌ను.. అడ్రియన్ ష్మిత్, రాకేష్ గాంకర్, శివమ్ చౌహాన్ అనే ముగ్గురు అక్టోబర్ 2023లో స్థాపించారు. ఈ స్టార్టప్ ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్, జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ భాగస్వామ్యంతో Accel నేతృత్వంలోని సిరీస్ A ఫండింగ్‌లో 10 మిలియన్లను సేకరించింది. కాబట్టి ఈ కంపెనీ త్వరలోనే తన సేవలను ప్రారంభించే అవకాశం ఉంది.సరళ ఏవియేషన్‌ను కంపెనీ తన ఎయిర్ ట్యాక్సీ సర్వీసులను.. బెంగళూరులో ప్రారంభించిన తర్వాత ముంబై, ఢిల్లీ, పూణె సహా ఇతర నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. ప్రయాణీకుల రవాణాతో పాటు, పట్టణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య అవసరాలను తీర్చడానికి ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవను ప్రారంభించాలని సరళ ఏవియేషన్ యోచిస్తున్నట్లు సమాచారం.ఎయిర్ ట్యాక్సీల అభివృద్ధికి కేంద్రంనగరాలు అభివృద్ధి చెందుతున్నాయి, ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిపోయింది. రోజువారీ ట్రాఫిక్ ఎలా ఉన్నా.. వర్షాకాలంలో మాత్రం ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నరకం కనిపిస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని కంపెనీలు గత కొంత కాలంగా ఎయిర్ టాక్సీలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది.ఇదీ చదవండి: అంబానీని మించిన దానగుణం: ఒక్క రోజులో రూ. 46వేలకోట్ల నష్టంభారతదేశంలో ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడానికి, రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి.. ఇండియా ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అనేక సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ 2026 నాటికి ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగుళూరు వంటి ప్రధాన పట్టణ కేంద్రాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం.ప్రయాణ ఖర్చు తక్కువే..ఇండిగో పేరెంట్ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (IGE) అమెరికన్ ఎయిర్ టాక్సీ తయారీదారు 'ఆర్చర్ ఏవియేషన్'తో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే పనిని ప్రారంభించింది. ఎయిర్ టాక్సీ అందుబాటులో వచ్చిన తరువాత.. ఇందులో ప్రయాణించడానికి ప్రయాణికుడికి అయ్యే ఖర్చు ఉబర్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. -
దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధం
దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఏరియల్ ట్యాక్సీలు నడిచేందుకు వీలుగా ‘వెర్టిపోర్ట్’(ఎయిర్ టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే ప్రదేశం)లను ఏర్పాటు చేసేందుకు అక్కడి స్థానిక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అంగీకారం తెలిపారు. దాంతో దుబాయ్ మొదటిసారి అర్బన్ ఏరియల్ ట్రాన్స్పోర్ట్ సేవలందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది.3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే వెర్టిపోర్ట్‌లో టేకాఫ్, ల్యాండింగ్ జోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, టాక్సీ పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేయనున్నారు. ఏటా సుమారు 1,70,000 మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ప్రపంచ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఎయిర్ కండిషన్డ్ వెర్టిపోర్ట్లను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ కంపెనీల సహకారం తీసుకోనున్నారు. జాబీ ఏవియేషన్, సైపోర్ట్ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌కు తమ సేవలందించనున్నాయి. జాబీ ఏవియేషన్ విమానాల తయారీ, కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. స్కైపోర్ట్ మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్వహణను పర్యవేక్షిస్తుంది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) కొత్త ప్రాజెక్ట్‌ను ప్రస్తుత రవాణా వ్యవస్థలతో అనుసంధానిస్తుంది. ఈ ఎయిర్‌ట్యాక్సీ సర్వీసులను 2026 ప్రారంభంలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులుజాబీ ఏవియేషన్ తయారు చేసిన ఏరియల్ టాక్సీ ఎస్4 మోడల్ సున్నా ఉద్గారాలతో పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనంగా ప్రసిద్ధి చెందింది. అది నిలువుగా టేకాఫ్, ల్యాండ్ అవ్వగలదు. దీని గరిష్ట వేగం 321 కిమీ/గం. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 160 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఎస్4 ఒక పైలట్, నలుగురు ప్రయాణీకులను తీసుకువెళ్లగలదు. సంప్రదాయ హెలికాప్టర్ల కంటే చాలా తక్కువ శబ్దం చేస్తూ ప్రయాణిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆర్టీఏ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జీసీఏఏ), దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (డీసీఏఏ), స్కైపోర్ట్, జాబీ ఏవియేషన్‌లు ఏరియల్ టాక్సీ సేవలకు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
దేశంలోకి ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్..ఛార్జీలు ఎంతో తెలుసా..?
-
గాల్లో తేలుతూ గమ్యస్థానానికి.. ఇక ట్రాఫిక్ గురించి భయమేల?
నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి, ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. రోజువారీ ట్రాఫిక్ ఎలా ఉన్నా.. వర్షాకాలంలో మాత్రం ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నరకం కనిపిస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని కంపెనీలు గత కొంత కాలంగా ఎయిర్ టాక్సీలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది.సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే.. విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త ప్రాజెక్ట్‌పై ప్రయత్నాలను ప్రారంభించింది. భారతదేశంలో ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడానికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి భారతదేశపు ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అనేక సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ 2026 నాటికి ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగుళూరు వంటి ప్రధాన పట్టణ కేంద్రాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం.ఇండిగో పేరెంట్ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (IGE) అమెరికన్ ఎయిర్ టాక్సీ తయారీదారు ఆర్చర్ ఏవియేషన్‌తో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే పనిని ప్రారంభించింది. ఎయిర్ టాక్సీ అందుబాటులో వచ్చిన తరువాత.. ఇందులో ప్రయాణించడానికి ప్రయాణికుడికి అయ్యే ఖర్చు ఉబర్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.2026 నాటికి భారతదేశంలో ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి రానున్నాయని ఆర్చర్ సీసీఓ నిఖిల్ గోయెల్ వెల్లడించారు. దీని కోసమే ఆర్చర్‌కు చెందిన ఒక బృందం ఇటీవల భారతదేశంలోని విమానయాన అధికారులను కలిసింది.భారతదేశంలోని ప్రధాన నగరాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. దీంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రయాణికులు వేగంగా గమ్యం చేరుకోవచ్చు.ఎయిర్ టాక్సీ ధరలు..ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్ళడానికి ఉబర్ ఛార్జ్ రూ. 1500 నుంచి రూ. 2000. అయితే ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్ళడానికి సుమారు రూ. 2000 నుంచి రూ. 3000 వెచ్చించాల్సి ఉంటుందని ఐజీఈ చీఫ్ రాహుల్ భాటియా పేర్కొన్నారు. ఖచ్చితమైన ధరలు ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వచ్చిన తరువాత వెల్లడవుతాయి.ప్రయాణ సమయం తగ్గుతుంది..ఒకసారి భారతదేశంలో ఎయిర్ టాక్సీ సర్వీస్ ప్రారంభమైతే.. ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీలోని కన్నాట్ నుంచి గురుగ్రామ్ చేరుకోవడానికి 27 కిలోమీటర్లు 90 నిముషాలు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే ఈ దూరాన్ని ఎయిర్ టాక్సీ ద్వారా 7 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలుస్తోంది.ఒకసారికి నలుగురు మాత్రమే..ఎయిర్ టాక్సీలు పూర్తిగా ఎలక్ట్రిక్.. వీటిని ఫుల్ ఛార్జ్ చేయడానికి కేవలం 30 నుంచి 40 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. చూడటానికి ఇవి హెలికాప్టర్ల మాదిరిగా ఉన్నప్పటికీ చాలా నిశ్శబ్దంగా ప్రయాణిస్తాయి. ఎయిర్ టాక్సీలో ఒకసారికి నలుగురు మాత్రమే ప్రయాణించవచ్చు.ఇదీ చదవండి: పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు ఎయిర్ టాక్సీల వల్ల ఉపయోగాలుట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో ఎయిర్ టాక్సీ అవసరం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అత్యవసర సమయాల్లో వైద్యశాలకు వెళ్లాలన్నా.. సరైన సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాలన్నా.. ఎయిర్ టాక్సీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఈ రోజు సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రముఖులు దగ్గర వద్దకు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కుంటున్నారు. ట్రాఫిక్ కారణంగా చాలా మంది ప్రముఖులు మెట్రోలో ప్రయాణించిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి ఎయిర్ టాక్సీ నేడు చాలా అవసరం. -
త్వరలోనే ఎగిరే ట్యాక్సీ.. అదీ మన హైదరాబాద్‌లోనే..!
-
ఎయిర్ ట్యాక్సీ...రూ.12కే విమాన ప్రయాణం..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కిలోమీటరుకు రూ.12 చార్జీ. అదీ ఎయిర్ ట్యాక్సీలో. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్–ఆఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటోల్) ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో ఇది సాధ్యమని జెట్ సెట్ గో చెబుతోంది. అద్దెకు ప్రైవేట్ విమానాలను నడుపుతున్న ఈ సంస్థ ఈవీటోల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ద్వారా ఎయిర్ ట్యాక్సీ రంగంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం రెండు తయారీ సంస్థలతో మాట్లాడుతున్నామని జెట్ సెట్ గో ఏవియేషన్ సర్వీసెస్ ఫౌండర్ కనిక టేక్రివాల్ రెడ్డి వెల్లడించారు. తొలుత హైదరాబాద్, ఆ తర్వాత ముంబై, బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీ సేవలు పరిచయం చేస్తామన్నారు. బేగంపేట విమానాశ్రయంలో గురువారం ప్రారంభమైన వింగ్స్ ఇండియా–2022 సందర్భంగా ఆమె సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ఎయిర్ ట్యాక్సీ, కంపెనీ, పరిశ్రమ గురించి ఆమె మాటల్లో.. మూడేళ్లలో సాకారం.. ప్రపంచవ్యాప్తంగా 12 సంస్థలు ఈవీటోల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ తయారీలో ఉన్నాయి. వీటిని నడపడానికి పైలట్ అవసరం లేదు. పైకి లేచినప్పుడు, కిందకు దిగేప్పుడు నిటారుగా ప్రయాణిస్తాయి. ల్యాండింగ్, టేకాఫ్ కోసం ల్యాండింగ్ ప్యాడ్స్ అవసరం. ఒక్కో ట్యాక్సీలో నలుగురు ప్రయాణించవచ్చు. ఒకసారి చార్జింగ్‌తో 40 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. కిలోమీటరుకు అయ్యే చార్జీ రూ.12 మాత్రమే. ఈవీటోల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఖరీదు సుమారు రూ.23 లక్షలు ఉంటుంది. ఎయిర్ ట్యాక్సీ సేవలను మూడేళ్లలో సాకారం చేస్తాం. ల్యాండింగ్ ప్యాడ్ 8 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు ఉంటే చాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం. తొలి దశలో ఈ ప్రాజెక్టు కోసం రూ.1,900 కోట్లు ఖర్చు చేస్తాం. ఏవియేషన్ సెంటర్.. ప్రైవేట్ రంగంలో దేశంలో తొలి ఏవియేషన్ సెంటర్ హైదరాబాద్‌లో రూ.30 కోట్ల ఖర్చుతో మే నాటికి ఏర్పాటు చేస్తున్నాం. ప్రైవేట్ జెట్స్ పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను ఈ కేంద్రం అందిస్తుంది. ప్రస్తుతం జెట్ సెట్ గో వద్ద 22 జెట్స్, 2 హెలికాప్టర్స్ ఉన్నాయి. 80 మంది పైలట్లు ఉన్నా రు. కొత్తగా ఈ ఏడాది నాలుగు జెట్స్, ఒక హెలికాప్టర్ జతకూడనున్నాయి. అద్దె గంటకు రూ.1.3 లక్షల నుంచి ప్రారంభం. 120 దేశాల్లోని 600లకుపైగా విమానాశ్రయాల్లో అడుగుపెట్టాం. రోజుకు సగటున 75 ల్యాండింగ్స్ నమోదు చేస్తున్నాం. రెండు నెలల్లో రూ.1,520 కోట్లు సమీకరిస్తున్నాం. తొలి స్థానంలో హైదరాబాద్.. ప్రైవేట్ జెట్స్ రాకపోకల విషయంలో దేశంలో భాగ్యనగరి తొలి స్థానంలో ఉంది. బేగంపేట విమానాశ్రయంలో కోవిడ్‌కు ముందు సగటున రోజుకు 2–3 ప్రైవేట్ జెట్స్ ల్యాండ్ అయ్యేవి. ఇప్పుడు 15 అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 250. భారత్‌లో ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీల వద్ద 95 జెట్స్, హెలికాప్టర్స్ ఉన్నాయి. వీటిలో 7 తెలుగు రాష్ట్రాల వారివి. మా కంపెనీకి తెలంగాణ ప్రధాన మార్కెట్. విమానాలను పక్షులు ఢీకొట్టిన సంఘటనలు హైదరాబాద్‌లో నెలకు 15 వరకు ఉండగా, దేశవ్యాప్తంగా ఈ సంఖ్య నెలకు 1–2 మాత్రమే. రిపేర్‌కు రూ.15–23 కోట్ల ఖర్చు అవుతుంది. -
Flying Cars: ఆకాశంలో నడిచే కార్లు.. వచ్చేది ఎప్పుడంటే ?
వెబ్‌డెస్క్: రోడ్లపై నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గాలిలో ప్రయాణించే కార్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు, ఆకాశంలో నడిచేలా కార్ల డిజైన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఎయిర్ ట్యాక్సీలు ఎయిర్ ట్యాక్సీల తయారీ విషయంలో ఇప్పటికే పలు కంపెనీలు విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించాయి. అయితే కమర్షియల్ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ అమితాసక్తితో ఉంది. 2030 నాటికి గాలిలో ఎగిరే కార్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తామనే నమ్మకం ఉందంటూ హ్యుందాయ్ యూరోపియన్ ఆపరేషన్స్ సీఈవో మైఖేల్ కోలే తెలిపారు. 4 సీట్ కెపాసిటీ భవిష్యత్తులో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఎయిర్ ట్యాక్సీలే మేలైన మార్గం. అందుకే నలుగురు నుంచి ఐదుగురు ప్రయాణించే కెపాసిటీతో ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నట్టు హ్యుందాయ్ తెలిపింది. పూర్తిగా బ్యాటరీతో నడిచేలా ఎయిర్ ట్యాక్సీని డిజైన్ చేస్తోంది హ్యుందాయ్. ఎయిర్ట్యాక్సీల విషయంలో ఇప్పటికే పలు కంపెనీల ప్రోటోటైప్ విజయవంతం అయ్యాయి. కమర్షియల్ తయారీపై ఆయా కంపెనీలు కూడా దృష్టి సారించాయి. టూ ఇన్ వన్ సాధారణంగా ఎయిర్ పోర్టు వరకు కారులో వెళ్లి అక్కడి నుంచి తిరిగి విమానం ఎక్కి ప్రయాణం చేస్తుంటాం. అయితే ఎయిర్‌ట్యాక్సీలు ఈ రెండు పనులు చేసేలా ప్రస్తుతం డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. రోడ్డుపై నడిచేలా, గాలిలో ఎగిరేలా ఈ ఎయిర్‌ట్యాక్సీని డిజైన్ చేస్తున్నారు. ఎయిర్ ట్రావెల్ ముగిసిన తర్వాత రెక్కలు, ఇతర భాగాలు అన్ని ముడుచుకుని కారులాగా మారి పోతుంది ఈ ఎయిర్ ట్యాక్సీ. రోడ్డుపై ప్రయాణించేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రత్యేక ఎయిర్‌పోర్టులు ఎయిర్ట్యాక్సీల్లో కొన్ని ఎటవాలుగా ల్యాండింగ్, టేకాఫ్ తీసుకుంటుండగా హ్యుందాయ్ మాత్రం నిట్టనిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ తీసుకునే డిజైన్‌పై దృష్టి సారించింది. ఎయిర్ ట్యాక్సీలు తిరిగేందుకు వీలుగా యూకేలో ప్రత్యేక ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్లో హ్యుందాయ్ తలమునకలై ఉంది. ఈ ఎయిర్‌పోర్టులో దిగే విమానాలు ఏటవాలుగా కాకుండా నిట్టనిలువగా పైకి ఎరగడం, దిగేలా ఈ ఎయిర్‌పోర్టును డిజైన్ చేస్తున్నారు. . అర్బన్ ఎయిర్ మొబిలిటీపై 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు హ్యుందాయ్ సిద్ధమైంది. -
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది!
ట్రాఫిక్ తలనొప్పులు లేకుండా సరిౖయెన టైమ్‌కు మనల్ని గమ్యస్థానం చేర్చే ఎయిర్ ట్యాక్సీలు రాబోతున్నాయి. ఆకాశమార్గంలో పట్టాలెక్కబోయే ఎయిర్‌ట్యాక్సీ ప్రాజెక్ట్‌లలో ఇండియా నుంచి జర్మనీ వరకు యువత కీలక పాత్ర పోషిస్తుంది. జర్మన్ కంపెనీ ‘వోలోకాప్టర్’ ఎయిర్ట్యాక్సీల ట్రెండ్‌కు మార్గదర్శిగా నిలిచింది. ‘ఏమిటి? ఎయిర్ ట్యాక్సీనా?’ అనే ఆశ్చర్యం ‘అవును ఇది నిజం’ అనే నమ్మకానికి రావడానికి ఎంతోకాలం పట్టలేదు. 2011లో మొదలై రెండు సంవత్సరాలు గడిచేసరికి తొలి 2-సీటర్ ప్రోటోటైప్‌ను రూపొందించారు. ఆ తరువాత రెండు సంవత్సరాలకు లైసెన్స్ వచ్చింది. మరో రెండు సంవత్సరాలకు అయిదు వందల ప్లేన్లు తయారుచేశారు. ‘సేఫ్ అండ్ స్టేబుల్’ కాన్సెప్ట్‌తో అర్బన్ ఎన్విరాన్మెంట్లో ప్యాసింజర్‌ను భద్రంగా గమ్యస్థానానికి ఎలా చేర్చాలి? అధిక శబ్దాలను నియంత్రిస్తూ టేకింగ్ ఆఫ్, ల్యాండింగ్...ఇలా ఎన్నో విషయాలలో జాగ్రత్తలు తీసుకొని, తేలికపాటి బరువుతో ఎయిర్‌ఫ్రేమ్‌లు తయారుచేశారు. గంట నుంచి 5 గంటల వరకు తీసుకునే ఛార్జింగ్ సమయాన్ని సెకండ్లకు పరిమితం చేసి స్మూత్రైడ్కు బాటలు వేశారు. ‘ప్రయోగాలేవో చేస్తున్నాం, మంచి ఫలితాలు వస్తున్నాయి. అయితే అనుమతి లభిస్తుందా? అనే పెద్ద డౌట్ వచ్చింది. కమర్శియల్ ఎయిర్ లైనర్స్లాగే వీటికి అత్యున్నతమైన భద్రతాప్రమాణాలు రూపొందించుకోవడంతో అనుమతి సులభమైంది’ అంటున్నాడు ‘వోలోకాప్టర్’ కోఫౌండర్ అలెగ్జాండర్ లోసెల్. ఎయిర్‌ట్యాక్సీ అయినంత మాత్రానా ధరలు ఆకాశంలో ఉంటాయనుకోనక్కర్లేదు. ధరలు అందుబాటులోనే ఉంటాయట. బ్రిస్టల్(యూకే)కు చెందిన ఫ్లైయింగ్ ట్యాక్సీ సర్వీస్ కంపెనీ ‘వెర్టికల్ ఎరో స్పేస్’ 2016 నుంచే రకరకాల ప్రయోగాలు మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎయిరోస్పేస్ అండ్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌లను ఈ ప్రాజెక్ట్ కోసం వాడుకున్నారు. 800 కీ.మీ దూరం ప్రయాణం చేసే పవర్ఫుల్ మోడల్ సెట్‌ను ఈ కంపెనీ తయారుచేసింది. ‘సిటికీ దూరంగా ఉన్న విమానాశ్రయాలకు వెళ్లడానికే చాలా సమయం వృథా పోతుంది. ఎయిర్ ట్యాక్సీల ద్వారా ఎంతో సమయం ఆదా అవుతుంది’ అంటున్నాడు ‘వెర్టికల్ ఎరో స్పేస్’ ఫౌండర్ స్టీఫెన్ ఫిట్జ్‌పాట్రిక్.రెండు దశబ్దాల కిందటి తన కలను పదకొండు సంవత్సరాలు కష్టపడి నిజం చేసుకున్నాడు కాలిఫోర్నియాకు చెందిన జోబెన్. ‘జోబి ఎవియేషన్’ వ్యవస్థాపకుడైన జోబెన్-‘ ఎయిర్ ట్యాక్సీలతో ఆకాశం కళకళలాడే రోజులు ఎంతో దూరంలో లేవు’ అంటున్నాడు. జోబి ఏవియేషన్‌కు చెందిన రూఫ్ టాప్-టు-రూఫ్ టాప్ ఎయిర్ ట్యాక్సీలు 2023లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మన దగ్గరకు వస్తే... ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ట్యాక్సీలు ఊపందుకుంటున్న దశలో ఇప్పుడు అందరి దృష్టి ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ‘ఇ-ప్లేన్ కంపెనీ’పై పడింది. సీడ్ ఫండింగ్ ఆశాజనకంగా ఉండడంతో వరల్డ్‌క్లాస్ ఇంజనీరింగ్ టీమ్‌ను తయారుచేసుకునే వీలు ఏర్పడుతుంది. ఎరో స్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సత్యనారాయణ చక్రవర్తి ఆయన శిష్యుడు ప్రంజల్ మెహతా మానసపుత్రిక ‘ఇ-ప్లేన్’ కంపెనీ. ఈ 2 సీటర్ ‘ఇ ప్లేన్’కు ‘వెర్టిపోర్ట్స్’ అవసరం లేదు. రూఫ్ టాప్, పార్కింగ్ లాట్స్ నుంచే టేక్ ఆఫ్ చేయవచ్చు. రాబోయే కాలంలో ‘ఎయిర్ ట్యాక్సీ’ల ప్రయోగం విజయవంతం అయితే ‘శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి’ అని కాస్త గట్టిగానే నమ్మవచ్చు. చదవండి: ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా! ట్రాఫిక్ చలానా తగ్గించుకోండిలా! -
గాల్లో ఎగిరే కారు వచ్చేసింది!
కాలుష్యం.. ట్రాఫిక్.. ఈ రెండు చాలు నగర జీవనం ఎంత దుర్భరంగా ఉంటుందో తెలిపేందుకు. అయితే కొన్ని నగరాల్లో వీటి నుంచి మెట్రోరైలు కొంత ఉపశమనం కలిగిస్తుంది. కానీ అంతకు మించిన ఉపశమనాన్ని మనకు అందించేందుకు ఉబర్ సంస్థ మరో ముందడుగు వేసింది. గాల్లో ఎగిరే ట్యాక్సీ కార్లను మన ముందుకు తెచ్చింది. దీన్ని చూసేందుకు హెలికాప్టరో.. కారో కూడా అర్థం కాదు. నలుగురు ఎంచక్కా ఈ కారులో వెళ్లొచ్చు. నార్త్ స్టార్ అనే కంపెనీతో కలసి ఉబర్ ఈ కారును డిజైన్ చేసింది. ఇటీవల అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ఉబర్ ఎలివేట్ సమ్మిట్–2019లో ఈ కారును ప్రదర్శనకు ఉంచింది. అయితే 2020లో తొలుత పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడతామని, 2023 వరకు ఎయిర్ ట్యాక్సీ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనుంది. అతి త్వరలోనే మన దగ్గరికి కూడా రావాలని కోరుకుందాం. -
‘ఉబర్’లో బుక్ చేయగానే ‘ఎయిర్ ట్యాక్సీ’ వచ్చేస్తుంది!
ఎగిరే ట్యాక్సీలు.. అదిగో అప్పుడొచ్చేస్తున్నాయి.. ఇదిగో ఇప్పుడొచ్చేస్తున్నాయి అనే మాటలు తప్ప.. ఎప్పుడన్న దానిపై స్పష్టత లేదు. ఉబర్ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. 2023 సరికి తాము ఉబర్ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. తొలుత అమెరికాలోని లాస్ ఏంజెలిస్, డాలస్లలో ఈ సర్వీసులను ప్రవేశపెడతామని.. తర్వాత మిగతా నగరాలకు విస్తరిస్తామని తెలిపింది. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు ఈ ఎగిరే ట్యాక్సీలే పరిష్కారమని చెబుతున్న ఉబర్..ప్రస్తుతం వాటి కోసం ఐదు కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇంతకీ ఏమిటీ ఉబర్ ఎయిర్..ఎలా ఉండబోతోంది.. వివరాలివిగో.. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలకు విమాన ఇంధనంతో పనిలేదు. ఇవి ఎలక్ట్రిక్‌వి. సింగిల్ చార్జింగ్‌తో 100 కి.మీ దూరం ప్రయాణించగలవు. 5 నిమిషాల్లో మళ్లీ చార్జ్ అయిపోతాయి. అత్యధిక వేగం 320 కి.మీ. ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు. భారీగా కాకున్నా పరిమిత స్థాయిలో లగేజీ పెట్టుకునే సదుపాయం ఉంది. వెయ్యి నుంచి 2 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలవు. ఎత్తైన భవనాలు, షాపింగ్ మాల్స్ వంటివాటిపై ఏర్పాటు చేసే పికప్ పాయింట్ల నుంచి ప్రయాణికులను తీసుకెళ్తాయి. ఇలాంటి తరహాలోనే ఏర్పాటు చేసే డ్రాపింగ్ పాయింట్ల వద్ద దింపుతాయి. నగరం స్థాయిని బట్టి 50 నుంచి 300 ఎగిరే ట్యాక్సీలను అందుబాటులో ఉంచుతారు. తొలుత మాజీ కమర్షియల్ పైలట్లతో వీటిని నడిపిస్తారు. తదనంతర దశలో అదనపు పైలట్లను నియమించుకుని.. శిక్షణ ఇస్తారు. ఎయిర్ ట్యాక్సీ అనేసరికి ఇదేదో డబ్బున్నోళ్ల వ్యవహారమని అనుకునేరు.. ఉబర్ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం అమెరికా తదితర దేశాల్లో మామూలు ఉబర్ ట్యాక్సీలో 40 కి.మీ. ప్రయాణానికి మన కరెన్సీలో రూ.4,200 అవుతుందని అనుకుంటే.. ఉబర్ ఎయిర్‌లో అదే దూరానికి రూ.6,500 అవుతుందట. కొన్నేళ్లలో అమెరికాకు..మరికొన్నేళ్లలో మన వద్దకు.. సూపర్ కదూ.. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
రాజస్థాన్‌లో ఎయిర్ ట్యాక్సీలు
జైపూర్: పర్యాటక ప్రాంతాలకు నెలవైన రాజస్థాన్‌లో ప్రభుత్వ విమానాలు అద్దె ట్యాక్సీల్లా చక్కర్లు కొట్టనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక, వాణిజ్య కేంద్రాలను కలుపుతూ ఎయిర్ ట్యాక్సీ సర్వీసులను ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఈ సర్వీసుల ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపార ని, త్వరలోనే వీటిని ప్రవేశపెడతామని రాష్ట్ర పౌర విమానయాన విభా గం డెరైక్టర్ కిషన్‌సింగ్ వర్మ చెప్పారు. ఐదు, ఏడు సీట్ల సామర్థ్యమున్న రెండు విమానాలను ప్రస్తుతం సీఎం, గవర్నర్, ఇతర వీఐపీల ప్రయాణాలకు వాడుతున్నామని, వీటిని అద్దెకు ఇస్తామని తెలిపారు. ఐదు సీట్ల విమానానికి గంటకు రూ. 50వేలు, ఏడు సీట్ల విమానానికి రూ.70 వేలు వసూలు చేస్తామని, వీటిని బుక్ చేసుకోవాలంటే కనీస ప్రయాణం రెండు గంటలు ఉండాలని వివరించారు. ఈ సర్వీసుల వల్ల పర్యాటక ప్రాంతాల మధ్య దూరం త గ్గుతుందని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పారు.