రాజస్థాన్‌లో ఎయిర్ ట్యాక్సీలు
జైపూర్: పర్యాటక ప్రాంతాలకు నెలవైన రాజస్థాన్‌లో ప్రభుత్వ విమానాలు అద్దె ట్యాక్సీల్లా చక్కర్లు కొట్టనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక, వాణిజ్య కేంద్రాలను కలుపుతూ ఎయిర్ ట్యాక్సీ సర్వీసులను ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఈ సర్వీసుల ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపార ని, త్వరలోనే వీటిని ప్రవేశపెడతామని రాష్ట్ర పౌర విమానయాన విభా గం డెరైక్టర్ కిషన్‌సింగ్ వర్మ చెప్పారు.
ఐదు, ఏడు సీట్ల సామర్థ్యమున్న రెండు విమానాలను ప్రస్తుతం సీఎం, గవర్నర్, ఇతర వీఐపీల ప్రయాణాలకు వాడుతున్నామని, వీటిని అద్దెకు ఇస్తామని తెలిపారు. ఐదు సీట్ల విమానానికి గంటకు రూ. 50వేలు, ఏడు సీట్ల విమానానికి రూ.70 వేలు వసూలు చేస్తామని, వీటిని బుక్ చేసుకోవాలంటే కనీస ప్రయాణం రెండు గంటలు ఉండాలని వివరించారు. ఈ సర్వీసుల వల్ల పర్యాటక ప్రాంతాల మధ్య దూరం త గ్గుతుందని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పారు.