ఇరాన్‌ రాయబారిని బహిష్కరించిన పాక్‌ | Pakistan Expels Iran Ambassador After Air Strike - Sakshi
Sakshi News home page

ఇరాన్‌ రాయబారిని బహిష్కరించిన పాకిస్థాన్‌

Published Wed, Jan 17 2024 5:39 PM | Last Updated on Wed, Jan 17 2024 6:39 PM

Pakistan Expels Iran Envoy And Recall Its Counterpart  - Sakshi

ఇస్లామాబాద్‌: ఇరాన్‌ దేశ రాయబారిని తమ దేశం నుంచి పాకిస్థాన్‌ బహిష్కరించింది. తమ దేశానికి చెందిన రాయబారిని కూడా ఇరాన్‌ వదిలి వచ్చేయాలని కోరింది. తమ భూభాగంలోని బలూచిస్థాన్‌ ప్రావిన్సులో ఇరాన్‌ దాడులు జరపడం చట్ట విరుద్ధమని పాకిస్థాన్‌ ప్రకటించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

‘పాకిస్థాన్‌ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఇరాన్‌ వ్యవహరించింది. మంగళవారం రాత్రి మా వైపు నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్న పిల్లలు మృతి చెందారు. ఐక్యరాజ్యసమితి నిబంధనలతో పాటు అంతర్జాతీయ చట్టాలను ఇరాన్‌ ఉల్లంఘించింది’ అని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇరాక్‌పై వైమానిక దాడులు జరిపిన మరుసటి రోజే ఇరాన్‌ పాకిస్థాన్‌పై మిసైళ్లు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. అయితే స్వతంత్ర బలూచిస్థాన్‌ను డిమాండ్‌ చేస్తున్న జైషే అల్‌ అదిల్‌ ఉగ్రవాదులు లక్ష్యంగానే తాము డ్రోన్‌లతో దాడులు చేసినట్లు ఇరాన్‌ ఆర్మీ ప్రకటించింది. పాక్‌, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తలు పెరగడం పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. 

ఇదీచదవండి.. థాయ్‌లాండ్‌లో భారీ పేలుడు.. 18 మంది మృతి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement