లఖ్‌నవూ: పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యేపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్. పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. రాంపుర్ సదర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే నవాబ్ కాజిమ్ అలి ఖాన్‌పై వేటు వేసినట్లు యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ తెలిపారు.
‘రాంపుర్ బైపోల్‌లో బీజేపీ అభ్యర్థికి మీరు మద్దతుగా నిలిచినట్లు క్రమశిక్షణ కమిటీ దృష్టికి వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా మిమ్మల్ని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నాం.’అని పేర్కొన్న లేఖను మాజీ ఎమ్మెల్యే నవాజ్ కాజిమ్ అలి ఖాన్‌కు పంపించారు క్రమశిక్షణ కమిటీ సభ్యులు శ్యామ్ కిషోర్ శుక్లా.
సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజాం ఖాన్ శాసనసభ్యత్వం రద్దయిన క్రమంలో.. రాంపుర్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప అనివార్యమైంది. ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాంపుర్ సదర్ నియోజకవర్గంలో పోటీ చేసిన ఖాన్.. ఓడిపోయారు. 2016లో రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే కారణంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.
ఇదీ చదవండి: పోలీసులకు ఎదురుపడిన క్రిమినల్స్.. సినిమాను తలపించిన సీన్..!
Comments
Please login to add a commentAdd a comment