కార్పొరేట్ పాఠశాలల్లో పెట్టే నిబంధనలకు అర్థం పర్థం లేకుండా పోతోంది. ఇంగ్లీషులో మాట్లాడలేదని పంపేయడం లాంటి ఘటనలు ఇంతకుముందు చూశాం. కానీ, పిలక ఉందన్న కారణంగా ఎల్‌కేజీ చదివే పిల్లాడిని స్కూలు నుంచి తొలగించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. సెయింట్ విన్సెంట్ పల్లొంట్టి స్కూల్లో ఎల్‌కేజీ చదువుతున్న మూడున్నరేళ్ల విష్ణును ఇంటికి తీసుకెళ్లేందుకు వాళ్ల తండ్రి మంజునాథ్ స్కూలుకు వచ్చారు. ప్రిన్సిపాల్ పాల్ డిసౌజా ఆయనను పిలిపించి, పిల్లల్ని ఇలా పిలకతో పంపకూడదని.. పిలక కట్ చేస్తేనే అతన్ని పాఠశాలలో కొనసాగనిస్తామని చెప్పారు.
బాబుకు ఐదేళ్లు వచ్చేవరకు తల వెంట్రుకలు తీయరాదని, ఇది తమ కుటుంబ ఆచారమని మంజునాథ్ ప్రిన్సిపల్‌కు తెలిపారు. అయితే అలాంటి మూఢనమ్మకాలను తాము అంగీకరించబోమని ప్రిన్సిపల్ మొండిగా మాట్లాడి పిల్లాడిని పాఠశాల నుంచి పంపేశారు. అడ్మిషన్ సమయంలో తాను చెల్లించిన డొనేషన్ తిరిగి ఇచ్చారని మంజునాథ్ తెలిపారు. అయితే.. ఇప్పటికే అన్ని స్కూల్లోల అడ్మిషన్లు పూర్తయిపోయాయని, ఇక తమ పిల్లాడిని వచ్చే విద్యాసంవత్సరంలోనే స్కూలుకు పంపాల్సి ఉంటుందని మంజునాథ్ తెలిపారు. ఈ విషయంపై తమకు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని, వస్తే పాఠశాలపై చర్య తీసుకుంటామని ప్రాథమిక విద్య డైరెక్టర్ కె.ఆనంద్ తెలిపారు.
పిలక ఉందని ఎల్‌కేజీ విద్యార్ధికి ఉద్వాసన
Published Sat, Jun 11 2016 2:54 PM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM
Advertisement