చీరంచు గౌనుకు ముద్దు
పాత మోడల్ పట్టు, లేదంటే పెద్ద పెద్ద అంచులున్న చీరలు కొన్నేళ్లుగా అలాగే ఉంటూ ఉంటాయి. చాలామంది వాటిని పెట్టెల్లో, బీరువా అడుగున చేరుస్తూ ఉంటారు. వాటికి ఇలా కొత్త రూపమిచ్చి, మీ టీనేజ్ అమ్మాయిలను మరింత అందంగా మెరిపించవచ్చు.
⇔ పెద్ద అంచున్న మెటీరియల్‌ను స్కర్ట్ భాగానికి తీసుకొని, బ్లౌజ్‌ను ప్లెయిన్‌గా డిజైన్ చేయాలి. ప్లెయిన్ బ్లౌజ్ మీద ఏదైనా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినా చూడముచ్చటగా ఉంటుంది.
⇔ కేవలం పల్లూ భాగాన్ని తీసుకొని దాంతో స్కర్ట్ భాగాన్ని డిజైన్ చేయాలి. బ్లౌజ్ పార్ట్, స్లీవ్స్‌ని ప్లెయిన్‌గా తీసుకోవాలి. చూడముచ్చటైన స్టైలిష్ ఫ్రాక్ రెడీ.
⇔ చిన్న అంచు ఉన్న ప్లెయిన్ శారీని లాంగ్ కుర్తీ టాప్‌గా మార్చేస్తే చూడముచ్చటగా ఉంటుంది.
⇔ రెండు రకాల చీరల రంగు క్లాత్‌లను తీసుకొని ఇలా పొట్టి గౌన్‌ని సింపుల్‌గా తీర్చిదిద్దవచ్చు.
⇔ చూడగానే ఆకట్టుకునే ఇలాంటి ఫ్రాక్స్‌ని చీరలతో ఎన్నో మోడల్స్‌లో డిజైన్ చేయవచ్చు.